Oily Scalp In Summer : వేసవిలో జిడ్డుగల శిరోజాల విషయంలో పురుషులు పాటించాల్సిన జాగ్రత్తలు !

జుట్టును శుభ్రంగా ఉంచుకోవడం అన్నది చాలా ముఖ్యం అయితే, ఎక్కువ సార్లు తలస్నానం చేయడం వల్ల చమురు ఉత్పత్తి ప్రేరేపించబడుతుంది. రోజువారిగా ఒక పర్యాయం తలస్నానం చేయండి. అలాగని ఎక్కువసార్లు తలస్నానం చేయటం వల్ల తలలోని సహజ నూనెలను కోల్పోవాల్సి వస్తుంది.

Oily Scalp In Summer : వేసవిలో  జిడ్డుగల శిరోజాల విషయంలో పురుషులు పాటించాల్సిన జాగ్రత్తలు !

Oily Hair Scalp In Summer

Oily Scalp In Summer : వేసవి కాలంలో జిడ్డుగల కలిగిన జుట్టుతో పురుషులలో ఆందోళన రేకెత్తిస్తుంది. వేసవి వేడి కారణంగా తేమ , చెమటల కారణంగా ఈ పరిస్ధితి ఎదుర్కోవాల్సి వస్తుంది. సరైన జుట్టు సంరక్షణ కోసం ఉత్పత్తుల వినియోగం, వాటి పనితీరు మెరుగైన ఫలితాల కోసం ఎక్కువ సమయం పడుతుంది. జిడ్డుకలిగిన శిరోజాలు ఉన్న పురుషులు అదనపు నూనె ఉత్పత్తిని కంట్రోల్ చేయటానికి తగిన చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. జిడ్డుగల శిరోజాలను సంరక్షణ కోసం నిపుణులు కొన్ని సులభమైన చిట్కాలను సూచిస్తున్నారు. అవేంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం…

READ ALSO : Prevent Hair Loss : జుట్టు రాలడాన్ని నివారించటంతోపాటు జుట్టుకు పోషణనిచ్చే సూపర్ ఫుడ్స్ !

శిరోజాల జిడ్డు నుండి రక్షణ కోసం చిట్కాలు ;

1. జుట్టును క్రమం తప్పకుండా తలస్నాం చేయాలి : జిడ్డుగల శిరోజాలు కలిగిన వారు క్రమం తప్పకుండా తలస్నానం చేయటం అవసరం. జిడ్డుగల జుట్టు కోసం ప్రత్యేకంగా రూపొందించిన సున్నితమైన షాంపూని ఉపయోగించాలి. టీ ట్రీ ఆయిల్ లేదా సాలిసిలిక్ యాసిడ్ వంటి పదార్థాలను ఉపయోగించాలి. ఇవి చమురు ఉత్పత్తిని నియంత్రించడంలో సహాయపడుతుంది. షాంపూని తీసుకుని జుట్టు కుదుళ్ళలో మసాజ్ చేయాలి, మూలాలపై దృష్టి పెట్టాలి. పూర్తిగా శుభ్రం చేసుకోవాలి.

2. తలస్నానానికి వేడి నీటిని నివారించంటం : వేడి నీరుతో తలస్నానం చేయటం వల్ల తలలో సేబాషియస్ గ్రంధులను ప్రేరేపిస్తుంది, ఇది చమురు ఉత్పత్తిని పెంచుతుంది. దీనికి బదులుగా గోరు వెచ్చని నీటిని తలస్నానానికి ఉపయోగించండి. ఇలా చేస్తే తలలో నూనె పేరుకుపోకుండా చూసుకోవచ్చు.

3. తేలికపాటి కండీషనర్‌ని ఉపయోగించండి: శిరోజాలను శుభ్రంగా ఉంచుకోవడం ముఖ్యం అయినప్పటికీ, జుట్టును తేమగా ఉంచడానికి రసాయన రహితమైన షాంపూలను మాత్రమే ఉపయోగించాలి. తేలికైన, నూనె లేని కండీషనర్‌ను ఎంపిక చేసుకోవాలి. జుట్టు చివర్లకు మాత్రమే అప్లై చేయాలి. జుట్టు కుదుళ్ళప్రాంతంలో అప్లై చేయటం నివారించాలి.

READ ALSO : Porridge : చర్మాన్ని ఇన్ఫెక్షన్ల బారి నుండి కాపాడటంతోపాటు, జుట్టు రాలిపోయే సమస్యను నివారించే గంజి !

4. స్టైలింగ్ ఉత్పత్తులను అతిగా ఉపయోగించవద్దు ; జెల్‌లు, మైనపు క్రీమ్ లు, పోమేడ్స్ వంటి స్టైలింగ్ ఉత్పత్తులు జిడ్డుగల శిరోజాలకు కారణమౌతాయి. ఈ ఉత్పత్తుల వినియోగాన్ని తగ్గించటం మంచిది. వాటిని ఉపయోగించినప్పుడు నీటి ఆధారిత లేదా నూనె రహిత ప్రత్యామ్నాయాలను ఎంచుకోవాలి.

5. శిరోజాలను కుదుళ్ళను పదేపదే తాకడం మానుకోండి : చేతులతో జుట్టును తాకడం వల్ల నూనె , ధూళి తలలోకి చేరే అవకాశం ఉంటుంది. దీని వల్ల సమస్యను మరింత తీవ్రతరం చేస్తుంది. జుట్టులో వేళ్లను ఉపయోగించి గోకటం వంటి పనులు చేయరాదు.

6. డ్రై షాంపూ ఉపయోగించండి: డ్రై షాంపూ జిడ్డుగల శిరోజాలను నిర్వహించడానికి ఉపయోగకరంగా ఉంటుంది., ముఖ్యంగా ఇది అదనపు నూనెను గ్రహించి జుట్టును రిఫ్రెష్ చేస్తుంది. దీన్ని మూలాలపై అప్లై చేసి కొన్ని నిమిషాలు అలాగే ఉండనివ్వాలి.

READ ALSO : చలికాలంలో చర్మ, జుట్టు సంబంధిత సమస్యలు పోగొట్టే ఇంటి చిట్కాలు!

7. ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోండి : తల చర్మం మరియు జుట్టు ఆరోగ్యంలో ఆహారం కీలక పాత్ర పోషిస్తుంది. అధిక మొత్తంలో జిడ్డు, వేయించిన ఆహారాన్ని తీసుకోవడం మానుకోవటం మంచిది. పండ్లు, కూరగాయలు, లీన్ ప్రోటీన్లు, తృణధాన్యాలు కలిగి ఉన్న సమతుల్య ఆహారాన్ని ఎంచుకోవాలి.

8. ఎక్కువసార్లు తలస్నానం చేయటాన్ని నివారించండి: జుట్టును శుభ్రంగా ఉంచుకోవడం అన్నది చాలా ముఖ్యం అయితే, ఎక్కువ సార్లు తలస్నానం చేయడం వల్ల చమురు ఉత్పత్తి ప్రేరేపించబడుతుంది. రోజువారిగా ఒక పర్యాయం తలస్నానం చేయండి. అలాగని ఎక్కువసార్లు తలస్నానం చేయటం వల్ల తలలోని సహజ నూనెలను కోల్పోవాల్సి వస్తుంది. అదే క్రమంలో జుట్టుకు హాని చేసే చమురు ఉత్పత్తి పెరుగుతుంది.

అధికంగా జిడ్డుగల శిరోజాల సమస్యతో ఇబ్బంది పడుతున్నవారు చర్మవ్యాధి నిపుణులను సంప్రదించి తగిన చికిత్స పొందటం మంచిది.