Epil Jobs : ఇంజినీరింగ్ ప్రాజెక్ట్స్ లిమిటెడ్ లో ఉద్యోగాల భర్తీ

దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల అర్హతల విషయానికి వస్తే పోస్టులను అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ, బీటెక్, బ్యాచిలర్ ఆఫ్ ఆర్కిటెక్చర్, ఎల్ ఎల్ బీ, సీఏ, ఐసీడబ్ల్యూఏ, ఎంబీఏ ఫైనాన్స్ ఉత్తీర్ణత కలిగి ఉండాలి.

Epil Jobs : ఇంజినీరింగ్ ప్రాజెక్ట్స్ లిమిటెడ్ లో ఉద్యోగాల భర్తీ

Epil

Updated On : April 26, 2022 / 8:26 AM IST

Epil Jobs : ఇంజినీరింగ్ ప్రాజెక్ట్స్ లిమిటెడ్ (ఈపీఐఎల్) లో ఉద్యోగాల భర్తీ చేపట్టనున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 93 ఖాళీలు భర్తీ చేయనున్నారు. సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్, ఫైనాన్స్, లీగల్ తదితర విభాగాల్లో ఈ ఖాళీలు ఉన్నాయి. పోస్టుల ఖాళీల వివరాలకు పరిశీలిస్తే ఇంజినీర్ మెకానికల్ 1 ఖాళీ, అసిస్టెంట్ మేనేజర్లు 60ఖాళీలు, మేనేజర్లు 26ఖాళీలు, సీనియర్ మేనేజర్లు 6ఖాళీలు భర్తీ చేయనున్నారు.

దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల అర్హతల విషయానికి వస్తే పోస్టులను అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ, బీటెక్, బ్యాచిలర్ ఆఫ్ ఆర్కిటెక్చర్, ఎల్ ఎల్ బీ, సీఏ, ఐసీడబ్ల్యూఏ, ఎంబీఏ ఫైనాన్స్ ఉత్తీర్ణత కలిగి ఉండాలి. సంబంధిత పనిలో అనుభవం కలిగి ఉండాలి.

అభ్యర్ధులు తమ దరఖాస్తులను ఆన్ లైన్ ద్వారా పంపాల్సి ఉంటుంది. దరఖాస్తులకు చివరి తేది మే 11, 2022గా నిర్ణయించారు. పూర్తి వివరాలకు వెబ్ సైట్ https://epi.gov.in/content/పరిశీలించగలరు.