IIT Kharagpur Job Vacancies : ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ ఖరగ్‌పూర్‌ లో ఉద్యోగ ఖాళీల భర్తీ

ఆసక్తి, అర్హతక కలిగిన అభ్యర్ధుల నుండి దరఖాస్తులు కోరుతున్నారు. అభ్యర్ధులు పోస్టును బట్టి సంబంధిత స్పెషలైజేషన్‌లో ఇంటర్మీడియట్‌, బ్యాచిలర్స్‌ డిగ్రీ, ఇంజినీరింగ్‌ డిప్లొమా, ఎంబీఏ లేదా లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. సంబంధిత పనిలో నోటిఫికేషన్‌లో సూచించిన విధంగా అనుభవం కూడా ఉండాలి.

IIT Kharagpur Job Vacancies : ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ ఖరగ్‌పూర్‌ లో ఉద్యోగ ఖాళీల భర్తీ

IIT Kharagpur

Updated On : June 17, 2023 / 11:08 AM IST

IIT Kharagpur Job Vacancies : కేంద్ర ప్రభుత్వ సంస్థ ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (ఐఐటీ) ఖరగ్ పూర్ లో పలు ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 153 ఖాళీలను భర్తీ చేయనున్నారు. భర్తీ చేయనున్న ఖాళీల్లో జూనియర్‌ ఎగ్జిక్యూటివ్‌, స్టాఫ్‌ నర్స్‌, జూనియర్‌ అసిస్టెంట్‌, జూనియర్‌ టెక్నీషియన్‌, సీనియర్‌ లైబ్రరీ ఇన్ఫర్మేషన్‌ అసిస్టెంట్‌, డ్రైవర్‌ గ్రేడ్‌, సెక్యూరిటీ, ఇన్‌స్పెక్టర్‌ (నాన్ టీచింగ్) తదితర పోస్టులు ఉన్నాయి.

ఆసక్తి, అర్హతక కలిగిన అభ్యర్ధుల నుండి దరఖాస్తులు కోరుతున్నారు. అభ్యర్ధులు పోస్టును బట్టి సంబంధిత స్పెషలైజేషన్‌లో ఇంటర్మీడియట్‌, బ్యాచిలర్స్‌ డిగ్రీ, ఇంజినీరింగ్‌ డిప్లొమా, ఎంబీఏ లేదా లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. సంబంధిత పనిలో నోటిఫికేషన్‌లో సూచించిన విధంగా అనుభవం కూడా ఉండాలి. పోస్టును బట్టి 25 నుంచి 30 యేళ్ల మధ్య వయస్సు కలిగి ఉండాలి.

షార్ట్‌లిస్టింగ్‌, ఇంటెరాక్షన్‌, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఎంపికైన వారికి పోస్టును బట్టి నెలకు రూ.21,7000ల నుంచి రూ.1,12,400ల వరకు జీతంగా చెల్లిస్తారు. అభ్యర్ధులు ఆన్‌లైన్‌ విధానంలో జులై 5, 2023వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. పూర్తి వివరాలకు వెబ్ సైట్ ; https://www.iitkgp.ac.in/ పరిశీలించగలరు.