ఆన్‌లైన్‌ షాపింగ్ జబ్బే : హెచ్చరించిన WHO

  • Published By: chvmurthy ,Published On : November 6, 2019 / 04:12 AM IST
ఆన్‌లైన్‌ షాపింగ్ జబ్బే : హెచ్చరించిన WHO

ఆన్‌లైన్‌ లో విచ్చలవిడిగా షాపింగ్ చేయటం 2024 నాటికి ఓమానసిక జబ్బుగా మారుతుందని ప్రపంచ ఆరోగ్య సంస్ధ హెచ్చరించింది. స్మార్ట్ ఫోనులోనూ, ఇతరత్రా డిజిటల్ మాధ్యమాల ద్వారా అతిగా షాపింగ్ చేయటం వలన ఆర్ధిక సమస్యలు కొని తెచ్చుకునే వారి సంఖ్య పెరగడమే ఇందుకు కారణమని ఈ అంశంపై రీసెర్చ్‌ చేసిన గార్ట్‌‌నర్‌ కంపెనీ‌ తెలిపింది. 

ఆన్‌‌లైన్‌‌ షాపింగ్‌‌ కోసం కస్టమర్లు వెచ్చించే మొత్తం 2022 నాటికి 10 శాతం పెరుగుతుందని గుర్తించారు. దీనివల్ల కోట్ల మంది అప్పుల బారినపడతారని గార్ట్‌‌నర్‌‌ హెచ్చరించింది. కస్టమర్లు తరచూ షాపింగ్‌‌ చేసేలా చేయడానికి కంపెనీలు ఆర్టిఫిషియల్‌‌ ఇంటెలిజెన్స్‌‌, పర్సనలైజేషన్‌‌ టెక్నాలజీ ద్వారా వారిని ఆకర్షిస్తాయని గార్ట్‌‌నర్‌‌కు చెందిన డెరిల్‌‌ ప్లమర్‌‌ అన్నారు. కాలు కదపకుండా ఇంటి నుండి చేసే కొనుగోళ్ల భారం రానురాను పెరగడం వల్ల బాధితుడి ఆర్థిక పరిస్థితి తల్లకిందులు అవుతుంది. 

దీనివల్ల కోనుగోలుదారుడు డిప్రెషన్‌‌ సహా అనేక ఆరోగ్య సమస్యలకు గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ అంశాలపై డబ్ల్యూహెచ్‌‌ఓ స్టడీ చేస్తోంది. టెక్నాలజీ వల్ల అడిక్టివ్‌‌ డిజార్డర్ల బారినపడే వారి సంఖ్య 2023 నాటికి భారీగా పెరుగుతుందని గార్ట్‌‌నర్‌‌ రిపోర్టు వివరించింది. వికలాంగ ఉద్యోగుల సంఖ్యా పెరుగుతుంది. ఉదాహరణకు రెస్టారెంట్లు, ఏఐ రోబోటిక్స్ టెక్నాలజీని వాడితే వికలాంగ ఉద్యోగి కూడా ఆహార పదార్థాలు వడ్డించగలుగుతాడు.