కరోనా వైరస్ ఎలా వ్యాప్తిస్తుంది.. ఎవరికి సోకుతుంది?

  • Published By: sreehari ,Published On : March 16, 2020 / 03:35 PM IST
కరోనా వైరస్ ఎలా వ్యాప్తిస్తుంది.. ఎవరికి సోకుతుంది?

ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభిస్తోంది. చైనాలోని వుహాన్ లో పుట్టిన ఈ కరోనా వైరస్ ప్రపంచ దేశాలకు వ్యాపించింది. వేలాది మందిని బలితీసుకుంది. రోజురోజుకీ కొత్త బాధితులు పుట్టుకుస్తున్నారు. కరోనా వైరస్ వ్యాప్తిని ఇదొక పెద్ద అంటువ్యాధిగా అధికారికంగా గుర్తించారు. అయితే ఈ వైరస్ మరణాల రేటులో వాస్తవం ఎంతో తెలియని పరిస్థితి. కానీ, సాధారణ ఫ్లూ కంటే 10 రెట్లు ఎక్కువగా కనిపిస్తుంది.

ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఏడాది వేలాదిమందిని చంపేస్తోందని టాప్ ఇన్ఫెక్షియస్ డిసీజ్ ఎక్స్‌పర్ట్ ఒకరు వెల్లడించారు. కరోనా సోకిన వారిలో చాలామందికి స్వల్ప లక్షణాలు కనిపించినప్పటికీ త్వరగానే కోలుకుంటున్నారు. కానీ, వృద్ధులపై దీని ప్రభావం ఎక్కువగా ఉంటుంది లేదా ఇతర అరోగ్య సమస్యలు తలెత్తుతాయి. అమెరికాలో కనీసం 60శాతం మంది పెద్దల్లో ఒకరు అనారోగ్య సమస్యలతో బాధపడుతుండగా, 42 శాతం రెండు కంటే ఎక్కువమందిలో అనారోగ్య సమస్యలు ఉన్నట్టు సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ మాజీ డైరెక్టర్ టామ్ ఫ్రిడెన్ తెలిపారు. COVID-19 వైరస్ అనేది ఎలా వ్యాపిస్తుంది.. అసలు కారణం ఏంటి అనేది ఇప్పటివరకూ తెలియదు.

ఎలా వ్యాపిస్తుందంటే? :
కరోనా వైరస్ సోకిన వ్యక్తి తుమ్మినా లేదా దగ్గినప్పుడు నోటి నుంచి బయటకు వచ్చే తుంపరల ద్వారా సమీపంలోకి మరొకరికి తొందరగా వ్యాపిస్తుంది. వైరస్ ఉన్న ఉపరితలాన్ని తాకడం ద్వారా కూడా వైరస్ సోకుతుంది అనడానికి కచ్చితమైన ఆధారాలేవు అయినప్పటికీ వైరస్ సోకుతుందని అమెరికా సైంటిస్టులు సూచిస్తున్నారు. మీ చేతులను ఎప్పటికప్పుడూ క్లీన్ చేసుకోవాలి.. చేతులను ముఖంపై తాకడం వంటి పనులు చేయరాదు. సాధారణంగా ఈ వైరస్ కొన్ని గంటల పాటు గాల్లో ఉంటుంది. 24 గంటల వరకు ఏదైనా వస్తువు ఉపరితలంపై ఉంటుంది.

ప్లాస్టిక్, స్టెయిన్ లెస్ స్టీల్ వస్తువులపై రెండు నుంచి మూడు రోజుల వరకు ఉంటుంది. ఆయా ఉపరితలాలను బ్లీచింగ్ చేయడం ద్వారా వైరస్ ను చంపేయచ్చు. చెమట ద్వారా కూడా వైరస్ వ్యాప్తి చెందే ప్రమాదం ఉందని జార్జ్ టౌన్ యూనివర్శిటీ మైక్రోబయోలిజిస్ట్ జులే ఫిస్కర్ తెలిపారు. ప్రత్యేకించి జిమ్ కు వెళ్లేవారిలో ఈ సమస్య అధికంగా ఉండే అవకాశం ఉందని అన్నారు. వైరస్ సోకిన వ్యక్తి మరొకరికి ఫుడ్ సర్వ్ చేసినా కూడా ఈ వైరస్ సోకే అవకాశం ఉంది.

