Bajrang Dal: ‘బజరంగ్ భలి’ అని ఓట్లేయమంటూ ఓటర్లను కోరిన మోదీకి అదే స్టైల్లో కౌంటర్ ఇచ్చిన శివసేన

మతం లేకుండా రాజకీయం చేయదని అన్నారు. కన్నడ ప్రజలకు కావాల్సిన వసతులు, ఇన్నేళ్ల బీజేపీ పాలనలో చేసిన అభివృద్ధి గురించి మాట్లాడాలని ఉద్ధవ్ సూచించారు. కానీ ప్రధాని నరేంద్రమోదీ అందుకు పూర్తి విరుద్ధంగా వ్యవహరిస్తున్నారంటూ మండిపడ్డారు.

Bajrang Dal: ‘బజరంగ్ భలి’ అని ఓట్లేయమంటూ ఓటర్లను కోరిన మోదీకి అదే స్టైల్లో కౌంటర్ ఇచ్చిన శివసేన

Uddhav Thackeray

Bajrang Dal: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో బజరంగ్ దళ్ సంస్థ మీద నిషేధం విధిస్తామని ఇచ్చిన హామీతో రాజకీయ ప్రకంపనలు చెలరేగుతున్నాయి. ఈ వివాదాన్ని బజరంగ్ భలీ (హనుమంతుడు)తో ముడిపెట్టి ప్రధాన మంత్రి నరేంద్రమోదీ మరో స్థాయికి తీసుకెళ్లారు. ముదట ‘జై శ్రీరాం’ నినాదాలను అడ్డుకున్నారని, ఇప్పుడు ఏకంగా బజరంగ్ భలీనే తొలగిస్తున్నామంటున్నారంటూ ఎన్నికల ప్రచారంలో చెబుతున్నారు. అంతే కాకుండా ‘బజరంగ్ భలి’ అని ఓట్లేయమంటూ బహిరంగ ప్రచారంలో మోదీ ఓటర్లను విజ్ణప్తి చేస్తున్నారు.

Bajrang Dal: బజరంగ్ దళ్ కాంట్రవర్సీని మరో లెవెల్‭కి తీసుకెళ్లిన మనోజ్ ఝా.. హనుమంతుడు కనుక ఇప్పుడు ఉండుంటే వారి చెంపలు పగలగొట్టేవాడట

అయితే మోదీ చేస్తున్న ఈ వ్యాఖ్యలకు అదే స్టైల్లో కౌంటర్ ఇచ్చారు శివసేన (ఉద్ధవ్ బాలాసాహేబ్ థాకరే) అధినేత ఉద్ధవ్ థాకరే. ‘జై భవాని, జై శివాజీ’ అంటూ ఓట్లేయాలని బీజేపీకి కౌంటర్‭గా నినాదం ఇచ్చారు. వాస్తవానికి రాజకీయాల్లోకి మతాన్ని తీసుకు రాకూడదని, అయితే బీజేపీ మతం లేకుండా రాజకీయం చేయదని అన్నారు. కన్నడ ప్రజలకు కావాల్సిన వసతులు, ఇన్నేళ్ల బీజేపీ పాలనలో చేసిన అభివృద్ధి గురించి మాట్లాడాలని ఉద్ధవ్ సూచించారు. కానీ ప్రధాని నరేంద్రమోదీ అందుకు పూర్తి విరుద్ధంగా వ్యవహరిస్తున్నారంటూ ఉద్ధవ్ థాకరే మండిపడ్డారు.

Himachal Pradesh: బీజేపీని చిత్తుగా ఓడించిన కాంగ్రెస్.. 24 స్థానాల్లో విజయకేతనం

ఇక భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ పార్టీల మధ్య ఈ వివాదం తీవ్ర మాటల యుద్ధానికి దారి తీసింది. అయితే బీజేపీ దాడితో కాంగ్రెస్ కొంత మెత్తబడి యూటర్న్ తీసుకుంది. తమ మేనిఫెస్టోలో బజరంగ్ దళ్ పేరును రాడికల్ సంస్థగా పేర్కొన్నామే కానీ, రద్దు చేస్తామని చెప్పలేమని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి వీరప్ప మొయిలీ గురువారం వివరణ ఇచ్చారు.