Lt General RP Kalita: చైనా సరిహద్దు వెంట పరిస్థితి అదుపులోనే ఉంది.. కానీ: లెఫ్టినెంట్ జనరల్ ఆర్‌పీ కలిటా

‘చైనా-భారత్.. రెండు దేశాల మధ్య సరిహద్దు ఏంటో స్పష్టత లేకపోవడం వల్లే సమస్య ఉత్పన్నమవుతోంది. ఎల్ఏసీకి సంబంధించిన భిన్నమైన అభిప్రాయాలు ఉండటమే సమస్యలకు కారణం. ఇప్పటికైతే చైనాతో ఉత్తర సరిహద్దు ప్రాంతంలో పరిస్థితి అదుపులోనే ఉంది.

Lt General RP Kalita: చైనా సరిహద్దు వెంట పరిస్థితి అదుపులోనే ఉంది.. కానీ: లెఫ్టినెంట్ జనరల్ ఆర్‌పీ కలిటా

Lt General RP Kalita: చైనాతో ఉత్తర సరిహద్దు ప్రాంతంలో పరిస్థితి అదుపులోనే ఉందని చెప్పారు లెఫ్టినెంట్ జనరల్ ఆర్‌పీ కలిటా. అయితే, పరిస్థితి ఎప్పుడు ఎలా మారుతుందో అంచనా వేయలేమన్నారు ఎల్జీ. ఆయన చైనా సరిహద్దు ప్రాంతమైన ఎల్ఏసీ (లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్)కి సంబంధించి అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం ప్రాంతాల్ని పర్యవేక్షిస్తుంటారు.

India Women U19: ప్రపంచ కప్‌కు చేరువలో భారత్.. అండర్-19 మహిళల టీ20 వరల్డ్ కప్ ఫైనల్‌కు చేరి టీమిండియా

కోల్‌కతాలో ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడారు. సరిహద్దు భద్రత గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘చైనా-భారత్.. రెండు దేశాల మధ్య సరిహద్దు ఏంటో స్పష్టత లేకపోవడం వల్లే సమస్య ఉత్పన్నమవుతోంది. ఎల్ఏసీకి సంబంధించిన భిన్నమైన అభిప్రాయాలు ఉండటమే సమస్యలకు కారణం. ఇప్పటికైతే చైనాతో ఉత్తర సరిహద్దు ప్రాంతంలో పరిస్థితి అదుపులోనే ఉంది. అయితే, సరిహద్దు విషయంలో రెండు దేశాలకు వేర్వేరు అంచనాలు ఉండటం వల్ల పరిస్థితి ఎప్పుడు, ఎలా ఉంటుందో ఊహించలేం. సరిహద్దు భద్రతను కాపాడటంలో తూర్పు వైపున ఉన్న సైన్యం పాత్ర చాలా కీలకం. పూర్తి అంకితభావంతో సిబ్బంది పని చేస్తున్నారు.

Telangana Jobs: తెలంగాణలో మరో జాబ్ నోటిఫికేషన్.. 2391 పోస్టుల భర్తీకి ప్రభుత్వం అనుమతి

ఎదురవ్వబోయే సమస్యల విషయంలో ఎప్పటికప్పుడు సమీక్షిస్తూనే ఉన్నాం’’ అని లెఫ్టినెంట్ జనరల్ ఆర్‌పీ కలిటా అన్నారు. గత డిసెంబర్ 9న అరుణాచల్ ప్రదేశ్, తవాంగ్ ప్రాంతంలో మరోసారి చైనా-భారత సైనికుల మధ్య సంఘర్షణ తలెత్తిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో 35 మంది భారత సోల్జర్లు, 40 మంది చైనా సైనికులు గాయపడ్డట్లు అంచనా. ప్రస్తుతం చైనా సరిహద్దు ప్రాంతంలో పరిస్థితిని ఎప్పటికప్పుడు అంచనావేస్తున్నామని, ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని కలిటా చెప్పారు.

మరోవైపు సరిహద్దు వద్ద చైనా వరుసగా సైన్యాన్ని పెంచుకుంటోందని, నిర్మాణాలు చేపడుతోందని తెలుస్తోందన్నారు. బదులుగా మనవైపు కూడా సరిహద్దులో నిర్మాణాలు చేపడుతూ, మౌలిక వసతుల్ని పెంచుకుంటున్నట్లు ఆయన చెప్పారు.