Aloe Vera And Orange : అలోవేర, అరెంజ్ ఫేస్ ప్యాక్ తో చర్మాన్ని పట్టులా, కోమలంగా, అందంగా మార్చుకోండి!

లోవెర చర్మంపై దద్దుర్లు, దురద, మంట నుంచి తక్షణ ఉపశమనాన్ని కలిగిస్తాయి. ఇది శీతలీకరణ లక్షణాలను కలిగి ఉంటుంది. ఔషధ గుణాలతో సమృద్ధిగా ఉండే అలోవేరా అన్ని చర్మ రకాలకు అనుకూలంగా ఉంటుంది.

Aloe Vera And Orange : అలోవేర, అరెంజ్ ఫేస్ ప్యాక్ తో చర్మాన్ని పట్టులా, కోమలంగా, అందంగా మార్చుకోండి!

Vera and Orange Face Pack

Aloe Vera And Orange : సాధారణంగా , మనలో చాలా మంది ఇలా ముఖంలో అకస్మాత్తుగా కనిపించే మార్పులకు భయపడిపోయి బ్యూటీ పార్లర్స్ చుట్టూ తిరుగుతూ ఖరీదై బ్యూటీప్రొడక్ట్స్ ను కొని, ఉపయోగిస్తుంటారు . మార్కెట్లో దొరికే వివిధ రకాల ఉత్పత్తులు ఎఫెక్టివ్ గా మచ్చలను మొటిమలను నివారిస్తాయనుకుంటారు. ఈ కెమికల్ ప్రొడక్ట్స్ ను ఉపయోగించడం వల్ల ఇవి చర్మానికి మేలు చేయడం కంటే హాని ఎక్కువ చేస్తుంది. కాబట్టి, మన వంటగదిలోని కొన్ని నేచురల్ ప్రొడక్ట్స్ ఎంపిక చేసుకోవడం మంచిది. ఆరెంజ్ అలోవెరో వంటివి చర్మ సంరక్షణలో ముఖ్య పాత్ర పోసిస్తాయి. ఆరెంజెస్, ఆలోవెరా ఈ రెండింటిలోనూ చర్మాన్ని మృదువుగా, పట్టులా, కోమలంగా, అందంగా, మెరిసేలా చేసే గుణాలుంటాయి. ఇవి చర్మంలో పొడిదనాన్ని తగ్గిస్తాయి. అందువల్ల చర్మం నిగారిస్తుంది.

అలోవెర చర్మంపై దద్దుర్లు, దురద, మంట నుంచి తక్షణ ఉపశమనాన్ని కలిగిస్తాయి. ఇది శీతలీకరణ లక్షణాలను కలిగి ఉంటుంది. ఔషధ గుణాలతో సమృద్ధిగా ఉండే అలోవేరా అన్ని చర్మ రకాలకు అనుకూలంగా ఉంటుంది. జిడ్డు చర్మం, పొడి చర్మం, సున్నితమైన చర్మం ఉన్నవారు ఎవరైనా ఉపయోగించవచ్చు. కలబందను సౌందర్య ఉత్పత్తులలో ఎక్కువగా ఉపయోగిస్తారు. ఇది హైడ్రేటింగ్, మాయిశ్చరైజింగ్ వంటి లక్షణాలను కలిగి ఉంటుంది. ఇది చర్మాన్ని హానికరమైన అతినీలలోహిత కిరణాల నుంచి రక్షిస్తుంది.

నారింజ జ్యూస్ చర్మంపై ఉండే మృతకణాలన్నీ సులభంగా తొలగిస్తుంది. చర్మం మృదువుగా అవటమే కాకుండా, కొత్త మెరుపును సంతరించుకునేలా చేస్తుంది. చర్మం పై ఉన్న మచ్చలు పోవడమే కాకుండా కాంతివంతమైన ముఖం మీ సొంతమవుతుంది. ముఖం నునుపుగా మారటమే కాకుండా చల్లదనాన్ని ఇస్తుంది. ఆరెంజ్ లో విటమిన్ C పుష్కలంగా ఉంటుంది. అలాగే యాంటీఆక్సిడెంట్స్ బాగా ఉంటాయి. ఇవి చర్మ కణాల్ని కాపాడి, మృతకణాల్ని తరిమేసి ముడతల్ని పోగొడతాయి.

మరి ఈ రెండింటి కాంబినేషన్ లో ఫేస్ మాస్క్ ఎలా తయారుచేసుకుని ఎలా ఉపయోగించాలో తెలుసుకుందాం

అలోవే, ఆరెంజ్ ఫేస్ మాస్క్ తయారీ ; దీనికి గాను ముందుగా 3 టేబుల్ స్పూన్ల ఆరెంజ్ జ్యూస్, 2 టేబుల్ స్పూన్ల అలోవెర జెల్ తీసుకోవాలి. ఒక మిక్సింగ్ బౌల్లో వేసి వీటిని మిక్స్ చేయాలి. తర్వాత దీన్ని ముఖానికి అప్లై చేయాలి. 20 నిముషాల తర్వాత శుభ్రం చేసుకోవాలి. ఇలా వారానికి రెండు మూడు సార్లు చేస్తూ ఉంటే మంచి ఫలితం కనిపిస్తుంది.