కరోనా వైరస్‌లో భయానక మార్పులు.. 10 రెట్లు ప్రమాదకరమంటున్న సైంటిస్టులు

  • Published By: sreehari ,Published On : August 17, 2020 / 01:58 PM IST
కరోనా వైరస్‌లో భయానక మార్పులు.. 10 రెట్లు ప్రమాదకరమంటున్న సైంటిస్టులు

ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభిస్తోంది.. మలేసియాలో కరోనా కేసుల్లో కొత్త భయానక మార్పులు ఆందోళన పుట్టిస్తున్నాయి. కరోనా వ్యాక్సిన్‌ కోసం ప్రపంచ దేశాలు తీవ్రంగా శ్రమిస్తున్న నేపథ్యంలో రష్యా వ్యాక్సిన్‌ను ప్రకటించింది.. వ్యాక్సిన్ ఉత్పత్తిని కూడా ప్రారంభించింది. మలేషియాలో కొన్ని కరోనా కేసులు ప్రపంచ దేశాలకు మరో కొత్త సవాలు విసురుతున్నాయి.



మలేషియాలో కరోనా వైరస్‌ కొత్త జాతిని గుర్తించారు శాస్త్రవేత్తలు. ప్రస్తుతం ఉ‍న్న వైరస్‌ కంటే 10 రెట్లు ప్రమాదకరమైనదిగా వెల్లడించారు. మలేషియాలో వెలుగు చూసిన కొన్ని కేసుల్లో వేగంగా వ్యాప్తి చెందేలా కరోనా వైరస్‌ మార్పుకు గురయినట్లు సంకేతాలు ఉన్నాయని అమెరికా అంటువ్యాధి నిపుణుడు డాక్టర్‌ ఆంథోనీ ఫౌసీ హెచ్చరించారు.

Malaysia Finds More Infectious Virus Strain Seen in Europe

ప్రపంచంలోని ఇతర ప్రాంతాలలో చూసిన D614G అని పిలిచే ఈ మ్యుటేషన్, క్లస్టర్‌లోని 45 కేసులలో కనీసం మూడు కేసులలో గుర్తించారు. రెస్టారెంట్ యజమాని భారత్ నుంచి తిరిగి వచ్చి 14 రోజుల హోం క్వారంటైన్ ఉల్లంఘించాడు.. ఆ వ్యక్తికి 5 నెలల జైలు శిక్ష జరిమానా విధించింది. ఫిలిప్పీన్స్ నుంచి తిరిగి వచ్చే వ్యక్తులతో కూడిన మరొక క్లస్టర్‌లో కూడా ఈ కొత్త జాతి వైరస్ ఉన్నట్టు గుర్తించారు.



వ్యాక్సిన్లపై ఇప్పటికే ఉన్న అధ్యయనాలు మ్యుటేషన్‌కు అసంపూర్తిగా లేదా అసమర్థంగా ఉండవచ్చని హెల్త్ డైరెక్టర్ జనరల్ నూర్ హిషాం అబ్దుల్లా చెప్పారు. మ్యుటేషన్ ఐరోపా, అమెరికాలో మరింత భయానకంగా మారింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈ జాతి మరింత తీవ్రమైన వ్యాధికి దారితీస్తుందని ఎటువంటి ఆధారాలు లేవు.



ప్రస్తుతం అభివృద్ధి చెందుతున్న వ్యాక్సిన్ల సమర్థతపై మ్యుటేషన్ పెద్ద ప్రభావాన్ని చూపే అవకాశం లేదు. మలేషియాలో కరోనా కొత్త జాతి వెలుగులోకి రావడంతో ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలని నూర్ హిషామ్ తెలిపారు. దీనికి ప్రజల సహకారం చాలా అవసరమన్నారు.