Recruitment Of Medical Officer : తెలంగాణాలోని రంగారెడ్డి జిల్లా వైద్యఆరోగ్య శాఖలో మెడికల్ ఆఫీసర్ పోస్టుల భర్తీ !

దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల అర్హతల విషయానికి వస్తే ఎంబీబీఎస్ ఉత్తీర్ణులై ఉండాలి. అభ్యర్ధుల వయస్సు 18 నుండి 44 సంవత్సరాల మధ్య ఉండాలి.

Recruitment Of Medical Officer : తెలంగాణాలోని రంగారెడ్డి జిల్లా వైద్యఆరోగ్య శాఖలో మెడికల్ ఆఫీసర్ పోస్టుల భర్తీ !

Recruitment of medical officer posts in Rangareddy district medical department in Telangana!

Updated On : February 10, 2023 / 1:48 PM IST

Recruitment Of Medical Officer : తెలంగాణా రాష్ట్ర పరిధిలోని రంగారెడ్డి జిల్లా వైద్యఆరోగ్య శాఖలో పలు ఉద్యోగ ఖాళీలను భర్తీ చేపట్టనున్నారు. ఆరోగ్య మిషన్ లో భాగంగా ఒప్పంద ప్రాతిపదికన మెడికల్ ఆఫీసర్ పోస్టుల నియామకాలను చేపడుతున్నారు. ఈనోటిఫికేషన్ ద్వారా మొత్తం 49 పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్ధుల నుండి దరఖాస్తులు కోరుతున్నారు.

దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల అర్హతల విషయానికి వస్తే ఎంబీబీఎస్ ఉత్తీర్ణులై ఉండాలి. అభ్యర్ధుల వయస్సు 18 నుండి 44 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎంపిక విధానానికి సంబంధించి ఎంబీబీఎస్ మార్కులు, రూల్ ఆఫ్ రిజర్వేషన్ అధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.

అభ్యర్ధుల ఆఫ్ లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తులు పంపాల్సిన చిరునామా ; రంగారెడ్డి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి కార్యాలయం చిరునామాకు పంపాలి. దరఖాస్తు స్వీకరణకు చివరి తేదిగా ఫిబ్రవరి 15, 2023గా నిర్ణయించారు. పూర్తి వివరాలకు వెబ్ సైట్ ; https://rangareddy.telangana.gov.in/ పరిశీలించగలరు.