ఎంత వేగంగా వ్యాపిస్తుందంటే :
వైరస్ సోకిన ప్రతి వ్యక్తి నుంచి సగటున ఇద్దరు లేదా ముగ్గురికి వ్యాపిస్తుందని రీసెర్చర్లు అంచనా వేస్తున్నారు. ఫ్లూ కంటే అత్యంత వేగంగా వ్యాపిస్తుంది. తట్టు, క్షయ లేదా ఇతర శ్వాసకోస వ్యాధుల కంటే వేగం మాత్రం కాదు.. పిల్లల్లో ఈ వైరస్ చాలా తక్కువగా వ్యాపిస్తుందో లేదో తెలియదు. కానీ, వైరస్ సోకిన పిల్లలు తొందరగా కోలుకున్న కేసులు ఉన్నాయి. ఓ అధ్యయనం ప్రకారం.. చైనాలో 1,099 బాధితులు ఉంటే.. వారిలో 0.9 శాతం కేసులు 15ఏళ్ల వయస్సు కంటే ఎక్కువగా నమోదయ్యాయి.

ఎలాంటి లక్షణాలు ఉంటాయి ? :
చాలామందిలో జ్వరం, దగ్గు, ఆయాసం లేదా ఊపిరాడక పోవడం, రెండు వారాల తర్వాత కోలుకుంటారు. 15శాతం వైరస్ తీవ్రత న్యూమోనియాతో ప్రాణాంతకంగా మారుతుంది. డ్రాగన్ దేశంలో 45వేలకు పైగా కరోనా కేసులు నమోదైనట్టు చైనీస్ సైంటిస్టులు తెలిపారు. లక్షణాలు నెమ్మదిగా కనిపించినప్పటికీ తీవ్రత పెరిగి అనారోగ్యానికి దారితీస్తుంది.

అమెరికాలో మొదటి 12మంది బాధితుల్లో వైరస్ లక్షణాలు కనిపించగా ఏడుగురు ఆస్పత్రిలో చేరారు. అప్పటికే ఆరోగ్య సమస్యలు ఎక్కువగా ఉన్నవారిలో రెండోవారం నుంచే అనారోగ్యం పాలయ్యే అవకాశం ఉంది. చైనాలోని మహిళల్లో కంటే పురుషుల్లోనే ఎక్కువగా కరోనా వైరస్ ఉన్నట్టు నిర్ధారణ అయింది. ఎందుకంటే పురుషుల్లో సగానికి పైగా పురుషులు పొగత్రాగే అలవాటు ఉండగా, కానీ, కేవలం 5 శాతం మహిళలు మాత్రమే ఉన్నారని ఫ్రైడెన్ తెలిపారు.

వైరస్ సోకినప్పుడు ఎలా అనిపిస్తుంది? :
సాధారణ జలుబు లేదా జ్వరం మాదిరిగానే కరోనా వైరస్ లో లక్షణాలు కనిపిస్తాయి. క్రూయిజ్ షిప్ ప్రయాణికుల్లో కొందరికి ఇదే రకమైన వైరస్ సోకినట్టు గుర్తించారు. 10మందిలో ఇద్దరికి ఈ వైరస్ సోకడంతో ఒమాహా, నెబ్రాక్షలోని ఆస్పత్రిలో చేరినట్టు కార్ల్ గోల్డ్ మ్యాన్ తెలిపారు.

వైరస్ పరీక్ష ఎలా ఉంటుంది? :
సీడీసీ సిఫార్సు మేరకు కనీసం రెండు పద్ధతుల్లో ఉంటుంది. ముక్కు, గొంతు ద్వారా పరీక్ష చేస్తారు. తీసిన శాంపిల్స్ వైరల్ జెనిటిక్ ల్యాబ్స్ కు పంపిస్తారు. ఈ టెస్టు రిపోర్టు రావడానికి 4 నుంచి 6 గంటల సమయం పడుతుంది. కొన్సిసార్లు చాలారోజుల సమయం పడుతుంది కూడా. ఇన్ హౌస్ టెస్టులో రెండు నుంచి మూడు రోజులు వరకు పట్టే అవకాశం ఉందని డేవిస్, యూనివర్శిటీ కాలిఫోర్నియా అయ్మీ మౌలిన్ తెలిపారు. కొన్ని ప్రాంతాల్లో ఓపెన్ డ్రైవ్ టెస్టింగ్ చేస్తున్నారు. తద్వారా హెల్త్ వర్కర్లకు వచ్చే అవకాశం తక్కువగా ఉంటుంది.

