Mushroom : చిట్టడవిలో సహజసిద్ధంగా పెరిగే ఈ పుట్టగొడుగుకు ఫుల్ డిమాండ్ .. కిలో ఎంతో తెలుసా..? తింటే లాభాలెన్నో

ప్రకృతి సహజంగా ఆహారాలు దొరకటమే అరుదు. అందులోని సీజనల్ మాత్రమే లభ్యమయ్యే సహజ సిద్ధమైన ఆహారాలకు మరింత డిమాండ్ ఉంటుంది. పైగా వీటిలో ప్రొటీన్స్ ఎక్కువగా ఉంటే ఆ డిమాండ్ఎంతగా ఉంటుందో ఊహించుకోవచ్చు. అటువంటిదే ఓ అరుదైన పుట్టగొడుగు.

Mushroom : చిట్టడవిలో సహజసిద్ధంగా పెరిగే ఈ పుట్టగొడుగుకు ఫుల్ డిమాండ్ .. కిలో ఎంతో తెలుసా..? తింటే లాభాలెన్నో

Rugda mushroom grows naturally

Updated On : July 29, 2023 / 5:43 PM IST

Jharkhand Rugda mushroom grows naturally : పుట్టగొడుగులు. ఎన్నో ప్రొటీన్లు కలిగి ఉన్న పుట్టగొడుగుల పెంపకం మంచి వ్యాపారంగా మారింది. చిన్నపాటి పాకల్లో కూడా పండించి మంచి లాభాలు పొదుతున్నారు రైతులు. కుటీర పరిశ్రమగా కూడా పుట్టగొడుగుల పెంపకంతో మంచి ఆదాయాలను పొంతున్నారు మహిళా రైతులు. కానీ పండించివాటి కంటే సహజ సిద్ధంగా ప్రకృతిపరంగా లభ్యమయ్యేవాటికి ఎప్పుడు ప్రత్యేకత ఉంటుంది. దానికి తగ్గ డిమాండ్ కూడా ఉంటుంది.సాధారణంగా మనకు సహజంగా దొరికేవి కిలో రూ.100 నుంచి రూ. 200 వరకు ఉంటుంది. అవే ఆర్గానిక్ గా పండించినవైతే రూ. 400 నుంచి రూ.500 ఉంటుంది.

కానీ ఝార్ఖండ్ రాష్ట్రంలో కొన్ని ప్రాంతాల్లో సహజ సిద్ధంగా లభ్యమయ్యే అరుదైన జాతికి చెందిన పుట్టగొడుగు మాత్రం భలే డిమాండ్ ఉంటుంది. ఏడాది పొడుగునా దొరికితే అంత డిమాండ్ ఉండదు. రెండు నెలలకు ఒకసారి మాత్రమే ఇవి లభిస్తాయి. సహజ సిద్ధంగా చెట్ల కింద మొలిచే ఈ పుట్టగొడుగుల్ని సేకరించటం కూడా కాస్త కాస్త కస్టమే. అవి మార్కెట్ కు తెచ్చి అందుబాటులోకి వచ్చేసరికి ధర కూడా ఎక్కువే ఉంటుంది.

పుట్టగొడుగు అనేది అడవి.. చిట్టడవిలో.. సహజ సిద్ధంగా పెరిగిన వాటిలో ఉండే పోషకాలు ఎందులోనూ ఉండవంటే అతిశయోక్తి ఉండదు. అది సహజ సిద్ధంగా మొలుస్తుంది. తగిన తేమను తీసుకుంటుంది. దీంతో వాటిలో పోషకాలు మెండుగా ఉంటాయి. అటువంటి అరుదైన పుట్టగొడుగు ‘రుగ్దా’ అనే రకం పుట్టగొడుగు. వీటికి మార్కెట్ లో ఫుల్ డిమాండ్ ఉంటుంది. కిలో రూ.800ల వరకు పలుకుతుంది.

