Dance Exercises : ఫిట్‌నెస్‌ను మెరుగుపరచుకోవటంలో దోహదపడే ఆహ్లాదకరమైన నృత్య వ్యాయామాలు !

Dance Exercises
Dance Exercises : నృత్యం మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. శరీరానికి మరియు మనస్సుకు విశ్రాంతిని ఇవ్వటానికి ఈ టెక్నిక్‌గా బాగా పనిచేస్తుంది. ప్రతి సంవత్సరం, ఏప్రిల్ 29న అంతర్జాతీయ నృత్య దినోత్సవాన్ని జరుపుకుంటారు. అధిక శక్తి కలిగిన జుంబా నృత్యం మొదలు, తక్కువ ప్రభావం చూపే బ్యాలెట్ బర్రే నృత్యం వరకు, ప్రతి ప్రాంతానికి ఒక నృత్య శైలి ఉంది. ఫిట్‌నెస్‌ను మెరుగుపరచడం , కేలరీలను కరిగించటమే కాకుండా నృత్యాన్ని ఆనందించవచ్చు.
READ ALSO : Much Exercise : వ్యాయామాలు అతిగా చేస్తే ఏంజరుగుతుందో తెలుసా?
డ్యాన్స్ ఆరోగ్య పరంగా అనేక విధాలుగా ప్రయోజనకరంగా ఉంటుంది. శరీరంలోని ప్రతి భాగాన్ని ప్రభావితం చేస్తుంది. మొత్తం శరీరానికి వ్యాయామం. అంతర్జాతీయ నృత్య దినోత్సవం సందర్భంగా, డ్యాన్స్ వర్కౌట్‌ల వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
డ్యాన్స్ ఎందుకు మంది ?
1. ఊపిరితిత్తులు, గుండె ఆరోగ్యంగా ఉంచుతుంది :
ఊపిరితిత్తులు, గుండె ఆరోగ్యంగా ఉంచడంలో డ్యాన్స్ ప్రయోజనకరంగా ఉంటుంది. ఇది గుండె పనితీరును మెరుగుపరుస్తుంది. గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది. అలాగే, ఇది మొత్తం శరీరం యొక్క రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. అనేక సమస్యలను నివారించడంలో సహాయపడుతుంది.
READ ALSO : Stay Healthy In Winter : చలికాలంలో ఆరోగ్యంగా ఉండాలంటే మంచి ఆహారంతోపాటు, వ్యాయామాలు అవసరమే!
2. చర్మం ,జుట్టుకు మేలు చేస్తుంది :
డ్యాన్స్ చర్మం,జుట్టుకు అనేక విధాలుగా ప్రయోజనకరంగా ఉంటుంది. నిజానికి, నృత్యం శరీరంలో రక్త ప్రసరణను సరిచేసినప్పుడు, అది చర్మ రంధ్రాలను ఓపెన్ చేస్తుంది. జుట్టు పెరుగుదలకు సహాయపడుతుంది. కాబట్టి, మెరిసే చర్మంతో ఆరోగ్యకరమైన జుట్టు కావాలంటే, రోజువారిగా నృత్యం చేయండి.
3. శరీరం ఫ్లెక్సిబిలిటీని పెంచుతుంది :
శరీరం యొక్క ఫ్లెక్సిబిలిటీని పెంచడంలో డ్యాన్స్ ఉపయోగపడుతుంది. నిజానికి, డ్యాన్స్ కండరాలు, నరాలకు ప్రాణం పోస్తుంది. శరీర ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. కాబట్టి, నృత్యం చేయండి శరీరం యొక్క ఆరోగ్యాన్ని పెంచుకోండి.
READ ALSO : Cardiac Tests : కఠినమైన వ్యాయామాలు, క్రీడలకు ముందుగా గుండె సంబంధిత పరీక్షలు చేయించుకోవటం అవసరమా?
4. బరువు తగ్గడానికి ఉపయోగపడుతుంది :
బరువు తగ్గాలనుకునే వారికి డ్యాన్స్ చాలా రకాలుగా ఉపయోగపడుతుంది. డ్యాన్స్ కేలరీలను బర్న్ చేయడానికి సహాయపడుతుంది. అంతే కాకుండా ఇది కార్డియో ఎక్సర్‌సైజ్‌గా పనిచేసి కండరాలలో నిల్వ ఉన్న కొవ్వును జీర్ణం చేయడంలో సహాయపడుతుంది. కాబట్టి, హిప్ హాప్, ఫ్రీస్టైల్, జుంబా, బెల్లీ డ్యాన్స్ వంటి క్యాలరీలను బర్నింగ్ చేసే వ్యాయామాలు చేయాలి.