Trainee Vacancies : సెయిల్ రూర్కెలా ఇస్పాట్ జనరల్ హాస్పటల్ లో 200 ట్రైనీ ఖాళీల భర్తీ

దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల అర్హతలకు సంబంధించి గుర్తింపుపొందిన బోర్డు నుంచి పదో తరగతి, బీఎస్సీ నర్సింగ్, జీఎన్బీ డిప్లొమా, పీజీడీసీఏ, బీఎమ్ఎల్టీ, ఎంబీఏ,బీబీఏ,పీజీ డిప్లొమా,డిగ్రీ,బీపీటీ,డీ ఫార్మసీ,బీఫార్మీసీ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే దరఖాస్తుదారుల వయసు 18 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి. ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

Trainee Vacancies : సెయిల్ రూర్కెలా ఇస్పాట్ జనరల్ హాస్పటల్ లో 200 ట్రైనీ ఖాళీల భర్తీ
ad

Trainee Vacancies : భారత ప్రభుత్వ సంస్థ అయిన స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియాకు (సెయిల్)కు చెందిన రూర్కెలాలోని ఇస్పాట్‌ జనరల్‌ ఆసుపత్రిలో ట్రైనీ ఖాళీల భర్తీ చేపట్టనున్నారు. ఈనోటిఫికేషన్ ద్వారా మొత్తం 200 ట్రైనీ (నర్సింగ్‌) పోస్టుల భర్తీ చేయనున్నారు. ఆసక్తి,అర్హత కలిగిన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతున్నారు. ఖాళీల వివరాలకు సంబంధించి మెడికల్ అటెండెంట్ ట్రైనీ 100, క్రిటికల్ కేర్ నర్సింగ్ ట్రైనీ 20, అడ్వాన్స్‌డ్ స్పెషలైజ్డ్ నర్సింగ్ ట్రైనీ 40 డేటా ఎంట్రీ ఆపరేటర్ మెడికల్ ట్రాన్స్‌క్రిప్షన్ ట్రైనీ 6, మెడికల్ ల్యాబ్. టెక్నీషియన్ ట్రైనీ10, హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ ట్రైనీ 10, ఓటీ/అనస్థీషియా, అసిస్టెంట్ ట్రైనీ 5, అడ్వాన్స్‌డ్ ఫిజియోథెరపీ ట్రైనీ 3, రేడియోగ్రాఫర్ ట్రైనీ 3, ఫార్మసిస్ట్ ట్రైనీ 3ఖాళీలు ఉన్నాయి.

దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల అర్హతలకు సంబంధించి గుర్తింపుపొందిన బోర్డు నుంచి పదో తరగతి, బీఎస్సీ నర్సింగ్, జీఎన్బీ డిప్లొమా, పీజీడీసీఏ, బీఎమ్ఎల్టీ, ఎంబీఏ,బీబీఏ,పీజీ డిప్లొమా,డిగ్రీ,బీపీటీ,డీ ఫార్మసీ,బీఫార్మీసీ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే దరఖాస్తుదారుల వయసు 18 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి. ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అర్హులైన అభ్యర్ధులను ఇంటర్వ్యూకి పిలుస్తారు. ఎంపికైనవారికి నెలకు రూ.9000ల నుంచ రూ.17000ల స్టైపెండ్‌ చెల్లిస్తారు. ఆగస్టు 20, 2022వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. పూర్తి వివరాలకు వెబ్ సైట్ ; https://sailcareers.com పరిశీలించగలరు.