Tripura: బీజేపీలో చేరిన త్రిపుర లెఫ్ట్, టీఎంసీ నేతలు

ఈ చేరికల అనంతరం త్రిపుర ముఖ్యమంత్రి మాణిక్ సాహా మీడియాతో మాట్లాడుతూ ‘‘ఎన్నికలకు కొద్ది రోజుల ముందు రెండు పార్టీల్లోని ఇద్దరు పెద్ద నేతలు వారి అనుచరులతో చేరి బీజేపీని మరింత బలోపేతం చేశారు. ఇప్పటికే మాకు పెద్ద ఎత్తున ప్రజా మద్దతు ఉంది. తాజా చేరికలతో మరింత బలం వస్తుంది. ఈ ఎన్నికల్లో బీజేపీ అత్యధిక మెజారిటీతో గెలుస్తుంది’’ అని అన్నారు

Tripura: బీజేపీలో చేరిన త్రిపుర లెఫ్ట్, టీఎంసీ నేతలు

TMC and Left leaders joins BJP in Tripura

Tripura: ఎన్నికలకు రెండు వారాల ముందు త్రిపురలో భారీ రాజకీయ కుదుపు చోటు చేసుకుంది. త్రిపుర తృణమూల్ కాంగ్రెస్ అధినేత సుబల్ భోవ్మిక్ సహా ఆ పార్టీకి చెందిన పలువురు నేతలు, ఆయన అనుచరులు భారతీయ జనతా పార్టీలో చేరారు. ఇక త్రిపురను సుదీర్ఘంగా పాలించి, పోయిన ఎన్నికల్లో విపక్షానికి పరిమితమైన లెఫ్ట్ పార్టీ నుంచి మోబోషార్ అలీ సహా ఆయన అనుచరులు కాషాయ కండువా కప్పుకున్నారు. త్రిపుర ముఖ్యమంత్రి మాణిక్ సాహా ఆధ్వర్యంలో శుక్రవారం వీరంతా కాషాయ తీర్థం పుచ్చుకున్నారు. త్రిపుర బీజేపీ కేంద్ర కార్యాలయం దీనికి వేదికైంది.

Lt General RP Kalita: చైనా సరిహద్దు వెంట పరిస్థితి అదుపులోనే ఉంది.. కానీ: లెఫ్టినెంట్ జనరల్ ఆర్‌పీ కలిటా

ఇక ఈ చేరికల అనంతరం త్రిపుర ముఖ్యమంత్రి మాణిక్ సాహా మీడియాతో మాట్లాడుతూ ‘‘ఎన్నికలకు కొద్ది రోజుల ముందు రెండు పార్టీల్లోని ఇద్దరు పెద్ద నేతలు వారి అనుచరులతో చేరి బీజేపీని మరింత బలోపేతం చేశారు. ఇప్పటికే మాకు పెద్ద ఎత్తున ప్రజా మద్దతు ఉంది. తాజా చేరికలతో మరింత బలం వస్తుంది. ఈ ఎన్నికల్లో బీజేపీ అత్యధిక మెజారిటీతో గెలుస్తుంది’’ అని అన్నారు. త్రిపుర అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ 16 ఫిబ్రవరిన జరగనుంది. ఫలితాలు 2 మార్చిన విడుదల కానున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం వెల్లడించింది.

Maharashtra: మహారాష్ట్ర నూతన గవర్నర్‭గా అమరీందర్ సింగ్!