NEET – UG 2021 : పరీక్ష రద్దుచేయాలంటు సుప్రీం మెట్లెక్కిన విద్యార్థులు

సెప్టెంబర్ 12వ తేదీన నీట్ - యూజీ 2021 పరీక్ష జరిగిన విషయం విదితమే.. ఈ పరీక్షలో అవకతవకలు జరిగాయంటూ అభ్యర్థులు సుప్రీం కోర్టు తలుపు తట్టారు.

NEET – UG 2021 :  పరీక్ష రద్దుచేయాలంటు సుప్రీం మెట్లెక్కిన విద్యార్థులు

Neet Ug 2021

NEET – UG 2021 : సెప్టెంబర్ 12వ తేదీన నీట్ – యూజీ 2021 పరీక్ష జరిగిన విషయం విదితమే.. ఈ పరీక్షలో అవకతవకలు జరిగాయంటూ అభ్యర్థులు సుప్రీం కోర్టు తలుపు తట్టారు. కొందరు విద్యార్థులు అక్రమ మార్గాల ద్వారా పరీక్ష కాపీ కొట్టారని పిటిషన్ లో పేర్కొన్నారు. ఎందుకు సంబందించిన వివరాలను జత చేస్తూ దీనిపై విచారణ చేపట్టాలని సుప్రీం కోర్టును కోరారు. విచారణ పూర్తయ్యేవరకు ఫలితాలు నిలిపివేయాలని పిటిషన్ లో పేర్కొన్నారు.

Read More : Amazon: గ్రామీణ పాఠశాల స్థాయి నుంచే కంప్యూటర్‌ సైన్స్‌ విద్య

దేశంలో అత్యంత కట్టుదిట్టంగా జరిగే పరీక్షల్లో నీట్ మొదటి స్థానంలో ఉంటుంది. అభ్యర్థులను పూర్తిగా చెక్ చేసి లోపలి పంపుతారు. వారివెంట ఎటువంటి వస్తువులను తీసుకెళ్లనివ్వరు. చెవులకు పెట్టె పోగులను కూడా తీయిస్తుంటారు. కానీ టెక్నాలజీని ఉపయోగించి కొందరు ఈ పరీక్షలో అవకతవకలకు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. రాజస్థాన్, ఉత్తర ప్రదేశ్ రాష్ట్రాల్లో అభ్యర్థులు అధికారుల కళ్లుకప్పి మోసపూరితంగా పరీక్ష రాసినట్లు తేలింది. రాజస్థాన్ లో పరీక్ష నిబంధనలకు వ్యతిరేకంగా, మాస్ కాయింగ్ కి పాల్పడిన విద్యార్థిని గుర్తించి ఆమెతోపాటు ఆమెకు సహకరించిన మొత్తం ఏడుగురిని అరెస్ట్ చేశారు.

Read More : Allu Arjun : అల్లు అర్జున్ తన వైఫ్ ని ఏమని పిలుస్తాడో తెలుసా??

నీట్-యుజిలో జరిగిన అవకతవకలకు సంబంధించిన అన్ని సంబంధిత సమాచారం మరియు డాక్యుమెంట్‌లతో ఒక వారంలోగా సుప్రీంకోర్టు ముందు నిజ నిర్ధారణ నివేదికను సమర్పించాలని రాజస్థాన్, ఉత్తర ప్రదేశ్ సీబీఐ, డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీసులను ఆదేశించింది కోర్టు