DRDO JOBS : దిల్లీలోని డీఆర్డీఓ ఆర్ఎసీలో ఖాళీల భర్తీ

దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల అర్హతలకు సంబంధించి పోస్టుల అధారంగా సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ, బీటెక్, మాస్టర్స్ డిగ్రీ, పీహెచ్ డీ, ఉత్తీర్ణత సాధించి ఉండాలి. వీటితో పాటు పనిలో అనుభవం , టెక్నికల్ నాలెడ్జ్ కలిగి ఉండాలి.

DRDO JOBS : దిల్లీలోని డీఆర్డీఓ ఆర్ఎసీలో ఖాళీల భర్తీ

Drdo Rac, Delhi

DRDO JOBS : భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన దిల్లీలోని డీఆర్డీఓ పలు పోస్టుల భర్తీ చేపట్టనుంది. రిక్రూట్ మెంట్ అండ్అసెస్ మెంట్ సెంటర్ లో ఉన్నా 58 సైంటిస్ట్ ఖాళీలను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనన్నారు. మెకానికల్, ఏరోనాటికల్, ఇంజినీరింగ్, మెకానికల్ ఇంజినీరింగ్, నావల్ ఆర్కిటెక్చర్ అండ్ షిప్ బిల్డింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యునికేషన్ ఇంజినీరింగ్, కెమికల్ ఇంజినీరింగ్, రేడియేషన్ ఫిజిక్స్ తదితర విభాగాల్లో ఈ ఖాళీలు ఉన్నాయి.

దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల అర్హతలకు సంబంధించి పోస్టుల అధారంగా సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ, బీటెక్, మాస్టర్స్ డిగ్రీ, పీహెచ్ డీ, ఉత్తీర్ణత సాధించి ఉండాలి. వీటితో పాటు పనిలో అనుభవం , టెక్నికల్ నాలెడ్జ్ కలిగి ఉండాలి. అభ్యర్ధుల వయస్సు 35 ఏళ్ల నుండి 50 సంవత్సరాల మధ్య ఉండాలి. అభ్యర్ధులు తమ దరఖాస్తులను ఆన్ లైన్ విధానంలో పంపాల్సి ఉంటుంది. ఎంపిక విధానానికి సంబంధించి ముందుగా అనుభవం అధారంగా దరఖాస్తులను షార్ట్ లిస్ట్ చేస్తారు. అనంతరం ఇంటర్వ్యూ అధారంగా తుది ఎంపిక ఉంటుంది. ప్రస్తుతం దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతుంది. పూర్తి వివరాలకు వెబ్ సైట్ ; https://rac.gov.in పరిశీలించగలరు.