FSI Recruitment : ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా డెహ్రుడూన్ లో ఒప్పంద ఖాళీల భర్తీ

దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల అర్హతల విషయానికి వస్తే సంబంధిత స్పెషలైజేషన్‌లో ఎంసీఏ, ఎంఎస్సీ, బీటెక్‌, ఎంఏ(జియోగ్రఫీ), డిప్లొమా,రిమోట్ సెన్సింగ్, జీఐఎస్‌లో సర్టిఫికేట్ కోర్సు లేదా తత్సమాన అర్హత ఉన్నవారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. అలాగే సంబంధిత పని అనుభవం కూడా ఉండాలి. వయోపరిమితి 40 సంవత్సరాలకు మించ కూడదు.

FSI Recruitment : ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా డెహ్రుడూన్ లో ఒప్పంద ఖాళీల భర్తీ

FSI Recruitment : కేంద్ర ప్రభుత్వ పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పు మంత్రిత్వ శాఖకు చెందిన ఉత్తరాఖండ్‌లోని డెహ్రాడూన్‌ ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా లో పలు ఒప్పంద ఉద్యోగ ఖాళీల భర్తీ చేపట్టనున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 11 టెక్నికల్ అసోసియేట్, ప్రోగ్రామర్ పోస్టుల భర్తీ చేస్తున్నారు. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతున్నారు.

దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల అర్హతల విషయానికి వస్తే సంబంధిత స్పెషలైజేషన్‌లో ఎంసీఏ, ఎంఎస్సీ, బీటెక్‌, ఎంఏ(జియోగ్రఫీ), డిప్లొమా,రిమోట్ సెన్సింగ్, జీఐఎస్‌లో సర్టిఫికేట్ కోర్సు లేదా తత్సమాన అర్హత ఉన్నవారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. అలాగే సంబంధిత పని అనుభవం కూడా ఉండాలి. వయోపరిమితి 40 సంవత్సరాలకు మించ కూడదు.

ఆసక్తి కలిగినవారు ఆన్‌లైన్‌ ద్వారా ఆగస్టు 25, 2022 వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు. పూర్తి వివరాలకు వెబ్ సైట్ ; https://fsi.nic.in/పరిశీలించగలరు.