ఎప్పుడు వైరస్ తీవ్రత పెరుగుతుంది:
వైరస్ సోకిన వ్యక్తిలో లక్షణాలు బయటపడటానికి ఐదు నుంచి ఆరు రోజుల సమయం పడుతుంది. కానీ, రెండు వారాల వరకు సమయం పట్టొచ్చు. వైరస్ లక్షణాలు కనిపించడానికి ముందే చాలావరకు గొంతు, ముక్కుల్లోనే అత్యధికంగా వైరస్ ఉంటుందని పరీక్షల్లో తేలింది. వైరస్ సోకిన వ్యక్తి కోలుకున్న వారంత తర్వాత కూడా మలంలో వైరస్ ఉంటుందని, అలా కూడా అనారోగ్యానికి కారణమవుతుందని సైంటిస్టులు హెచ్చరిస్తున్నారు.

ఇది అంత ప్రాణాంతకమా? :
వైరస్ సోకిన వ్యక్తుల్లో చాలామందిలో లక్షణాలతో లేదా లక్షణాలు లేని వారిపై భారీ స్థాయిలో పరీక్షలు జరిపితే తప్పా అది ఎంత ప్రాణాంతకం అని తెలియదు. దీని మరణాల రేటు 1శాతం కంటే తక్కువగా ఉన్నట్టు సైంటిస్టులు అంచనా వేస్తున్నారు. ప్రాంతం ఆధారంగా ఇప్పటివరకూ గుర్తించిన కేసుల్లో 4 శాతం కంటే అధికంగా ఉండే అవకాశం ఉంది. ఫ్లూతో మరణాల రేటు 0.1శాతంగా ఉంటే.. కొత్త వైరస్ మరణాల రేటు 10 రెట్లు కంటే ఎక్కువగా ఉంటుందని అంటోని ఫాసీ చెప్పారు. ఆరోగ్య సమస్యలు, గుండె సంబంధిత వ్యాధులు ఉన్నవారిలో 10 శాతం కంటే ఎక్కువగా మరణాల రేటు పెరుగుతుందని పేర్కొంది. అమెరికాలో 30 మిలియన్ల మందికి డయాబెటిస్ ఉంది.. 70 మిలియన్ల మందికి స్థూలకాయత్వం, దాదాపు 80 మిలియన్ల మంది హైబ్లడ్ ప్రెజర్ ఉన్నవారే ఉన్నారు. వీరికి ఈ వైరస్ సోకితే ప్రాణాంతకంగా మారుతుంది.

కోలుకున్నవారికి మళ్లీ సోకుతుందా?
కచ్చితంగా తెలియదు.. చైనాలో కొన్ని రిపోర్టుల ప్రకారం.. కొవిడ్-19 సోకినప్పుడు నుంచి కోలుకుని.. మళ్లీ అనారోగ్యానికి గురయ్యారు. వ్యాధి తిరగబెడుతుంది అనేదానిపై స్పష్టత లేదు. కొత్త ఇన్ఫెక్షన్ లేదా పూర్తిగా కోలుకోని వ్యక్తిలో తిరగబెట్టే అవకాశం ఉండొచ్చు. వారి వ్యాధినిరోధక వ్యవస్థ, దీర్ఘకాలిక వ్యాధులు ఏమైనా ఉన్నా కూడా ఒకసారి వ్యాధి సోకితే మళ్లీ వచ్చేందుకు అవకాశం లేకపోలేదు. కానీ, అధికారికంగా ధృవీకరించలేదు. కానీ, ఇతర వైరస్ ల మాదిరిగా ఇది ఉంటే.. ఒకసారి కోలుకుంటే మళ్లీ సోకే అవకాశం ఉండదు.

ఈ వైరస్ సీజనల్ వ్యాధి అనొచ్చా?
ప్రతి వింటర్ సీజన్ లో కొత్త వైరస్ పుట్టుకొచ్చే అవకాశం ఉంది. వేడి వాతావరణం ఉంటే తప్పా వైరస్ వ్యాప్తి వేగం తగ్గే అవకాశం ఉంటుంది. అయినప్పటికీ వైరస్ వేగంగా వ్యాప్తిచెందే సామర్థ్యం ఉంటుంది. వేసవి సమయంలో influenza మాదిరిగా ఈ వైరస్ వ్యాప్తి తగ్గే అవకాశం లేకపోలేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఎమర్జెన్సీ చీఫ్ మిచెల్ ర్యాన్ తెలిపారు. ఫ్లూ వైరస్ వేగంగా వ్యాపిస్తుంటాయి. ప్రతి ఏడాదిలో కొత్త వ్యాక్సీన్ల అవసరం ఎంతో ఉంటుంది. ఒకవేళ కరోనా వైరస్ అలానే కొనసాగితే మాత్రం.. రాబోయే సంవత్సరాల్లో ప్రపంచవ్యాప్తంగా వ్యాపించే వైరస్ కావొచ్చు అని ఫ్రెడెయిన్ హెచ్చరించారు.