వర్కింగ్ ప్రొఫెషనల్స్ ఆరోగ్యం కోసం 5 ఆసనాలు, పని చేసే చోటే చేసుకోవచ్చు

యోగా ఆసనాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. నిజానికి యోగా అనేది ఎప్పట్నుంచో మన భారత దేశంలో

  • Published By: naveen ,Published On : June 20, 2020 / 07:18 AM IST
వర్కింగ్ ప్రొఫెషనల్స్ ఆరోగ్యం కోసం 5 ఆసనాలు, పని చేసే చోటే చేసుకోవచ్చు

యోగా ఆసనాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. నిజానికి యోగా అనేది ఎప్పట్నుంచో మన భారత దేశంలో

యోగాసనాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. నిజానికి యోగా అనేది ఎప్పట్నుంచో మన భారత దేశంలో ఉంది. యోగా అనేది భారతీయుల జీవనంలో ఓ భాగం. ఈ ఆసనాల గొప్పదనం తెలిసే చాలామంది విదేశీయులు సైతం వీటిని పాటిస్తున్నారు. జూన్ 21న ప్రపంచమంతా 6వ అంతర్జాతీయ యోగా డే(International Yoga Day) సెలబ్రేట్ చేసుకోవడానికి సిద్ధమవుతోంది. అయితే కరోనా వైరస్ మహమ్మారి వ్యాప్తి కారణంగా ఈసారి బహిరంగ ప్రదేశాలు, స్టేడియాల్లో యోగా దినోత్సవం జరుపుకోవడం సాధ్యం కాదు. భౌతిక దూరం పాటించాల్సిన అవసరం ఉండటంతో ఎక్కడివారక్కడే యోగా డే సెలబ్రేట్ చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. 

కరోనా వైరస్ కారణంగా ప్రస్తుతం చాలా మంది ఉద్యోగులకు కంపెనీలు వర్క్ ఫ్రమ్ హోమ్ అవకాశం ఇచ్చాయి. దీంతో అంతా ఇళ్లలోనే ఉంటున్నారు. సో, యోగా ప్రాక్టీస్ చేయడానికి ఇది మంచి సమయం అన్నమాట. ఇంట్లోనే చేసుకునే ఎక్సర్ సైజులు యోగాలో చాలానే ఉన్నాయి. వర్క్ స్టేషన్ అంటే పని చేస్తున్న చోటే వీటిని చేసుకోవచ్చు. జూన్ 21న అంతర్జాతీయ యోగా డే సందర్భంగా అలాంటి వాటిలో కొన్ని యోగా ఎక్సర్ సైజుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. వీటితో నొప్పులు, స్ట్రెస్ దూరం అవడమే కాదు ఆరోగ్యం సొంతమవుతుంది. బాడీ ఫిట్ గా ఉంటుంది.

చేతి కండరాల రిలాక్స్ కోసం:
కుర్చీలో కూర్చుని మీ రెండు చేతులు పైకి లేపాలి. అలా 5 సెకన్ల పాటు గాల్లో ఉంచాలి. ఎడమ అరచేతిని కుడి మోచేయిపై ఉంచాలి. ఆ తర్వాత చేతులు చాపాలి. ఇలాగే మరో చేతితో చేయాలి. ఇలా 20 సార్లు రిపీట్ చేయాలి. ఇలా చేయడం వల్ల కంప్యూటర్, ఫోన్ ఎక్కువగా వాడటం వల్ల వచ్చిన స్ట్రెస్ నుంచి చేతి కండరాలు రిలాక్స్ అవుతాయి. 

కాళ్లలో వాపులు రాకుండా:
ఈ యోగా ఎక్సర్ సైజు ఎక్కడైనా చేసుకోవచ్చు. వర్క్ స్టేషన్ లో, వాష్ రూమ్ లో, క్యాంటీన్ లో కూడా. కాలి బొటన వేళ్లపై నిల్చోవాలి. మూడు సెకన్ల పాటు నిల్చోవాలి. మెల్లగా నార్మల్ స్టేజ్ కి రావాలి. ఇలా 30 సార్లు రిపీట్ చేయాలి. ఈ ఎక్సర్ సైజ్ వల్ల కలిగే లాభం ఏంటంటే కాళ్లలో వాపులు రావు. సాధారణంగా ఒకే పొజిషన్ లో ఎక్కువ సేపు కూర్చున్నప్పుడు కాళ్లలో వాపులు వచ్చే అవకాశం ఉంది. దానికి పరిష్కారమే ఈ యోగా ఎక్సర్ సైజ్.

కండరాల రిలాక్స్ కోసం:
సీటులో కూర్చున్న చోటే కాలిని నేలకు సమాంతరంగా పైకి లేపాలి. కాలిని ఒకసారి క్లాక్ వైజ్ లో యాంటీ క్లాక్ వైజ్ లో మూడు సార్లు తిప్పాలి. ఆ తర్వాత యథాతథ స్థితికి తేవాలి. ఇలా 10 సార్లు చేయాలి. కండరాలు రిలాక్స్ అవడానికి ఈ ఎక్సర్ సైజు సాయపడుతుంది.

