చైనా ‘CoronaVac’ గురించి మనకేం తెలుసు? మిగతా వ్యాక్సిన్లకు తేడా ఏంటి?

  • Published By: sreehari ,Published On : December 9, 2020 / 06:11 PM IST
చైనా ‘CoronaVac’ గురించి మనకేం తెలుసు? మిగతా వ్యాక్సిన్లకు తేడా ఏంటి?

China CoronaVac Covid-19 vaccine: కరోనాను అంతం చేసే వ్యాక్సిన్ల కోసం ప్రపంచ దేశాలన్నీ పోటీపడుతున్నాయి. వ్యాక్సిన్లు ఉత్పత్తిపై గ్లోబల్ రేసు కొనసాగుతోంది. కరోనా డ్రగ్ మేకర్లు పోటాపోటీగా కరోనా వ్యాక్సిన్లను ఉత్పత్తి చేస్తున్నాయి. ఏ కరోనా వ్యాక్సిన్ వచ్చినా ముందుగా ఆరోగ్య కార్యకర్తలు, వృద్ధులకే వ్యాక్సిన్ అందించాలని భావిస్తున్నాయి. మిగతా వ్యాక్సిన్ల మాదిరిగానే చైనా అభివృద్ధి చేసిన సినోవాక్ వ్యాక్సిన్ కూడా అదే దిశగా ప్రయత్నాల్లో నిమగ్నమైంది.



2021 జనవరికి 1.8 బిలియన్ల డోస్‌లు :
బీజింగ్ ఆధారిత బయోఫార్మాసిటికల్ కంపెనీ సినోవాక్ CoronaVac కరోనా వ్యాక్సిన్ అభివృద్ధి చేసింది. ఇప్పటికే ఈ చైనా వ్యాక్సిన్ ఇండోనేషియాకు చేరుకుంది. భారీమొత్తంలో వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తోంది. వచ్చే ఏడాది 2021 జనవరి నాటికి 1.8 మిలియన్ల డోస్‌లను సిద్ధం చేయనుంది. కానీ, చైనా సినోవాక్ వ్యాక్సిన్ తుది దశ ట్రయల్స్ ఇంకా పూర్తి కావాల్సి ఉంది. అయితే చైనా వ్యాక్సిన్ సినోవాక్ గురించి అసలు మనకేం తెలుసు? ఇతర కరోనా వ్యాక్సిన్లతో దీనికి తేడా ఏంటో తెలుసుకుందాం..



చైనా CoronaVac అనేది ఒక కరోనా వ్యాక్సిన్.. సినోవాక్ అనే కంపెనీ ఈ టీకా అభివృద్ధి చేసింది. ‘కరోనావాక్’ వైరస్ కణాలను చంపుతుంది.. శరీరంలోని వ్యాధినిరోధకతను వ్యవస్థను స్పందించేలా చేస్తుంది. ఫలితంగా వైరస్ నుంచి రక్షణ కల్పిస్తుంది. మోడెర్నా, ఫైజర్ వ్యాక్సిన్లు mRNA వ్యాక్సిన్లు… కరోనా వైరస్ జెనిటెక్ కోడ్ కలిగిన ఈ వ్యాక్సిన్లను శరీరంలోకి ఇంజెక్ట్ చేస్తారు. అప్పుడు శరీరంలో వైరల్ ప్రొటీన్లను తయారు చేస్తుంది.

కానీ, వైరస్ మొత్తానికి కాదు.. కేవలం రోగనిరోధక వ్యవస్థను వైరస్ పై పోరాడేందుకు ట్రైన్ చేస్తుంది అంతే.. గతంలో ర్యాబీస్ వ్యాక్సిన్లలో వాడిన పద్ధతినే CoronaVac వ్యాక్సిన్ లోనూ వాడారని అసిసోయేట్ ప్రొఫెసర్ లియో దాహాయ్ తెలిపారు. mRNA వ్యాక్సిన్లు అనేవి కొత్త రకం వ్యాక్సిన్లు.. ప్రస్తుతం ఈ వ్యాక్సిన్లు విజయవంతమైనట్టు ఎలాంటి ఉదాహరణలు లేవు..

CoronaVac ఎంత ప్రభావవంతం? :
ప్రస్తుత పరిస్థితుల్లో ఈ వ్యాక్సిన్ ప్రభావవంతం అనలేం.. దీనికి సంబంధించి తొలి, రెండో దశ ట్రయల్స్ వివరాలు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. తొలి దశలో 144 మంది వాలంటీర్లు పాల్గొనగా.. రెండో దశలో 600 మంది వాలంటీర్లు పాల్గొన్నారు. రెండింటి ఫలితాల ఆధారంగా పరిశీలిస్తే.. అత్యవసర వినియోగానికి సరిపోతుందని చెప్పవచ్చు. గత సెప్టెంబర్ నెలలో 1000 మంది వాలంటీర్లకు చైనా వ్యాక్సిన్ అందించారు. వారిలో 5 శాతం కంటే తక్కువగా స్వల్ప దుష్ర్పభావాలు కనిపించాయి.



ఏడాదిలో ఎన్ని డోస్‌లు ఉత్పత్తి చేయొచ్చు :
సినోవాక్ కంపెనీ… చైనా కరోనావాక్ డోస్‌లను ఏడాదిలో 300 మిలియన్ల డోస్ లను ఉత్పత్తి చేయగలదు.. ఇటీవలే 20వేల చదరపు మీటర్ల విస్తీర్ణంలో కొత్తగా వ్యాక్సిన్ ప్లాంట్ ను నిర్మించింది. ఇతర కరోనా వ్యాక్సిన్ల మాదిరిగానే చైనా కరోనావాక్ రెండు డోస్ లను ఇవ్వాల్సి ఉంటుంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఏడాదిలో 150 మిలియన్ల (చైనా పదోవంతు జనాభాలో) ప్రజలకు మాత్రమే సరిపోయేంత వ్యాక్సిన్ అందించగలదు. ఇదివరకే ఈ వ్యాక్సిన్ మోతాదులను ఇండోనేషియాకు డెలివరీ చేసింది చైనా.. అంతేకాదు.. సినోవాక్ కంపెనీ ఇతర దేశాలైన టర్కీ, బ్రెజిల్, చిలేతో పంపిణీకి డీల్స్ కుదుర్చుకుంది.



చైనాలో ఇతర కరోనా వ్యాక్సిన్లు సంగతేంటి? :
చైనాలో CoronaVac వ్యాక్సిన్ తర్వాత మరో చైనీస్ కరోనా వ్యాక్సిన్ Sinopharm.. ఇప్పటికే చైనాలో దాదాపు ఒక మిలియన్ మంది ప్రజలకు వ్యాక్సిన్ పంపిణీ చేశారు. అత్యవసరం వినియోగం కింద ఈ వ్యాక్సిన్ ప్రజలకు పంపిణీ చేయడం జరిగింది. మూడో దశల ట్రయల్స్ కు సంబంధించి ఫలితాలను Sinopharm ఇంకా డేటాను పబ్లీష్ చేయాల్సి ఉంది. మూడో దశ ట్రయల్స్ ఫలితాల కోసం ఎదురు చూస్తోంది. ఫలితాలకు ముందే ఎమర్జెన్సీ కోసం వినియోగంలోకి తేవడం వివాదాస్పదానికి దారితీసింది. చైనాలో చాలావరకు వైరస్ పరిస్థితులు ఉన్నప్పటికీ జనజీవనం నెమ్మదిగా ఇప్పుడప్పుడే సాధారణ స్థితికి చేరుకుంటోంది.