ప్రతి 100 సెకన్లకు 20ఏళ్ల లోపు ఒకరు HIV బారిన పడ్డారు : UNICEF

  • Published By: sreehari ,Published On : November 26, 2020 / 08:54 PM IST
ప్రతి 100 సెకన్లకు 20ఏళ్ల లోపు ఒకరు HIV బారిన పడ్డారు : UNICEF

2019లో ప్రపంచవ్యాప్తంగా ప్రతి 100 సెకన్లకు ఒక పిల్లవాడు లేదా యువకుడు హెచ్ఐవీ బారిన పడ్డారని UNICEF ఒక కొత్త నివేదికలో వెల్లడించింది. సుమారు 20 ఏళ్ల లోపు ఉన్నవారే హెచ్ఐవీ సోకినవారిలో ఉన్నారని పేర్కొంది.



దాదాపు 320,000 మంది పిల్లలు యువన దశలో ఉన్నవారు హెచ్‌ఐవి బారిన పడ్డారు. గత ఏడాదిలో 1 లక్ష 10వేల మంది చిన్నారులు ఎయిడ్స్‌తో మరణించారు. 2019లో హెచ్ఐవీ నివారణ ప్రయత్నాలు, ట్రీట్‌మెంట్ అనేది కీలక జనాభాలో అత్యల్పంగా ఉన్నాయి.



ప్రపంచవ్యాప్తంగా పిల్లలలో సగం కంటే తక్కువ మందికి లైవ్ సేవింగ్ ట్రీట్‌మెంట్ అందుబాటులో లేదని యునిసెఫ్ నివేదికలో పేర్కొంది. ఇప్పటికీ చిన్నారులు, యువకులు ఎక్కువగా హెచ్ఐవీ బారిన పడి ఎయిడ్స్‌తో మరణిస్తున్నారు.



కరోనా మహమ్మారితో ప్రపంచం పోరాడుతున్నప్పటికీ, వందల వేల మంది పిల్లలు హెచ్‌ఐవి మహమ్మారి బారిన పడుతున్నారని నివేదిక తెలిపింది. కొన్ని దేశాలలో పిల్లలలో పీడియాట్రిక్ హెచ్ఐవి చికిత్స వైరల్ లోడ్ పరీక్ష 50 నుంచి 70 శాతంగా ఉంది.

ఏప్రిల్, మే నెలలలో కొత్త చికిత్స 25శాతం నుంచి 50 శాతం వరకు పడిపోయింది. ఆరోగ్య సదుపాయాల పంపిణీ, ప్రసూతి చికిత్స కూడా 20 నుంచి 60 శాతానికి తగ్గింది.



ప్రసూతి హెచ్‌ఐవి టెస్టింగ్ అండ్ యాంటీరెట్రోవైరల్ థెరపీ (ART) కవరేజ్ కూడా 25 నుంచి 50 శాతం, శిశు టెస్టింగ్ సర్వీసులపై కూడా సుమారు 10 శాతంగా ఉంది. ఉత్తర ఆఫ్రికా ప్రాంతంలో 81 శాతం పీడియాట్రిక్ ART కవరేజ్ నమోదైంది.



లాటిన్ అమెరికా, కరేబియన్, పశ్చిమ మధ్య ఆఫ్రికాలో వరుసగా 46 శాతం, 32 శాతం మాత్రమే ఉన్నాయి. దక్షిణాసియా ప్రాంతంలో 76 శాతం, తూర్పు, దక్షిణాఫ్రికా 58 శాతం, తూర్పు ఆసియా, పసిఫిక్ 50 శాతం కవరేజీని నమోదు చేసింది.