Polytechnic Exams : తెలంగాణలో పాలిటెక్నిక్‌ పరీక్షలపై లీకేజ్‌ ఎఫెక్ట్‌.. 8,9న జరిగిన ఎగ్జామ్స్ రద్దు

స్వాతి కాలేజీలో ఎగ్జామ్‌ సెంటర్ రద్దు చేశారు. స్వాతి కాలేజీ విద్యార్థులను మరో కాలేజీకి అధికారులు బదిలీ చేశారు.

Polytechnic Exams : తెలంగాణలో పాలిటెక్నిక్‌ పరీక్షలపై లీకేజ్‌ ఎఫెక్ట్‌.. 8,9న జరిగిన ఎగ్జామ్స్ రద్దు

Exams 11zon

polytechnic Exams : తెలంగాణలో పాలిటెక్నిక్‌ పరీక్షలపై లీకేజ్‌ ఎఫెక్ట్‌ పడింది. 8,9న జరిగిన పరీక్షలను ప్రభుత్వం రద్దు చేసింది. ఈ నెల 15, 16న మళ్లీ పరీక్షలు నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. స్వాతి కాలేజీలో ఎగ్జామ్‌ సెంటర్ రద్దు చేశారు. స్వాతి కాలేజీ విద్యార్థులను అధికారులు మరో కాలేజీకి బదిలీ చేశారు.

పాలిటెక్నిక్ పేపర్ లీకేజ్ కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. పేపర్‌పై ఉన్న వాటర్ మార్క్ ఆధారంగా స్వాతి ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్ కాలేజీలో లీకైనట్లు గుర్తించారు. మెదక్‌లోని చేగుంట పాలిటెక్నిక్ కాలేజీలో ఎగ్జామ్ టైం దాటుతున్న విద్యార్థులు రాకపోవడంతో కాలేజీ స్టాఫ్‌కు అనుమానం రావడంతోనే ఈ గుట్టు బయటపడింది.

CM KCR : ‘మీ బెదిరింపులకు భయపడం’.. మోదీ ప్రభుత్వంపై సీఎం కేసీఆర్ ఫైర్

విద్యార్థులు ఆలస్యంగా వస్తుండటంతో అనుమానం వచ్చి.. విద్యార్థుల ఫోన్లు చెక్‌ చేయగా అందులో ఎగ్జామ్‌కి ముందే పేపర్లు కనిపించాయి. దీంతో వారు విద్యాశాఖ దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే యాక్షన్‌లోకి దిగిన విద్యాశాఖ అధికారులు.. స్వాతి కాలేజ్‌ ఎగ్జామ్‌ సెంటర్‌ను రద్దు చేశారు.

అబ్దుల్లాపూర్‌మెట్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే పేపర్‌ లీకేజీ గురించి తమకు తెలియదని స్వాతి కాలేజీ సిబ్బంది అంటున్నారు. ఎడ్యుకేషన్ డిపార్ట్ మెంట్ నుంచి వచ్చిన అబ్జర్వేటర్ సమక్షంలోనే పేపర్లను ఓపెన్‌ చేశామంటున్నారు.