Nitish kumar on Opposition alliance: శరద్ పవార్‌తో నితీశ్ కుమార్ భేటీ.. కూటమికి నాయకుడు ఎవరన్న విషయంపై స్పందన

‘‘ఎన్డీఏలో లేని పార్టీలను ఏకం చేయాలని నేను, శరద్ పవార్ ప్రయత్నాలు చేస్తున్నాము. ప్రజల కోసం బీజేపీ చేస్తున్నది ఏమీ లేదు. బీజేపీకి ప్రత్యామ్నాయంగా పార్టీలు ఏకం కావాల్సిన అవసరం వచ్చింది. ఈ కూటమికి నాయకుడు ఎవరన్న విషయాన్ని భవిష్యత్తులో నిర్ణయిస్తాం. ముందు ప్రతిపక్ష పార్టీలు ఏకం కావాల్సి ఉంది’’ అని నితీశ్ కుమార్ చెప్పారు. కాగా, ఇప్పటికే నితీశ్ కుమార్ తెలంగాణ సీఎం కేసీఆర్, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, సీపీఐ, సీపీఎం నేతలతో చర్చించారు. ప్రతిపక్షాల నుంచి ప్రధాని అభ్యర్థిని కూడా చర్చించి ప్రకటించాల్సి ఉందని అన్నారు.

Nitish kumar on Opposition alliance

Nitish kumar on Opposition alliance: బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ఇవాళ నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) అధినేత శరద్ పవార్ ను కలిశారు. 2024 లోక్ సభ ఎన్నికల్లో బీజేపీకి వ్యతిరేకంగా ప్రతిపక్షాలను ఏకం చేయడమే లక్ష్యంగా నితీశ్ కుమార్ ఢిల్లీలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన ఇప్పటికే పలువురు ప్రతిపక్ష పార్టీల నేతలను కలిసి చర్చించారు. ఇవాళ శరద్ పవార్ ను కలిసి, దాదాపు 30 నిమిషాల పాటు చర్చించిన అనంతరం నితీశ్ కుమార్ మీడియాతో మాట్లాడారు.

‘‘ఎన్డీఏలో లేని పార్టీలను ఏకం చేయాలని నేను, శరద్ పవార్ ప్రయత్నాలు చేస్తున్నాము. ప్రజల కోసం బీజేపీ చేస్తున్నది ఏమీ లేదు. బీజేపీకి ప్రత్యామ్నాయంగా పార్టీలు ఏకం కావాల్సిన అవసరం వచ్చింది. ఈ కూటమికి నాయకుడు ఎవరన్న విషయాన్ని భవిష్యత్తులో నిర్ణయిస్తాం. ముందు ప్రతిపక్ష పార్టీలు ఏకం కావాల్సి ఉంది’’ అని నితీశ్ కుమార్ చెప్పారు. కాగా, ఇప్పటికే నితీశ్ కుమార్ తెలంగాణ సీఎం కేసీఆర్, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, సీపీఐ, సీపీఎం నేతలతో చర్చించారు. ప్రతిపక్షాల నుంచి ప్రధాని అభ్యర్థిని కూడా చర్చించి ప్రకటించాల్సి ఉందని అన్నారు.

Woman bites fingers: టీవీ సౌండు తగ్గించాలని చెప్పినందుకు అత్త చేతి మూడు వేళ్ళు కొరికేసిన కోడలు