కంట్లోనే 21రోజులు కరోనా వైరస్

  • Published By: chvmurthy ,Published On : April 23, 2020 / 04:59 AM IST
కంట్లోనే 21రోజులు కరోనా వైరస్

కరోనా వైరస్ ముక్కు కళ్ల ద్వారా ఎక్కువగా శరీరంలోకి ప్రవేసిస్తుంది అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయితే ఇటలీలోని ఒక COVID -19 రోగికి కరోనావైరస్ ఆమె ముక్కులో కంటే ఎక్కువసేపు కంటిలో ఉన్నట్లుగా అధ్యయనంలో వెల్లడైంది. 

ఇటలీకి చెందిన ఓ 65 ఏళ్ల మహిళ..  COVID -19 మహమ్మారి ప్రారంభ కేంద్రమైన చైనా నగరంలోని వుహాన్ నుంచి ఇటలీకి వచ్చింది. ఆమె లక్షణాలు ప్రారంభం అయిన ఒక రోజు తర్వాత ఆమె ఇటలీకి వచ్చారు.

రోమ్‌లోని ఇటలీకి చెందిన లాజారో స్పల్లాంజని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఫర్ ఇన్ఫెక్షియస్ డిసీజెస్ ఆసుపత్రిలో ఆమెను ఐసోలేషన్ యూనిట్‌కు తరలించారు. ఆమె COVID -19 లక్షణాలలో పొడి దగ్గు మరియు గొంతు నొప్పి ఉన్నాయి. ఆమెకు నాసికా కుహరం ఉబ్బగా.. రెండు కళ్ళలో కండ్లకలక లాగా వచ్చింది. దీనిని COVID -19 లక్షణంగా భావిస్తారు.

ఆ మహిళకు తరువాత 100.4 డిగ్రీల ఫారెన్‌హీట్ జ్వరం వచ్చింది. ఆమెకు ఒంటిలో కాస్త వికారంగా కూడా అనిపించింది. ఇది నాలుగవ రోజు జరిగింది. లక్షణాలు ప్రారంభమైన నాలుగు రోజుల తరువాత పరీక్షల్లో ఆమెకు కరోనావైరస్ సోకినట్లు నిర్థారణకు వచ్చారు డాక్టర్లు.

అయితే ఆమె కంట్లో 21రోజుల పాటు వైరస్ అలాగే ఉన్నట్లుగా డాక్టర్లు చెప్పారు. దీనిని బట్టి.. ముక్కు నుంచి చేరే వైరస్ కంటే కంటి నుంచి చేరే వైరస్ ఎక్కువగా ప్రభావం చూపుతుంది అని డాక్టర్లు చెబుతున్నారు.

అందుకే శుభ్రత పాటించాలని సూచనలు చేస్తున్నారు డాక్టర్లు. కరోనా వైరస్ ఎదుర్కోవాలంటే కచ్చితంగా శుభ్రత వల్ల  సాధ్యం అవుతుందని అంటున్నారు డాక్టర్లు.