Curry Leaf Tea : జర్నీ సమయంలో వాంతులు, వికారం సమస్యా? ప్రయాణానికి ముందు ఈ టీ తీసుకోండి!

రోజువారిగా ఒత్తిడిని ఎదుర్కోనే వారు దాని నుండి బయటపడేందుకు సాయంత్రం పూట ఒక క‌ప్పు క‌రివేపాకుల టీని తాగితే ఒత్తిడి అంతా మ‌టుమాయం అవుతుంది. మ‌న‌స్సు ప్ర‌శాంతంగా మారుతుంది. క‌రివేపాకుల టీని తాగ‌డం వ‌ల్ల వాంతులు, వికారం, మార్నింగ్ సిక్‌నెస్ త‌గ్గుతాయి.

Curry Leaf Tea : జర్నీ సమయంలో వాంతులు, వికారం సమస్యా? ప్రయాణానికి ముందు ఈ టీ తీసుకోండి!

Curry leaf tea

Curry Leaf Tea : భార‌తీయులు ఎంతో కాలం నుంచి ఉప‌యోగిస్తున్న వంట ఇంటి సామ‌గ్రిలో క‌రివేపాకు కూడా ఒక‌టి. కరివేపాకు దేశవ్యాప్తంగా చాలా మందికి హాట్ ఫేవరెట్‌గా మారింది. దీంతో తయారు చేసే టీ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుండటంతో చాలా మంది రోజువారిగా కరివేపాకు టీని తాగుతున్నారు. అన్ని ప్రాంతాల్లో సులభంగా దొరుకుతుండటం, ఆరోగ్యానికి మేలు కలుగుతుండటంతో కరివేపాకు టీని తాగేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. క‌రివేపాకును టీ రూపంలో చేసుకుని నిత్యం తాగితే అద్భుత‌మైన లాభాలు క‌లుగుతాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.

20 క‌రివేపాకుల‌ను తీసుకుని బాగా క‌డ‌గాలి. ఒక పాత్ర తీసుకుని అందులో కొంత నీరు పోసి బాగా మ‌రిగించాలి. మ‌రిగిన నీటిలో క‌రివేపాకుల‌ను వేయాలి. ఆ నీటిలో కొంత‌సేపు ఆ ఆకుల‌ను అలాగే ఉండ‌నిస్తే ఆ నీరు రంగు మారుతుంది. త‌రువాత ఆ నీటిలోంచి ఆకుల‌ను తీసేసి ఆ నీటిని తాగాలి. నిత్యం ఉద‌యాన్నే ప‌ర‌గ‌డుపున క‌రివేపాకుల‌తో త‌యారు చేసే ఈ టీని తాగ‌డం వ‌ల్ల ఎన్నో లాభాలు శరీరానికి అందుతాయి.

జీర్ణ‌శ‌క్తి పెంచటంలో ఇది బాగా తొడ్పడుతుంది. ఆయుర్వేద ప్ర‌కారం క‌రివేపాకులో జీర్ణాశ‌యానికి మేలు చేసే పోష‌కాలు ఉంటాయి. కాబట్టి ఈ ఆకుల టీని తాగితే సుఖ విరేచ‌నం అవుతుంది. జీర్ణ శక్తి పెరుగుతుంది. మ‌ల‌బ‌ద్ద‌కం, డ‌యేరియా, గ్యాస్ త‌గ్గుతాయి. అలాగే బ్ల‌డ్ షుగ‌ర్ లెవ‌ల్స్ కంట్రోల్ చేయటంలో సహాయకారిగా కరివేపాకుల టీ తోడ్పడుతుంది. . క‌రివేపాకుల టీ వ‌ల్ల డ‌యాబెటిస్ అదుపులో ఉంటుంద‌ని, షుగ‌ర్ లెవ‌ల్స్ త‌గ్గుతాయ‌ని టాంగ్ సెంట‌ర్ ఫ‌ర్ హెర్బ‌ల్ మెడిసిన్ రీసెర్చ్, యూనివ‌ర్సిటీ ఆఫ్ చికాగోల‌కు చెందిన ప‌రిశోధ‌కులు తేల్చారు. గ‌ర్భిణీలు ఈ టీని తాగితే ఆయా స‌మ‌స్య‌ల నుంచి ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంది.

రోజువారిగా ఒత్తిడిని ఎదుర్కోనే వారు దాని నుండి బయటపడేందుకు సాయంత్రం పూట ఒక క‌ప్పు క‌రివేపాకుల టీని తాగితే ఒత్తిడి అంతా మ‌టుమాయం అవుతుంది. మ‌న‌స్సు ప్ర‌శాంతంగా మారుతుంది. క‌రివేపాకుల టీని తాగ‌డం వ‌ల్ల వాంతులు, వికారం, మార్నింగ్ సిక్‌నెస్ త‌గ్గుతాయి. శ‌రీరంలో ఫ్రీ ర్యాడిక‌ల్స్ వ‌ల్ల క‌లిగే న‌ష్టాన్ని నివారిస్తాయి. చ‌ర్మ క‌ణాల‌ను సుర‌క్షితంగా ఉంచుతాయి. శ‌రీరంలో ఇన్ఫెక్ష‌న్లు, వాపులు రాకుండా కాపాడుతాయి. క‌రివేపాకుల్లో ఫినోలిక్స్ అన‌బ‌డే స‌మ్మేళ‌నాలు ఉంటాయి. ఇవి ప‌వ‌ర్ ఫుల్ యాంటీ ఆక్సిడెంట్‌లుగా ప‌నిచేస్తాయి. జ‌ర్నీలో వాంతులు కాకుండా ఉండాలంటే ప్రయాణానికి ముందుగా ఈ టీని తాగటం వల్ల మంచి ఫలితం ఉంటుంది.