దేశంలోనే ఫస్ట్ టైం : వైద్య సౌకర్యాల్లో నాణ్యత ఆధారంగా ఆస్పత్రులకు రేటింగ్

నాణ్యమైన సౌకర్యాలు అందించే ఆస్పత్రులకు గుడ్ న్యూస్. దేశంలోనే మొట్టమొదటిసారిగా ఆస్పత్రులకు రేటింగ్ సిస్టమ్ రాబోతోంది.

  • Published By: sreehari ,Published On : September 17, 2019 / 10:15 AM IST
దేశంలోనే ఫస్ట్ టైం : వైద్య సౌకర్యాల్లో నాణ్యత ఆధారంగా ఆస్పత్రులకు రేటింగ్

నాణ్యమైన సౌకర్యాలు అందించే ఆస్పత్రులకు గుడ్ న్యూస్. దేశంలోనే మొట్టమొదటిసారిగా ఆస్పత్రులకు రేటింగ్ సిస్టమ్ రాబోతోంది.

నాణ్యమైన సౌకర్యాలు అందించే ఆస్పత్రులకు గుడ్ న్యూస్. దేశంలోనే మొట్టమొదటిసారిగా ఆస్పత్రులకు రేటింగ్ సిస్టమ్ రాబోతోంది. ఆస్పత్రులు అందించే నాణ్యమైన సౌకర్యాల ఆధారంగా రేటింగ్ ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. క్వాలిటీ హెల్త్ కేర్ ఫెసిలెటిస్ అందించే ఆస్పత్రులకు గోల్డ్, సిల్వర్, బ్రాంజ్ రేటింగ్స్ ఇవ్వనున్నారు. గ్రామీణ ప్రాంతాల నుంచి చిన్న పట్టణాల వరకు అందరికి నాణ్యమైన వైద్య సదుపాయాలను చేరువ చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. 

ప్రస్తుతం.. నేషనల్ అక్రిడేషన్ బోర్డు ఫర్ హాస్పిటల్స్ అండ్ హెల్త్ కేర్ ప్రొవైడర్స్ (NABH)కు అక్రిడేషన్ వ్యవస్థ ఉంది. ఒక ఆస్పత్రి ప్రభుత్వం నుంచి గుర్తింపు పొందడానికి 6 నుంచి 8 నెలల సమయం పడుతుంది. నేషనల్ హెల్త్ అథారిటీ (NHA) కొత్త రేటింగ్ సిస్టమ్ ద్వారా చిన్న ఆస్పత్రులు కూడా సులభంగా లైసెన్స్ పొందేందుకు వీలుంటుంది. అంతేకాదు.. ప్రభుత్వ ఆయూష్మాన్ భారత్ పథకం కింద గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సేవలు అందించడానికి దోహదపడుతుంది. 

ఈ సిస్టమ్ కింద.. చిన్న ఆస్పత్రులకు అక్రిడేషన్ (గుర్తింపు) తిరస్కరించడానికి బదులుగా ప్రభుత్వం.. వారికి తక్కువ రేటింగ్‌ను తక్కువ ఖర్చుకే ఇస్తుందని ఒక రిపోర్టు తెలిపింది. దీని ద్వారా ఆస్పత్రిలో చికిత్స కోసం వచ్చే వారంతా రేటింగ్ ఆధారంగా ఏ స్థాయి వైద్య సదుపాయాలు అందుతాయో ముందుగానే అంచనా వేసుకోవచ్చు. క్వాలిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (QCI) సాయంతో అక్రిడేషన్ విధానం అమలుకు అయ్యే ఖర్చును రూ.80వేలు-రూ.1.5లక్షల నుంచి రూ.10వేలకు తగ్గిస్తుందని రిపోర్టు పేర్కొంది. అత్యంత నాణ్యమైన వైద్య సదుపాయాలు అందించే ఆస్పత్రులకు గోల్డ్ రేటింగ్ ఇవ్వనున్నారు. తక్కువ నాణ్యత వైద్య సదుపాయలు అందించే ఆస్పత్రులకు కాంస్య (బ్రాంజ్) రేటింగ్ ఇవ్వడం జరుగుతుంది. 

ఈ కొత్త విధానం.. స్వయంగా పరీక్షించడం, సాక్ష్యాల ఆధారంగా రేటింగ్ ఇస్తారు. ఒకసారి స్వీయ పరిశీలిన పూర్తి అయ్యాక QCI ద్వారా డెస్క్ టాప్ అసిస్ మెంట్ జరుగుతుంది. అప్పుడే ఆయా ఆస్పత్రులకు రేటింగ్ అనుసరించి సర్టిఫికేట్ జనరేట్ అవుతుంది. ఈ మొత్తం ప్రక్రియకు NABH సర్టిఫికేషన్ కోసం 6 నుంచి 8 నెలలకు బదులుగా కేవలం 25 రోజుల నుంచి 35 రోజులు సమయం మాత్రమే పడుతుంది. ఈ విషయంలో NABH కూడా సరైన ప్రమాణాలను తప్పనిసరిగా పాటించాల్సిన అవసరం ఉందని అన్ని ఆస్పత్రులకు ఇదివరకే మార్గదర్శకాలను సిద్ధం చేసింది.