TS TET : టీఎస్ టెట్ ప్రాథ‌మిక ‘కీ’ రిలీజ్

జూన్ 12 తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యాయ అర్హత పరీక్ష నిర్వహించారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత టెట్ పరీక్ష నిర్వహించడం ఇది మూడోసారి.

TS TET : టీఎస్ టెట్ ప్రాథ‌మిక ‘కీ’ రిలీజ్

Ts Tet

TS TET Primary Key : రాష్ట్ర వ్యా‌ప్తంగా ఈ నెల 12వ తేదీన ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) నిర్వ‌హించిన సంగ‌తి తెలిసిందే. పేప‌ర్ -1, పేప‌ర్ -2కు సంబంధించిన ప్రాథ‌మిక కీని బుధ‌వారం (జూన్15,2022) టెట్ క‌న్వీన‌ర్ విడుద‌ల చేశారు. స‌మాధానాల‌పై అభ్యంత‌రాల‌ను ఈ నెల 18వ తేదీ లోపు టీఎస్ టెట్ వెబ్‌సైట్ ద్వారా స‌మ‌ర్పించాలి. టీఎస్ టెట్ ప్రాథ‌మిక కీ కోసం https://tstet.cgg.gov.in అనే వెబ్‌సైట్‌ను సంప్ర‌దించవచ్చు.

జూన్ 12 తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యాయ అర్హత పరీక్ష నిర్వహించారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత టెట్ పరీక్ష నిర్వహించడం ఇది మూడోసారి. రెండు పేపర్లు ఉదయం, మధ్యాహ్నం పరీక్షలు నిర్వహించారు. పేపర్-1కు 3,51,468 మంది, పేపర్-2కు 2,77,884 మంది దరఖాస్తు చేసుకున్నారు.

AP TET: ఏపీ టెట్ నోటిఫికేష‌న్ విడుద‌ల

పేపర్-1పరీక్షకు 1480, పేపర్-2 పరీక్షకు 1,203పరీక్షా కేంద్రాలు కాగా.. రెండు పేపర్లకు కలిపి రాష్ట్ర వ్యాప్తంగా 2,683 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. అత్యధికంగా హైదరాబాద్ లో 212, అత్యల్పంగా ములుగు జిల్లాలో 15 పరీక్షా కేంద్రాలను అధికారులు పరీక్షల నిర్వహణ కోసం ఏర్పాటు చేశారు.