Sleep Covid 19 : గుడ్ న్యూస్ చెప్పిన సైంటిస్టులు.. ఎక్కువ నిద్రతో కరోనా సోకే ప్రమాదం తక్కువ

తగినంత సమయం నిద్రపోతే శారీరకంగా.. మానసికంగా ఎన్నో లాభాలున్నాయని డాక్టర్లు చెబుతుంటారు. తాజాగా.. చక్కటి నిద్రతో కరోనా సోకే అవకాశాలు తగ్గుతాయని అధ్యయనంలో తేలింది.

Sleep Covid 19 : గుడ్ న్యూస్ చెప్పిన సైంటిస్టులు.. ఎక్కువ నిద్రతో కరోనా సోకే ప్రమాదం తక్కువ

Sleep Covid 19

Sleep Down Covid 19 Risk : ఇప్పుడు యావత్ ప్రపంచానికి కరోనావైరస్ మహమ్మారి భయం పట్టుకుంది. ఏడాదిన్నర దాటినా, వ్యాక్సిన్ వచ్చినా ఇంకా వైరస్ భయాలు పోలేదు. సెకండ్ వేవ్ లో కోవిడ్ వైరస్ మరింతగా రెచ్చిపోతోంది. దీంతో అందరికి మహమ్మారి భయం పట్టుకుంది. జనాలు నిద్ర లేని రాత్రులు గడుపుతున్నారు. కరోనా బారిన పడకుండా తమను తాము ఎలా కాపాడుకోవాలో తెలియక ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. దీనికి సంబంధించి ప్రపంచవ్యాప్తంగా విస్తృతంగా అధ్యయనాలు, పరిశోధనలు జరుగుతున్నాయి. కరోనా నుంచి కాపాడుకోవాలంటే ఏం చేయాలి, ఏం తినాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే దాని గురించి స్టడీలు జరుగుతున్నాయి. అలాంటి ఓ స్టడీలో ఆసక్తికర విషయం ఒకటి వెలుగు చూసింది. అదేంటంటే.. ఎక్కువ నిద్రతో కరోనా సోకే అవకాశాలు తక్కువ అని తేలింది.

నిద్రలేమితో కరోనా ముప్పు:
తగినంత సమయం నిద్రపోతే శారీరకంగా.. మానసికంగా ఎన్నో లాభాలున్నాయని డాక్టర్లు చెబుతుంటారు. తాజాగా.. చక్కటి నిద్రతో కరోనా సోకే అవకాశాలు తగ్గుతాయని అధ్యయనంలో తేలింది. బీఎంజే న్యూట్రిషన్‌ ప్రివెన్షన్‌ అండ్‌ హెల్త్‌ అనే జర్నల్‌లో ఈ మేరకు నివేదికను ప్రచురించారు. నిద్రలేమి.. మానసిక ఒత్తిళ్ల వల్ల శరీరంలో కరోనా వైరస్‌ సులువుగా ప్రవేశించే అవకాశముందట. దాంతోపాటు తీవ్రమైన జబ్బులు, వాటి నుంచి కోలుకోవడానికి దీర్ఘకాలం సమయం పట్టొచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

గంట ఎక్కువ నిద్రపోయినా కరోనాకు చెక్:
కరోనా సోకడంలో నిద్ర ప్రభావంపై పరిశోధన కోసం ఫ్రాన్స్‌, జర్మనీ, ఇటలీ, స్పెయిన్‌, యూకే, అమెరికా దేశాల్లో కరోనా బాధితులకు చికిత్సలకు అందిస్తూ కరోనా బారిన పడిన హెల్త్‌కేర్‌ వర్కర్లపై సర్వే నిర్వహించారు. వారు ఎంత సేపు నిద్రిస్తారనే విషయంపై దృష్టి సారించి అధ్యయనం చేయగా.. 40శాతం మందికి నిద్రలేమి, మానసిక ఒత్తిళ్ల ప్రభావంతోనే కరోనా సోకినట్లు నిర్థారించారు. కాబట్టి తగినంత నిద్రపోవడం ఎంతో ముఖ్యమని తెలిపారు. రోజువారి నిద్ర కంటే.. గంట ఎక్కువగా నిద్రపోయినా.. ఒక్కో గంటకు కరోనా సోకే అవకాశాలు 12శాతం చొప్పున తగ్గుతాయని శాస్త్రవేత్తలు తెలిపారు.

జూలై 17, 2020 నుంచి సెప్టెంబర్ 25, 2020 వరకు సర్వే నిర్వహించారు. ఈ సర్వేలో 2వేల 884 మంతి హెల్త్ వర్కర్లు పాల్గొన్నారు. వారిలో 568మంది కరోనా బారిన పడినట్టు గుర్తించారు.