SBI Jobs : ఎస్బీఐలో భారీగా ఉద్యోగాలు.. అప్లయ్ చేసుకున్నారా?

దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) భారీగా ఉద్యోగాల భర్తీకి జాబ్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి, అర్హత ఉన్నవాళ్లు వెంటనే అప్లయ్ చేసుకోండి.

SBI Jobs : ఎస్బీఐలో భారీగా ఉద్యోగాలు.. అప్లయ్ చేసుకున్నారా?

Sbi Jobs

SBI Jobs : బ్యాంకులో జాబ్ కోసం ట్రై చేస్తున్నారా? ప్రభుత్వ రంగ బ్యాంకులో జాబ్ కొట్టడం లక్ష్యంగా పెట్టుకున్నారా? అయితే మీకో గుడ్ న్యూస్. దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) భారీగా ఉద్యోగాల భర్తీకి జాబ్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి, అర్హత ఉన్నవాళ్లు వెంటనే అప్లయ్ చేసుకోండి. ఎందుకంటే దరఖాస్తు గడువు దగ్గరపడింది.

ఎస్బీఐలో రెగులర్, బ్యాక్ లాగ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. సెంట్రల్ రిక్రూట్ మెంట్ అండ్ ప్రమోషన్ విభాగం కింద ఈ ఉద్యోగాలు భర్తీ చేయనున్నారు.

Major Financial Works : డిసెంబర్ 31లోగా ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే నష్టపోతారు..

* మొత్తం పోస్టులు – 1,226 పోస్టులున్నాయి.

* ఇందులో రెగులర్ పోస్టులు – 1100

* బ్యాక్‌లాగ్ పోస్టులు – 126

* సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ (CBO) పోస్టులు భర్తీ.

* గుజరాత్, కర్నాటక, మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్, తమిళనాడు, రాజస్తాన్ రాష్ట్రాల్లో ఖాళీలను భర్తీ చేస్తారు.

* దరఖాస్తుకి చివరి తేదీ 2021 డిసెంబర్ 29.

* వయసు – 2021 డిసెంబర్ 1 నాటికి 21 నుంచి 30 ఏళ్ల లోపు ఉండాలి.
ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్లు, ఓబీసీ అభ్యర్థులకు మూడేళ్లు వయస్సులో సడలింపు.

* విద్యార్హత- గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ పాస్ కావాలి.

* ఎంపిక ప్రక్రియ-ఆన్ లైన్ లో రాతపరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక.
* దరఖాస్తు ఫీజు- రూ.750(ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యుడీ అభ్యర్థులకు ఎలాంటి ఫీజు లేదు)

* 2022 జనవరిలో ఆన్‌లైన్ టెస్ట్

* ఆన్‌లైన్ ఫీజు పేమెంట్ డిసెంబర్ 29 లోగా చెల్లించాలి.

* జీతం : సుమారుగా రూ.36వేలు.. పూర్తి చేసిన ప్రతి సంవత్సరానికి ఒక ఇంక్రిమెంట్.

* అభ్యర్థులు బ్యాంక్ అధికారిక వెబ్‌సైట్ https://bank.sbi/careers ద్వారా ఆన్‌లైన్‌లో అప్లయ్ చేసుకోవాలి.

Covid Booster Dose : కోవిడ్ బూస్టర్ డోసుకు మీరు అర్హులేనా? ఇలా తెలుసుకోండి..!

* నిర్దిష్ట రాష్ట్రానికి చెందిన ఖాళీల కోసం దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఆ రాష్ట్రంలో పేర్కొన్న స్థానిక భాషలో ప్రావీణ్యం (చదవడం, రాయడం, అర్థం చేసుకోవడం) కలిగి ఉండాలి.

* ఎంపిక ప్రక్రియలో భాగంగా దరఖాస్తు చేసుకున్న రాష్ట్రంలోని నిర్దిష్ట ఎంపిక చేసిన స్థానిక భాష పరిజ్ఞానం పరీక్ష నిర్వహించబడుతుంది.

* 10వ లేదా 12వ స్టాండర్డ్ మార్కు షీట్/సర్టిఫికేట్ సమర్పించే అభ్యర్థులు, దరఖాస్తు చేసుకున్న రాష్ట్రంలోని పేర్కొన్న స్థానిక భాషను సబ్జెక్ట్‌లలో ఒకటిగా అధ్యయనం చేసినందుకు రుజువు కలిగున్నవారు భాషా పరీక్షలో పాల్గొనాల్సిన అవసరం లేదు.

ఖాళీ వివరాలు
అహ్మదాబాద్ (గుజరాతి) : 354
బెంగళూరు (కన్నడ): 278
భోపాల్ (హిందీ): 214
చెన్నై (తమిళం): 276
జైపూర్ (హిందీ): 104