HURL JOBS : హెచ్ యూఆర్ ఎల్ లో ఒప్పంద ఉద్యోగాల భర్తీ

దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల వయస్సు పోస్టుల్ని అనుసరించి 35 నుంచి 50ఏళ్ల మధ్య ఉండాలి. పోస్టుల్ని అనుసరించి ఏడాదికి రూ.8.5లక్షల నుంచి రూ.27 లక్షల వరకు వేతనంగా చెల్లిస్తారు.

HURL JOBS : హెచ్ యూఆర్ ఎల్ లో ఒప్పంద ఉద్యోగాల భర్తీ

Hurl

HURL JOBS : ఐఓసీఎల్, ఎన్‌టీపీసీ, కోల్‌ ఇండియా, ఎఫ్‌సీఐఎల్, హెచ్‌ఎఫ్‌సీఎల్‌ సబ్సిడరీ సంస్థ అయిన హిందుస్థాన్‌ ఉర్వరక్‌ అండ్‌ రసాయన్‌ లిమిటెడ్‌ (హెచ్‌యూఆర్‌ఎల్‌)లో ఉద్యోగాల భర్తీ చేపట్టనున్నారు. ఒప్పంద ప్రాతిపదికన ఎగ్జిక్యూటివ్‌ పోస్టుల భర్తీ చేయనున్నారు. అర్హత, ఆసక్తి గల అభ్యర్ధుల నుండి దరఖాస్తులు కోరుతున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 179 పోస్టులను భర్తీ చేయనున్నారు.

మార్కెటింగ్, సేఫ్టీ, ఫైర్, ఇన్‌స్ట్రుమెంటేషన్, ఎలక్ట్రికల్, మెకానికల్, ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ తదితర విభాగాల్లో ఈ ఖాళీలు ఉన్నాయి. పోస్టుల వివరాలకు సంబంధించి చీఫ్‌ మేనేజర్, మేనేజర్, అసిస్టెంట్‌ మేనేజర్, ఇంజనీర్, కంపెనీ సెక్రటరీ తదితర పోస్టులు ఉన్నాయి. అభ్యర్ధుల అర్హతల విషయానికి వస్తే పోస్టుల్ని అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో బీఎస్సీ, బీఈ, బీటెక్, ఎమ్మెస్సీ, ఎంబీఏ, సీఏ, సీఎంఏ ఉత్తీర్ణులైన వారు అర్హులు.సంబంధిత పనిలో అనుభవం కలిగి ఉండాలి.

దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల వయస్సు పోస్టుల్ని అనుసరించి 35 నుంచి 50ఏళ్ల మధ్య ఉండాలి. పోస్టుల్ని అనుసరించి ఏడాదికి రూ.8.5లక్షల నుంచి రూ.27 లక్షల వరకు వేతనంగా చెల్లిస్తారు. కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్, గ్రూప్‌ డిస్కషన్, పర్సనల్‌ ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపికచేస్తారు. అభ్యర్ధులు దరఖాస్తులను ఆన్‌లైన్‌ ద్వారా పంపాల్సి ఉంటుంది. ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది మే 11, 2022గా నిర్ణయించారు. పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌ https://www.hurl.net.in పరిశీలించగలరు.