India Women U19: ప్రపంచ కప్‌కు చేరువలో భారత్.. అండర్-19 మహిళల టీ20 వరల్డ్ కప్ ఫైనల్‌కు చేరి టీమిండియా

ఐసీసీ తొలిసారిగా నిర్వహిస్తున్న అండర్-19 మహిళల టీ20 వరల్డ్ కప్‌లో టీమిండియా ఫైనల్ చేరింది. దక్షిణాఫ్రికాలో ఈ వరల్డ్ కప్ జరుగుతోంది. శుక్రవారం న్యూజిలాండ్‌తో జరిగిన మొదటి సెమీ ఫైనల్‌లో షఫాలీ వర్మ ఆధ్వర్యంలోని భాతర మహిళల జట్టు 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది.

India Women U19: ప్రపంచ కప్‌కు చేరువలో భారత్.. అండర్-19 మహిళల టీ20 వరల్డ్ కప్ ఫైనల్‌కు చేరి టీమిండియా

India Women U19: అంతర్జాతీయ క్రికెట్లో మరోసారి చరిత్ర సృష్టించేందుకు భారత్ సిద్ధమవుతోంది. ఐసీసీ తొలిసారిగా నిర్వహిస్తున్న అండర్-19 మహిళల టీ20 వరల్డ్ కప్‌లో టీమిండియా ఫైనల్ చేరింది. దక్షిణాఫ్రికాలో ఈ వరల్డ్ కప్ జరుగుతోంది. శుక్రవారం న్యూజిలాండ్‌తో జరిగిన మొదటి సెమీ ఫైనల్‌లో షఫాలీ వర్మ ఆధ్వర్యంలోని భాతర మహిళల జట్టు 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది.

Pakistan Economic Crisis : పాకిస్తాన్ మరో శ్రీలంక కానుందా? రోజురోజుకు దిగజారిపోతున్న ఆర్థిక పరిస్థితి

ఇంగ్లండ్, ఆస్ట్రేలియా జట్ల మధ్య రెండో సెమీ ఫైనల్ మ్యాచ్ జరగుతోంది. దీనిలో గెలిచిన జట్టుతో టీమిండియా ఫైనల్‌లో తలపడుతుంది. ఆదివారం (జనవరి 29)న ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది. మహిళల జట్టుకు సంబంధించి అండర్-19 కేటగిరిలో ఇదే తొలి టీ20 వరల్డ్ కప్. ఈ టోర్నీ ఫైనల్‌లో గెలవడం ద్వారా మొదటి టోర్నీని సొంతం చేసుకున్న జట్టుగా భారత్ చరిత్ర సృష్టించనుంది. శుక్రవారం నాటి సెమీ ఫైనల్ మ్యాచ్‌లో టాస్ గెలిచిన టీమిండియా మొదట బౌలింగ్ ఎంచుకుంది. దీంతో బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్ జట్టును భారత బౌలర్లు కట్టడి చేశారు. దీంతో న్యూజిలాండ్ 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి, 107 పరుగులు మాత్రమే చేయగలిగింది.

Jessie Lemonier: క్రీడారంగంలో విషాదం.. పాతికేళ్లకే మరణించిన ఫుట్‌బాలర్… గర్భంతో ఉన్న ప్రేయసి

పర్షావి చోప్రా నాలుగు ఓవర్లలో 20 పరుగులు మాత్రమే ఇచ్చి, మూడు వికెట్లు తీసింది. మిగతా బౌలర్లు కూడా తలో వికెట్ తీశారు. తర్వాత 108 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత జట్టు తొలి వికెట్ త్వరగానే కోల్పోయింది. కెప్టెన్ షఫాలి వర్మ 10 పరుగులకే వెనుదిరిగింది. అయితే, మరో ఓపెనర్ శ్వేతా సెహ్రావత్ 45 బంతుల్లో 61 పరుగులు చేసి చెలరేగింది. ఆమె ఇన్నింగ్స్‌లో 10 ఫోర్లు ఉండటం విశేషం. తర్వాత మరో బ్యాటర్ సౌమ్యా తివారి 26 బంతుల్లో 22 పరుగులు చేసి ఔటైంది. తర్వాత గొంగడి త్రిష 7 బంతుల్లో 5 పరుగులతో నాటౌట్‌‌గా నిలిచింది. మ్యాచ్ ముగిసే సమాయినిక శ్వేత కూడా నాటౌట్‌గానే ఉంది.

Viral Video: గోల్డ్ ఫిష్‌ ప్రాణాలు కాపాడిన కుక్క.. అబ్బురపరుస్తున్న వీడియో

దీంతో టీమిండియా 14.2 ఓవర్లలోనే 2 వికెట్లు కోల్పోయి 110 పరుగులు చేసి కివీస్‌పై విజయం సాధించింది. టోర్నీలో ఫైనల్ చేరిన మొదటి జట్టుగా నిలిచింది. ప్రస్తుతం జరుగుతున్న మరో సెమీ ఫైనల్‌లో గెలిచిన జట్టుతో ఆదివారం భారత జట్టు తలపడుతుంది. భారత జట్టు కాలమానం ప్రకారం ఆదివారం సాయంత్రం ఐదు గంటలకు ఫైనల్ మ్యాచ్ ప్రారంభం అవుతుంది.