NCERT JOBS : ఎన్సీఈఆర్టీలో ఉద్యోగాల భర్తీ |Job replacement in NCERT

NCERT JOBS : ఎన్సీఈఆర్టీలో ఉద్యోగాల భర్తీ

అభ్యర్ధుల అర్హతల విషయానికి వస్తే వసంబంధింత స్పెషలైజేషన్ లో మాస్టర్స్ డిగ్రీ , బ్యాచిలర్స్ డిగ్రీలో లేదా తత్సమాన కోర్సులో కనీసం 55 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.

NCERT JOBS : ఎన్సీఈఆర్టీలో ఉద్యోగాల భర్తీ

NCERT JOBS : న్యూదిల్లీలోని నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ (ఎన్సీఆర్టీ)కి చెందిన ఎడ్యుకేషన్ ఇన్ సోషల్ సైన్సెస్ లో ఉద్యోగాల భర్తీ చేపట్టనున్నారు. ఒప్పంద ప్రాతిపదికన డిజిటల్ కంటెంట్ డెవలపర్, గ్రాఫిక్ ఆర్టిస్ట్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఆసక్తిగల, అర్హులైన అభ్యర్ధుల నుండి దరఖాస్తులు కోరుతున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 4 ఖాళీలను భర్తీ చేస్తున్నారు. దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల వయస్సు 40 ఏళ్లకు మించరాదు.

అభ్యర్ధుల అర్హతల విషయానికి వస్తే వసంబంధింత స్పెషలైజేషన్ లో మాస్టర్స్ డిగ్రీ , బ్యాచిలర్స్ డిగ్రీలో లేదా తత్సమాన కోర్సులో కనీసం 55 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. సంబంధిత పనిలో అనుభవం ఉండాలి. అభ్యర్ధులను ఇంటర్య్వూ అధారంగా ఎంపిక చేస్తారు. ఎంపికైన వారికి నెలకు 29,000రూ వేతనంగా చెల్లిస్తారు. ఆసక్తి కలిగిన అభ్యర్ధులు నేరుగా ఇంటర్వ్యూకి హాజరు కావాల్సి ఉంటుంది. ఇంటర్వ్యూ కు హాజరు కావాల్సిన చిరునామా ; సీఐఈటీ, 2వ ఫ్లోర్, రూమ్ నెం; 207, ఎన్సీఈఆర్ టీ శ్రీ అరబిందో మార్గ్, న్యూదిల్లీ -110016, ఇంటర్వ్యూ తేదీ జూన్ 2, 2022గా నిర్ణయించారు. పూర్తి వివరాలకు వెబ్ సైట్ ; https://ncert.nic.in/index.php?ln= పరిశీలించగలరు.

 

×