AIIMS Recruitment : ఆల్‌ ఇండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్ మెడికల్‌ సైన్సెస్‌ లో ఉద్యోగ ఖాళీల భర్తీ

దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు మెడికల్‌ కౌన్సిల్ ఆఫ్‌ ఇండియా గుర్తింపు పొందిన ఏదైనా యూనివర్సిటీ నుంచి సంబంధిత స్పెషలైజేషన్‌లో డీఎమ్‌/డీఎన్‌బీ/ఎంఎస్‌/ఎండీ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.

AIIMS Recruitment : ఆల్‌ ఇండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్ మెడికల్‌ సైన్సెస్‌ లో ఉద్యోగ ఖాళీల భర్తీ

All India Institute of Medical Sciences Jodhpur Vacancies

AIIMS Recruitment : భారత ప్రభుత్వ ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖకు చెందిన జోధ్‌పూర్‌లోని ఆల్‌ ఇండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్ మెడికల్‌ సైన్సెస్‌లో సీనియర్ రెసిడెంట్ పోస్టుల భర్తీ చేపట్టనున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 13 సీనియర్ రెసిడెంట్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్ధుల నుండి దరఖాస్తులు కోరుతున్నారు.

గ్యాస్ట్రోఎంటరాలజీ, జనరల్‌ సర్జరీ, మెడికల్‌ ఆంకాలజీ/హెమటాలజీ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టులను ఈ నోటిఫికేషన్‌ ద్వారా భర్తీ చేయనున్నారు. దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు మెడికల్‌ కౌన్సిల్ ఆఫ్‌ ఇండియా గుర్తింపు పొందిన ఏదైనా యూనివర్సిటీ నుంచి సంబంధిత స్పెషలైజేషన్‌లో డీఎమ్‌/డీఎన్‌బీ/ఎంఎస్‌/ఎండీ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అభ్యర్ధుల వయసు 45 యేళ్లకు మించకుండా ఉండాలి.

ఇంటర్వ్యూలో ఎంపికైన వారికి నెలకు రూ.67,700ల జీతంతోపాటు ఇతర అలవెన్సులు కూడా చెల్లిస్తారు. ఈ అర్హతలున్నవారు నవంబర్‌ 22, 2022వ తేదీన నిర్వహించే ఇంటర్వ్యూకు నేరుగా హాజరుకావచ్చు. ఇంటర్వ్యూ చిరునామా ; Medical College of AIIMS, Jodhpur (Rajasthan). పూర్తి వివరాలకు వెబ్ సైట్ ; https://www.aiimsjodhpur.edu.in/ పరిశీలించగలరు.