TS ECET : ఈసెట్ ఫలితాలు విడుదల..24 నుంచి ప్రవేశాల కౌన్సెలింగ్
ఈసెట్ (ECET) ఫలితాల విడుదలకు విద్యాశాఖాధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. 24వ తేదీన ఈసెట్ ప్రవేశాల కౌన్సిలింగ్ నిర్వహించనున్నారు.

Tsecet
TS ECET 2021 : ఈసెట్ (ECET) ఫలితాల విడుదలకు విద్యాశాఖాధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. 2021, ఆగస్టు 18వ తేదీ బుధవారం ఉదయం 11 గంటలకు జేఎన్టీయూహెచ్ (JNTUH) రాష్ట్ర ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ పాపిరెడ్డి ఫలితాలను విడుదల చేయనున్నారు. పాలిటెక్నిక్ చదివిన విద్యార్థులు ఇంజినీరింగ్, బీ ఫార్మసీ రెండో సంవత్సరంలో చేరేందుకు ఈసెట్ నిర్వహించారు. ఈనెల 03వ తేదీన ఈ పరీక్ష జరిగింది. ఈ పరీక్షకు సుమారు 24 వేల మంది అభ్యర్థులు హాజరయ్యారు.
Read More : Petrol : స్థిరంగా పెట్రోల్ ధరలు, ఏ నగరంలో ఎంత ?
ఫలితాల విడుదల అనంతరం 24వ తేదీన ఈసెట్ ప్రవేశాల కౌన్సిలింగ్ నిర్వహించనున్నారు. 24వ తేదీ నుంచి 28 వరక స్లాట్ బుకింగ్, 26వ తేదీ నుంచి 31 వరకు అభ్యర్థులు వెబ్ ఆప్షన్లు ఇవ్వాల్సి ఉంటుంది. సెప్టెంబర్ 02వ తేదీన ఈసెట్ అభ్యర్థులకు అధికారులు సీట్లు కేటాయించనున్నారు. సెప్టెంబర్ 02వ తేదీ నుంచి 07వ తేదీ వరకు ఆన్ లైన్ లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది. ఇక సెప్టెంబర్ 13వ తేదీన ఈసెట్ తుది విడతల ప్రవేశాల షెడ్యూల్ ప్రారంభిస్తారు.
Read More :Volcanoes Erupt: ఒకేసారి బద్దలైన 3 అగ్నిపర్వతాలు.. మానవాళికి ముప్పు ఉందా?
సెప్టెంబర్ 14వ తేదీన తుది విడత ధృవపత్రాల పరిశీలిస్తారు. సెప్టెంబర్ 14, 15వ తేదీల్లో వెబ్ ఆఫ్షన్లకు అవకాశం కల్పిస్తారు. సెప్టెంబర్ 17న తుది విడత ఈసెట్ సీట్లను కేటాయిస్తారు. సెప్టెంబర్ 18వ తేదీ నుంచి 20వ తేదీ వరకు విద్యార్థులు కాలేజీల్లో రిపోర్టు చేయాల్సి ఉంటుంది. అనంతరం సెప్టెంబర్ 18న స్పాట్ ప్రవేశాలకు సంబంధించి మార్గదర్శకాలు జారీ చేస్తారు. ఫలితాల కోసం అభ్యర్థులు ఎదురు చూస్తున్నారు. https://ecet.tsche.ac.in/ వెబ్ సైట్ నుంచి డౌన్ లోడ్ చేసుకోవచ్చు. పూర్తి వివరాలకు విద్యార్థులు https://tsecet.nic.in/ వెబ్‌సైట్ చూడొచ్చు.