వేరియంట్ మ్యుటేషన్‌పై ఫైజర్ వ్యాక్సిన్ ప్రభావవంతంగా పనిచేస్తుంది!

వేరియంట్ మ్యుటేషన్‌పై ఫైజర్ వ్యాక్సిన్ ప్రభావవంతంగా పనిచేస్తుంది!

Pfizer vaccine key variant mutation : కొత్త వేరియంట్ కరోనావైరస్ ప్రపంచాన్ని వణికిస్తోంది. కరోనా కొత్త వేరియంట్ పాత కరోనా కంటే ప్రాణాంతకమని, అత్యంత వేగంగా వ్యాపిస్తోందంటూ ప్రపంచమంతా ఆందోళన వ్యక్తమవుతోంది. కరోనా ప్రారంభంలోని వైరస్‌కు అనుగుణంగా అభివృద్ధి చేసిన కరోనా వ్యాక్సిన్లు.. కొత్తగా రూపాంతరం (మ్యుటేషన్) చెందిన కరోనా వేరియంట్ పై ఎంతవరకు ప్రభావంతంగా పనిచేయగలవు అనేదానిపై సందిగ్ధత నెలకొంది.

ఇలాంటి పరిస్థితుల్లో కరోనా వ్యాక్సిన్ల సురక్షితంపై కూడా అనేక సందేహాలు, భయాలు ఆందోళన కలిగిస్తున్నాయి. అసలు వ్యాక్సిన్ వేయించుకోవాలా? వద్దా అనే కన్ఫ్యూజన్ లో ఉన్నారు జనమంతా.. కొత్త అధ్యయనం ప్రకారం.. ఫైజర్-బయోఎంటెక్ అభివృద్ధి చేసిన కరోనావైరస్ వ్యాక్సిన్ దక్షిణాఫ్రికా, యూకేలలో ఉద్భవించిన కొత్త వేరియంట్ మ్యుటేషన్లపై ప్రభావవంతంగా పనిచేయగలదని రుజువైంది. ఈ మ్యుటేషన్లను సమర్థవంతంగా నిరోధించడంలో టీకా ఎలా పని చేస్తుందనే దానిపై ఇంకా ఖచ్చితమైన డేటా అందుబాటులో లేదు. కరోనావైరస్ ఒకరి నుంచి మరొకరికి తరచూ వ్యాపిస్తుంటాయి. చాలా వరకు, వైరస్ గణనీయంగా మారదు.

వైరస్ వేగంగా వ్యాప్తి చెందడానికి కొన్ని మ్యుటేషన్లు కారణమవుతాయి. ఈ మార్పులు వైరస్ స్పైక్ ప్రోటీన్లలో ఎక్కువగా జరుగుతుంటాయి. ఎందుకంటే వైరస్ మానవ కణాలలోకి ప్రవేశించడానికి ఇవే కీలకమైనవి. టెక్సాస్ యూనివర్శిటీకి చెందిన పరిశోధకులతో ఫైజర్ కోవిడ్-19 వ్యాక్సిన్ తీసుకున్న 20 మంది బాధితుల నుంచి రక్త నమూనాల ఆధారంగా అధ్యయనం చేసింది. వైరస్ రెండు రూపాలను సృష్టించారు. అందులో ఒకటి ముట్యేషన్ తో.. మరొకటి మ్యుటేషన్ లేకుండా క్రియేట్ చేశారు.

ఆ వైరస్లను బాధితుల రక్త నమూనాలలో ఇంజెక్ట్ చేయగా.. అందులోని రోగనిరోధక వ్యవస్థ కొత్త మ్యుటేషన్‌ను ప్రభావితం చేసినట్టు గుర్తించారు. అయితే దీనిపై ఇంకా పరిశోధనను ధ్రువీకరించలేదు. టీకా N501Y పిలిచే మ్యుటేషన్ స్థిరపరచేందుకు పనిచేస్తుందని సూచించింది. యూకే, దక్షిణాఫ్రికా వేరియంట్లలో కనిపించే ఇతర మ్యూటేషన్లకు వ్యతిరేకంగా టీకాలు పనిచేస్తాయా అనే దానిపై రాబోయే కొద్ది వారాల్లో మరింత డేటా అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని అంటున్నారు.