స్కిన్ మీద కరోనా వైరస్ 9 గంటలు బతికే ఉంటుంది

  • Edited By: sreehari , October 9, 2020 / 04:59 PM IST
స్కిన్ మీద కరోనా వైరస్ 9 గంటలు బతికే ఉంటుంది

Corona virus on Human skin: శరీరంమీద కరోనా వైరస్ ఎంతకాలం ఉంటుందో ఇప్పటిదాకా తెలియదు. అందుకే ముఖాన్ని టచ్ చేయొద్దని చెబుతున్నారు సైంటిస్ట్‌లు. కాకపోతే వంటిమీద పడ్డ వైరస్, తొమ్మదిగంటలు బతికే ఉంటుందన్న సమాచారం… కాస్త భయపట్టేదే. అంటే వ్యాధి సంక్రమించడానికి ఎక్కువ అవకాశమున్నట్లేకదా!

influenza A virusకూడా చర్మంమీద బతికేఉంటుంది. కాకపోతే రెండుగంటలే. అందుకే హ్యాండ్ శానిటైజర్ వాడటం, చేతులు కడుక్కోవడం వల్లే కరోనాను అడ్డుకోవచ్చనని అంటున్నారు సైంటిస్ట్ లు.

నోటి తుంపర్ల వల్ల, గాలో చేరిన  సూక్ష్మతుంపర్ల వల్లే కరోనా వైరస్ వ్యాపిస్తుందని తెలుసు. అలాగని వైరస్ చేరిన ఉపరితలాల వల్ల ఎంతగా కరనా వ్యాపిస్తుందో, పూర్తిగా తెలియదు.  ఈ స్టడీ ఫలితాలు  కొత్త సంగతులు బైటపెట్టాయి.మనం ఊహించినదానికన్నా, ఎక్కువగానే మన స్కిన్ మీద చేరిన వైరస్ పక్కవాళ్లకూ వ్యాపిస్తుందంట. జపాన్ సైంటిస్ట్‌ల పరిశోధన ప్రకారం, ఒంటిమీద పడ్డ వైరస్ 9 గంటలు బతికే ఉంటుంది. ఆ సమయంలో వేరే వాళ్లు వచ్చి తాకితే, వాళ్లకూ వ్యాపించే అవకాశముంటుంది. ఎంత మోతాదో మనకు తెలియదు.

ఇదే సమయంలో ఒక గుడ్ న్యూస్. 80శాతం ఆల్కహాల్ ఉన్న Hand sanitiser, disinfectant‌ను కనుక వాడితే 15 సెకండ్లలోనే వైరస్ నాశనమైపోతుంది. సబ్బువాడినా ఇదే ప్రభావం ఉంటుందని, కరోనా వైరస్‌ను కొన్ని సెకండ్లలోనే దెబ్బతీయగలదని రుజువైంది. దీన్ని బట్టి తెలిసేది ఒక్కటే. తరచు సబ్బుతో కడుక్కొంటే కరోనాను అడ్డుకోవచ్చు. మంచి హ్యాండ్ శానిటైజర్ వాడినా అంతే ప్రభావం.అసలు, ఎంత వైరస్ లోడు బాడీలో చేరితో మనకు కరోనా వస్తుందో ఇప్పటిదాకా తెలియదు. తక్కువ మోతాదుతో ప్రమాదంలేదన్నది ఒక అంచనా.

అలాగని గంటకు 12 సార్లు కనుక ముఖాన్ని తాకితే, వైరల్ లోడ్ ఎక్కువ అవుతుంది. దానివల్ల కరోనా వచ్చే అవకాశాలు పెరుగుతాయి. అంటే,  చేతికి అంటిన వైరస్ 5శాతం అనుకొందాం. మనం ఆ చేతితో ముఖాన్ని టచ్ చేశాం. బాడీలో ఈ వైరస్ వెళ్లిందనుకొందాం. దానివల్ల కరోనా రాకపోవచ్చు. కాకపోతే అదేపనిగా ఆ డర్టీ హ్యాండ్స్‌ను ముఖానికి తాకిస్తే, ఈ ఐదుశాతం వైరస్ కాస్త 50శాతానికి చేరొచ్చు. అంటే కరోనా వచ్చే అవకాశం బాగా పెరిగినట్లేగా!అలాగని ఒకరికి ఎలా, ఏ మార్గంలో, ఏ రూపంలో వైరస్ వచ్చిందో తేల్చిచెప్పడం అసాధ్యం. కాకపోతే ఈ స్టడీ వల్ల వైరస్ రాకనుంచి ఎలా తప్పించుకోవచ్చో అర్ధమవుతోంది. ఈ మూడు ఆయుధాలు  distancing, face masks, hand hygiene.