Gujarat Polls: రాహుల్ గాంధీకి ఎన్నికల్లో నిలబడే దమ్ము లేకే ఎక్కడెక్కడో తిరుగుతున్నారు.. భారత్ జోడో యాత్రపై అస్సాం సీఎం

భారత్ జోడో యాత్రలో నేపాల్ జాతీయ గీతం ఆలాపనపై అధికార భారతీయ జనతా పార్టీ నుంచి అనేక విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గురువారం నుంచి కాంగ్రెస్ పార్టీపై రాహుల్ గాంధీపై బీజేపీ నేతలు, ఇతర పార్టీల నేతలు సహా దేశ నలుమూలల నుంచి తీవ్ర విమర్శలు వస్తున్నాయి.

Gujarat Polls: రాహుల్ గాంధీకి ఎన్నికల్లో నిలబడే దమ్ము లేకే ఎక్కడెక్కడో తిరుగుతున్నారు.. భారత్ జోడో యాత్రపై అస్సాం సీఎం

Gujarat Polls: రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రను అస్సాం ముఖ్యమంత్రి హిమంత్ బిశ్వా శర్మ విమర్శలు గుప్పించారు. ఎన్నికలు ఒక చోట ఉంటే రాహుల్ ఇంకో చోట తిరుగుతున్నారని, ఎన్నికల్లో నిలబడే దమ్ము రాహుల్ గాంధీకి లేదని ఆయన ఎద్దేవా చేశారు. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా శుక్రవారం కచ్ జిల్లాలో ఏర్పాటు చేసిన ప్రచార కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ రాహుల్ గాంధీపై విరుచుకుపడ్డారు.

‘‘హిమాచల్ ప్రదేశ్‭లో ఎన్నికలు జరిగినప్పుడు ఆయన (రాహుల్ గాంధీ) కేరళలో ఉన్నారు. ఇప్పుడు గుజరాత్‭లో ఎన్నికలు జరుగుతుంటే ఇంకెక్కడో ఉన్నారు. డ్రెస్సింగ్ రూంకి వెళ్లి మైదానంలోకి వచ్చే దమ్ము ఆయనకు లేదు. ఎన్నికల ఆటలో పోటీ పడే సత్తా లేదు’’ అని హిమంత బిశ్వా శర్మ అన్నారు. ఇక, గురువారం భారత్ జోడో యాత్రలో భారత జాతీయ గీతానికి బదులు నేపాల్ జాతీయ గీతం ఆలపించడంపై స్పందిస్తూ ‘‘రాహుల్ గాంధీకి ఈ దేశం గురించి, దేశ చరిత్ర గురించి ఎంతమాత్రం అవగాహన లేదు. ఆయన దేశ వ్యతిరేకి, హిందూ వ్యతిరేకి. ప్రజలు ఆయనపై కచ్చితంగా ప్రతీకారం తీర్చుకుంటారు’’ అని అన్నారు.

భారత్ జోడో యాత్రలో నేపాల్ జాతీయ గీతం ఆలాపనపై అధికార భారతీయ జనతా పార్టీ నుంచి అనేక విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గురువారం నుంచి కాంగ్రెస్ పార్టీపై రాహుల్ గాంధీపై బీజేపీ నేతలు, ఇతర పార్టీల నేతలు సహా దేశ నలుమూలల నుంచి తీవ్ర విమర్శలు వస్తున్నాయి.

Farooq Abdullah: నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ అధినేత పదవి నుంచి వైదొలగిన ఫారూఖ్ అబ్దుల్లా