తెలంగాణ ఎంట్రన్స్ పరీక్షలపై నిర్ణయం .. సెప్టెంబర్ 9 నుంచి ఎంసెట్.. ఈ 17 నుంచి ఇంటర్ క్లాసులు..ఈనెల 20 నుంచి డిజిటల్ క్లాసులు

  • Published By: sreehari ,Published On : August 10, 2020 / 06:31 PM IST
తెలంగాణ ఎంట్రన్స్ పరీక్షలపై నిర్ణయం .. సెప్టెంబర్ 9 నుంచి ఎంసెట్.. ఈ 17 నుంచి ఇంటర్ క్లాసులు..ఈనెల 20 నుంచి డిజిటల్ క్లాసులు

రాష్ట్రంలో వివిధ సాంకేతిక, వృతి విద్యా కోర్సుల కోసం ఉమ్మడి ప్రవేశ పరీక్ష నిర్వహించేందుకు ఉన్నత విద్యామండలి ప్రయత్నాలు చేపట్టింది. తెలంగాణలో ఎంట్రన్స్ పరీక్షలపై ఉన్నత విద్యామండలి నిర్ణయం తీసుకుంది. స్కూళ్లు, ఇంజినీరింగ్ సహా ఎంసెట్ ప్రవేశ పరీక్షలకు సంబంధించి తేదీలను విద్యాశాఖ విడుదల చేసింది.



ఈ నెల 31న ఈసెట్, సెప్టెంబర్ 2న పాలీసెట్ నిర్వహించనున్నారు. సెప్టెంబర్ 9, 10, 11, 14న తెలంగాణ ఎంసెట్ నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది. టీసీఎస్ ద్వారా ఆన్ లైన్ ఎంట్రన్స్ పరీక్షలు నిర్వహించనున్నారు.

ఈ నెల 17 నుంచి ఇంటర్ ఆన్ లైన్ డిజిటల్ క్లాసులు నిర్వహించనున్నారు. సెప్టెంబర్ 1 తర్వాత ఇంటర్ అడ్మిషన్లపై నిర్ణయం తీసుకోనున్నారు. ఈ నెల 20 నుంచి దోస్త్ డిగ్రీ అడ్మిషన్లు ప్రారంభం కానున్నాయి. ఈ నెల 20 నుంచి ప్రభుత్వ పాఠశాలలో డిజిటల్ క్లాసులు ప్రారంభం కానున్నాయి.



సెప్టెంబర్ 1వ తేదీ నుంచి 3వ తరగతి నుంచి 5వ తరగతి వరకు క్లాసులు ప్రారంభం కానున్నాయి. ఈ నెల 17 నుంచి టీచర్ల అటెండెన్స్ తప్పనిసరి కానుంది. దూరదర్శన్ టీశాట్ ద్వారా 6 నుంచి టెన్త్ వరకు క్లాసులు నిర్వహించనున్నారు.