Brittle Nails : గోళ్లు విరుగుతున్నాయా… జాగ్రత్త

గిరిపుత్రులకు కాసుల పంట పండిస్తున్న రుగ్దా పుట్టగొడుగు
జార్ఖండ్ రాష్ట్రంలోని అటవీ ప్రాంతంలో కొన్ని రకాలైన చెట్ల కింద పెరిగే ఈ రకం పుట్టగొడుగుల కోసం జనాలు వేయి కళ్లతో వెదుకుతారు. ఇవి మార్కెట్ లోకి వచ్చాయంటే చాలా క్షణాల్లో అమ్ముడైపోతాయి. అమ్మిన వ్యక్తికి కష్టానికి మించి ప్రతిఫలం లభిస్తుంది. కిలో 800 రూపాయలు అయినా సరే.. క్యూలో ఉండికొనేస్తారు.డిమాండ్ ను బట్టి కిలో రూ.1200లు కూడా అమ్ముతారు. ఎందుకంటే ఈ రుగ్దా పుట్టగొడుగులు ఏడాది అంతా దొరకవు. కేవలం రెండు నెలలకు ఒకసారి మాత్రమే దొరుకుతాయి. కొంతమంది గిరిజనులు అడవుల్లో సేకరించి పట్టణాలకు తీసుకొచ్చి అమ్ముతుంటారు. అవి ఏఏ సమాయాల్లో మొలుస్తాయో..వారికి బాగా తెలుసు. దీంతో ఆ సమయాల్లో పోటీలు పడి మరీ అడువుల వెంట వాటి కోసం సేకరిస్తుంటారు.

పోషకాల గని రుగ్దా రకం పుట్టగొడుగు..
రుగ్డా అనేది జార్ఖండ్‌లోని కొన్ని ప్రాంతాలలో సహజంగా పెరిగే ఒక రకమైన పుట్టగొడుడు. కొన్ని రకాల పుట్టగొడుగులను వండితే విషంలా మారతాయంటారు. కానీ ఈ రుగ్దా పుట్టగొడుగు మాత్రం తినదగినదిగా ఫుల్ డిమాండ్ పొందింది. సంతాలి, ఒరాన్ లకు చెందిన గిరిజన మహిళలు రుగ్డా పుట్టగొడుగులను సేకరించి మార్కెట్‌లో అమ్ముతుంటారు.

ఇది గుడ్డు పచ్చసొన మాదిరిగానే వెల్వెట్ బ్లాక్ కలర్ లో ఉంటుంది. దీనిని వండాలంటే బాగా శుభ్రం చేయాల్సి ఉంటుంది. మట్టి ఆనవాళ్లు లేకుండా కడిగి వండాలి. చపాతీ లేదా అన్నంతో తినొచ్చు. ఈ పుట్టగొడుగులను సేకరించేవారు చెబుతున్నదానికి బట్టి రుగ్డా పుట్టగొడుగులు ఎక్కువగా అడవులలో సాల్ చెట్ల క్రింద పెరుగుతాయట.

కాగా..రుగ్దా పుట్టగొడుగులు ఛత్తీస్‌గఢ్ (Chhattisgarh),జార్ఖండ్‌(Jharkhand)లలో ఖుక్డి (Khukhadi) అనీ, రుగ్దా (Rugda)అని పిలుస్తారు. వర్షాకాలంలో మాత్రమే లభిస్తాయి. బలరాంపూర్, సూరజ్‌పూర్, సుర్గుజా,కోర్బా జిల్లాలోని అడవులలో సహజంగా పెరుగుతాయి. వీటిని రెండురోజల్లో తినకపోతే పాడైపోతాయి.కేవలం వర్షాకాలంలో మాత్రమే లభ్యం కావటం..తినకపోతే త్వరగా పాడైపోవటంతో వీటికి అంత డిమాండ్ఉంటుంది. ఇవి కూరగాల్లో చాలా ఖరీదైనవి.

READ ALSO : White Hair : పిల్లల్లో తెల్లజుట్టా…. అయితే ఇలా చేయండి

దీనికి సరిగ్గా వండితే మటన్ రుచిని మించి ఉంటుందటంటారు దీనికి తిన్నవారు. శాకాహారులు కూడా రుగ్డాతో మటన్ రుచిని ఆస్వాదించవచ్చంటారు. రుగ్డా ఇతర పుట్టగొడుగుల కంటే అధిక ప్రోటీన్, విటమిన్స్,ఖనిజాలను కలిగి ఉండటంతో దీనికి మంచి డిమాండ్ ఉంటుంది. హృద్రోగులు, మధుమేహం ఉన్నవారికి మంచిదని అంటారు.దీంట్లో ఉండే ప్రొటీన్స్ మధుమేహాన్ని నియంత్రిస్తుందని చెబుతున్నారు.