Drink Milk Every Day : పిల్లలు ప్రతిరోజూ పాలు తాగాల్సిన అవసరం ఉందా? ఇది పిల్లలకు మంచిదా?

పాలలో అధిక కాల్షియం కంటెంట్ ఉంటుంది, కాబట్టి ఇది ఆరోగ్యకరమైన ఎముకలకు అద్భుతమైన పానీయం. రోజూ పాలు తాగడం వల్ల ఎముకల క్షీణతను నివారిస్తుంది. మంచి ఎముకల ఆరోగ్యాన్ని ఇస్తుంది. కాల్షియం సరైన శోషణకు మనకు విటమిన్ డి అవసరం. పాలలో విటమిన్ డి ఉంటుంది, ఇది రికెట్స్ ను నివారించడంలో సహాయపడుతుంది.

Drink Milk Every Day : పిల్లలు ప్రతిరోజూ పాలు తాగాల్సిన అవసరం ఉందా? ఇది పిల్లలకు మంచిదా?

Drink Milk Every Day

Drink Milk Every Day : పాలు పిల్లలకు అవసరమైన ముఖ్యమైన పానీయాలలో ఒకటిగా పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు. దీనికి అనేక కారణాలు ఉన్నాయి. పాలు తాగడం వల్ల శరీరానికి చాలా ప్రయోజనాలు ఉన్నాయి.

READ ALSO : Joint Problems : కీళ్లకు సంబంధించిన సమస్యలతో బాధపడుతున్న వారికి ఉపశమనం కలిగించే శొంఠిపాలు !

ప్రతిరోజు ఒకటి నుండి రెండు గ్లాసుల పాలు తాగడం అనేది మంచిదని చెప్తుంటారు. ముఖ్యంగా ఎదుగుతున్న పిల్లలకు తప్పనిసరిగా పాలు తాగాల్సిన అవసరం ఉంది. అదే క్రమంలో రోజువారిగా పాలు తీసుకోవటం ఏమాత్రం మంచిదికాదని చెప్పేవారు లేకపేలేదు. వాస్తవం ఏమిటంటే పాలు పోషకాలు కలిగిన దట్టమైన ఆహారంగా చెప్పవచ్చు. ముఖ్యంగా పిల్లల ఎదుగుదలకు, ఎముకల నిర్మాణానికి ఎంతగానో దోహదం చేస్తాయి.

పిల్లలకు పాలు తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు ;

రోజంతా చురుగ్గా ఉంటూ త్వరగా ఎదుగుతున్న పిల్లలకు ప్రతిరోజూ పాలు తాగడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. పాల యొక్క మఖ్యమైన ప్రయోజనాలగురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం…

READ ALSO : Saffron Milk : శీతాకాలంలో ఆరోగ్యానికి మేలు కలిగించే కుంకుమపువ్వు పాలు!

1. పూర్తి పోషకాలు కలిగిన పానీయం ;

అనేక విటమిన్లు, మినరల్స్ కోసం సిఫార్సు చేయబడిన డైటరీ అలవెన్స్ అధిక శాతం ప్రతిరోజూ పాలు తీసుకోవడం ద్వారా నెరవేరుతుంది, అందుకే ఆహారంలో ముఖ్యమైన భాగంగా ఉండాలి. పెరుగుతున్న బిడ్డకు రోజువారిగా పాలను అందించటం ఎంతో ముఖ్యమని నిపుణులు సూచిస్తున్నారు.

2. రికెట్స్ నుండి ఎముకలను రక్షిస్తుంది ;

పాలలో అధిక కాల్షియం కంటెంట్ ఉంటుంది, కాబట్టి ఇది ఆరోగ్యకరమైన ఎముకలకు అద్భుతమైన పానీయం. రోజూ పాలు తాగడం వల్ల ఎముకల క్షీణతను నివారిస్తుంది. మంచి ఎముకల ఆరోగ్యాన్ని ఇస్తుంది. కాల్షియం సరైన శోషణకు మనకు విటమిన్ డి అవసరం. పాలలో విటమిన్ డి ఉంటుంది, ఇది రికెట్స్ ను నివారించడంలో సహాయపడుతుంది.

READ ALSO : Drinking Milk : పాలు తాగితే బరువు పెరుగుతారా? కొలెస్ట్రాల్ సమస్యలు తప్పవా?

3. ప్రోటీన్ యొక్క గొప్ప మూలం ;

పాలు నాణ్యమైన ప్రోటీన్ యొక్క గొప్ప మూలం. ఒక కప్పు పాలలో 8 గ్రా ప్రోటీన్ ఉంటుంది, ఇది పిల్లల పెరుగుదల , అభివృద్ధికి సహాయపడుతుంది. అదే సమయంలో రోగనిరోధక శక్తిని కూడా పెంచుతుంది. పాలలో రెండు రకాల ప్రోటీన్లు ఉన్నాయి. కేసైన్ మరియు వెయ్ ప్రోటీన్. రెండూ అధిక-నాణ్యత ప్రోటీన్లుగా పరిగణించబడతాయి. మిల్క్ ప్రొటీన్ లో శరీరం యొక్క సరైన పనితీరుకు అవసరమైన మొత్తం 9 అమైనో ఆమ్లాలు ఇందులో ఉంటాయి.

4. దంత క్షయాన్ని నివారిస్తుంది ;

పిల్లలలో దంత క్షయం చాలా సాధారణం. పాలు దంతాల ఎనామిల్‌ను రక్షిస్తుంది. చిగుళ్లను బలపరుస్తుంది. పాలలో కాల్షియం మరియు ఫాస్పరస్ ఉండటం వల్ల, పిల్లలు క్రమం తప్పకుండా పాలు తాగితే దంతాల క్షయం ఉండదు.