మెడ రిలాక్స్ కోసం:
మెడను రైట్ కి లెఫ్ట్ కి.. పైకి, కిందకి తిప్పాలి. ఇలా 10 సార్లు రిపీట్ చేయాలి. ఇలా చేయడం వల్ల మెడ నొప్పులు రావు, రిలాక్స్ అవుతుంది.

కళ్ల రిలాక్స్ కోసం:
వర్క్ చేసేటప్పుడు మన శరీరంలో ఎక్కువగా స్ట్రెయిన్ అయ్యేవి కళ్లు. కంప్యూటర్, ఫోన్ల నుంచి వచ్చే లైటింగ్ కారణంగా కళ్లు అలసిపోతాయి. ఈ పరిస్థితుల్లో కళ్ల రిలాక్స్ కోసం ఈ ఎక్సర్ సైజులు చేయాలి. కంప్యూటర్ నుంచి పక్కకి వెళ్లాలి. కళ్లను 30 సెకన్ల పాటు బ్లింక్ చేయాలి. ఇలా పది సార్లు చేయాలి. 50 ఫీట్ల దూరంలో ఉన్న వస్తువుని చూడాలి. ఇలా 5సార్లు చేయాలి. అర చేతుల్లో హీట్ వచ్చే వరకు బాగా రుద్దాలి. ఆ తర్వాత ఆ చేతులతో కళ్లను 20 సెకన్ల పాటు మూసి ఉంచాలి. ఇలా ఐదు సార్లు చేయాలి.

కచ్చితంగా గంటకు ఒకసారి లేచి 50అడుగులు నడవాలి:
ఎక్సర్ సైజు అంటే గంటల తరబడి జిమ్ లో కసరత్తులు చేయడం కాదు. ఇలాంటి చిన్న చిన్నవి కూడా ఎక్సర్ సైజులే. ఈ ఎక్సర్ సైజులతో పాటు హెల్తీ ఫుడ్ తీసుకోవడం మస్ట్. అన్నింటికంటే ముఖ్యమైన విషయం ఏంటంటే, సిస్టమ్ ముందు కూర్చున్న సమయంలో ప్రతి గంటకు ఒకసారి కుర్చీ నుంచి పైకి లేసి పక్కకి వెళ్లాలి. కనీసం 50 అడుగులు నడవాలి. ఇది అస్సలు మర్చిపోకూడదు. ఇవన్నీ పాటిస్తే మీ దేహం మీకు థ్యాంక్స్ చెబుతుంది.

యోగాతో డిప్రెషన్ దూరం:
అంతేకాదు కుంగుబాటు నుంచి బయటపడాలంటే వారానికోసారి తప్పనిసరిగా యోగా చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. యోగా వల్ల కుంగుబాటు లక్షణాలు తగ్గుతున్నాయనే విషయాన్ని ఆధారాలతో సహా నిరూపించామని, అందువల్ల ఇతరులు సైతం తమ ఆరోగ్య సంరక్షణకు యోగాను ఆచరించే అవకాశం ఉందన్నారు.

శరీర అందంతో పాటు మనసుని అదుపులో ఉంచుతుంది:
వాస్తవానికి యోగా అనేది పూరాతమైన చికిత్స ప్రక్రియ. కానీ కాలక్రమేణా యోగాను విస్మరించడం వల్ల అది మరుగునపడిపోయింది. ఇటీవల కాలంలో యోగాను ప్రాముఖ్యత పెరగడం.. ప్రపంచ దేశాలు సైత ఆచరిస్తుండడంతో తిరిగి యోగాకు పునర్వైభవం దక్కింది. అయితే ఇంకా చాలామంది యోగాను కేవలం శరీర అందానికి పనికొచ్చే విషయంగానే చూస్తున్నారు. కానీ ఇది నిజానికి శరీర అందంతో పాటు మనస్సును అదుపులో ఉంచుతుంది.

మానసిక వ్యథకు దివ్య ఔషధం యోగా:
సాధారణంగా కొన్ని వ్యాధులకు మానసిక వ్యథ కారణం. అయితే మానసిక వ్యథ అనేదాన్ని నయం చేసేందుకు మెడిసిన్ కంటే యోగా ప్రక్రియ అత్యుత్తమం. నిత్యం యోగాను ఆచరించడం వల్ల మనస్సు, శరీరం రెండూ అదుపులో ఉంటాయి. ఫలితంగా అనేక వ్యాధుల బారి నుంచి బయటపడే అవకాశం ఉంది. ఈ విషయాన్నిఇటీవల కొంతమంది ప్రపంచ ప్రఖ్యాత శాస్త్రవేత్తలు సైతం నిరూపించారు.

Read: జూన్ 21 ‘‘సెవెన్ స్పెషల్ డేస్’’…అవేంటంటే..