JOBS : టీహెచ్ డీసీ లో ఇంజినీర్ పోస్టుల భర్తీ
దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల అర్హతలకు సంబంధించి కనీసం 60 శాతం మార్కులతో సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ,బీటెక్,బీఎస్సీ(ఇంజనీరింగ్) ఉత్తీర్ణులై ఉండాలి. సంబంధిత పనిలో ఏడాది అనుభవం ఉండాలి. అభ్యర్ధుల వయసు 32 ఏళ్లు మించకూడదు.

JOBS : టీహెచ్‌డీసీ ఇండియా లిమిటెడ్ లో వివిధ విభాగాల్లో ఉద్యోగ ఖాళీల భర్తీ చేపట్టనున్నారు. నిర్ణీత కాల ఒప్పంద ప్రాతిపదికన 109 ఇంజనీర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్ధుల నుండి దరఖాస్తులు కోరుతున్నారు. సివిల్, ఎలక్ట్రికల్, మెకానికల్, ఫ్లూయిడ్ మెకానిక్స్, పవర్ ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్ మెషిన్స్ తదితర విభాగాల్లో ఈ ఖాళీలు ఉన్నాయి.
దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల అర్హతలకు సంబంధించి కనీసం 60 శాతం మార్కులతో సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ,బీటెక్,బీఎస్సీ(ఇంజనీరింగ్) ఉత్తీర్ణులై ఉండాలి. సంబంధిత పనిలో ఏడాది అనుభవం ఉండాలి. అభ్యర్ధుల వయసు 32 ఏళ్లు మించకూడదు. ఎంపిక విధానం విషయానికి వస్తే షార్ట్‌లిస్టింగ్, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు. ఎంపికైన వారికి నెలకు రూ.60,000 వేతనంగా చెల్లిస్తారు.
అభ్యర్ధులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది 19 ఆగస్టు 2022గా నిర్ణయించారు. పూర్తి వివరాలకు వెబ్‌సైట్: https://thdc.co.in/ పరిశీలించగలరు.