Balmer Lawrie Recruitment : బామర్‌లారీ అండ్‌ కో లిమిటెడ్‌లో పలు ఉద్యోగ ఖాళీల భర్తీ

అభ్యర్ధుల అర్హతలకు సంబంధించి పోస్టును బట్టి సంబంధిత స్పెషలైజేషన్‌లో ఇంజినీరింగ్‌ గ్రాడ్యుయేషన్‌/ ఎంఎస్సీ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే 5 నుంచి 11 ఏళ్ల పని అనుభవం కూడా ఉండాలి. అభ్యర్ధుల వయసు 27 నుంచి 40 ఏళ్లకు మించకుండా ఉండాలి.

Balmer Lawrie Recruitment : బామర్‌లారీ అండ్‌ కో లిమిటెడ్‌లో పలు ఉద్యోగ ఖాళీల భర్తీ

Balmer Lawrie Recruitment : భారత ప్రభుత్వ పెట్రోలియం, నేచురల్‌ గ్యాస్‌ మంత్రిత్వశాఖకు చెందిన కోల్‌కతాకు చెందిన బామర్‌లారీ అండ్‌ కో లిమిటెడ్‌లో పలు ఉద్యోగ ఖాళీల భర్తీ చేపట్టనున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 40 సీనియర్‌ మేనేజర్‌, మేనేజర్‌, డిప్యూటీ మేనేజర్, అసిస్టెంట్‌ మేనేజర్‌ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతున్నారు. రిటైల్‌ సేల్స్‌, ఇండస్ట్రియల్‌ సేల్స్‌, మేనేజ్‌మెంట్‌, టెక్నికల్‌ సర్వీస్‌, ప్రొడక్ట్‌ డెవలప్‌మెంట్‌ తదితర విభాగాల్లో ఈ ఖాళీలు ఉన్నాయి.

అభ్యర్ధుల అర్హతలకు సంబంధించి పోస్టును బట్టి సంబంధిత స్పెషలైజేషన్‌లో ఇంజినీరింగ్‌ గ్రాడ్యుయేషన్‌/ ఎంఎస్సీ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే 5 నుంచి 11 ఏళ్ల పని అనుభవం కూడా ఉండాలి. అభ్యర్ధుల వయసు 27 నుంచి 40 ఏళ్లకు మించకుండా ఉండాలి. విద్యార్హతలు, అనుభవం, ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు. అర్హత సాధించిన వారికి నెలకు రూ.40,000ల నుంచి రూ.1,80,000ల వరకు జీతంగా చెల్లిస్తారు. పూర్తి వివరాలకు వెబ్ సైట్ ; https://www.balmerlawrie.com/ పరిశీలించగలరు.