Overeating : అతిగా తినడం వల్ల కలిగే దుష్ప్రభావాల నుండి ఉపశమనం కోసం !

కడుపులో ఇబ్బందిగా ఉన్నప్పుడు మిరియాలతో తయారుచేసిన టీ తాగితే హాయిగా ఉంటుంది. ఇది జీర్ణవ్యవస్థనురిలాక్స్ చేస్తుంది. కాబట్టి కడుపు ఉబ్బినట్లు అనిపించదు. మిరియాలు, పుదీనా కలిసిన టీ జీర్ణవ్యవస్థకు చాలా మేలు చేస్తుంది.

Overeating : అతిగా తినడం వల్ల కలిగే దుష్ప్రభావాల నుండి ఉపశమనం కోసం !

overeating

Updated On : July 29, 2023 / 12:09 PM IST

Overeating : రుచి అని ఎక్కువ తినరాదు.. అనే విషయం తెలిసినప్పటికీ కొన్నిసార్లు జిహ్వచాపల్యాన్ని చంపుకోలేక అతిగా తినేస్తుంటాం. ముఖ్యగా ఏ పార్టీలు, ఫంక్షన్లకూ వెళ్లినప్పుడు దండిగా తినేస్తుంటాం. కానీ ఆ వెంటనే ఎందుకు ఇంత తిన్నాంరా… అని ఏడుపు ముఖం పెట్టే పరిస్థితి వస్తుంది. ఆయాసంతో కడుపు పట్టుకోవాల్సి వస్తుంది. ఇలాంటప్పుడు ఆ ఆయాసాన్ని, అసౌకర్యాన్ని తగ్గించే చిట్కాలివే…

READ ALSO : Viral Video: హాయిగా నవ్వుతూ బ్యాడ్మింటన్ ఆడిన లాలూ ప్రసాద్ యాదవ్

కునుకు వద్దు

చాలామందికి తిన్న వెంటనే ఓ కునుకు తీసే అలవాటు ఉంటుంది. కానీ ఇది అస్సలు మంచిది కాదు. అతిగా తిన్నప్పుడు మాత్రమే కాదు.. మామూలుగా తిన్నప్పుడు కూడా తిన్న వెంటనే పడుకోకూడదు.ఇది యాసిడ్ రిఫ్లక్స్, జీర్ణక్రియ ఆటంకాలకు కారణమవుతుంది. తిన్న తర్వాత నేరుగా నిద్రపోవడం వల్ల మీ శరీరానికి ఆ కేలరీలు బర్న్ అయ్యే అవకాశం ఉండదు, బరువు పెరగటానికి దారితీస్తుంది. కాబట్టి అతిగా తిన్నప్పుడు మీ ఆహారం మీ కడుపులో స్థిరపడే వరకు నిటారుగా ఉండండి. అసలు మంచంలో ఒరగడం, కుర్చీలో కూర్చోవడం కూడా చేయొద్దు. కాసేపు అటూ ఇటూ తిరగాలి. లేకపోతే కడుపులో కొవ్వు పెరిగిపోతుంది. ఇక అతిగా తిన్నప్పుడు ఇలాంటి పనులు చేస్తే మరింత నష్టం.

READ ALSO : Hypothyroidism : థైరాయిడ్ తగ్గితే జుట్టు పెరుగుతుందా?

వాము

అన్ని రకాల కడుపు సమస్యలకు ఏకైక పరిష్కారం ఏదైనా ఉందంటే, అది వాము. వాము నమలడం వల్ల కడుపులో అసౌకర్యం లేదా నొప్పి, గ్యాస్, వాంతులు, అజీర్ణం, అసిడిటీ వంటి ఇతర సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది. వాములో పీచుపదార్థాలుంటాయి. అంతే కాకుండా లాక్జేటివ్లక్షణాలుంటాయి. అజీర్తి నుంచి కూడా వాము కాపాడుతుంది. ఇలాంటప్పుడుకొద్దిగా వాము, నల్ల ఉప్పు, అల్లం కలిపి చూర్ణం చేసి, భోజనం తర్వాత తినండి.

READ ALSO : Ginger Cultivation : ఎత్తుమడుల విధానంలో అల్లం సాగు

మిరియాల టీ

కడుపులో ఇబ్బందిగా ఉన్నప్పుడు మిరియాలతో తయారుచేసిన టీ తాగితే హాయిగా ఉంటుంది. ఇది జీర్ణవ్యవస్థనురిలాక్స్ చేస్తుంది. కాబట్టి కడుపు ఉబ్బినట్లు అనిపించదు. మిరియాలు, పుదీనా కలిసిన టీ జీర్ణవ్యవస్థకు చాలా మేలు చేస్తుంది. ఇది కడుపు కండరాలనురిలాక్స్ చేసే అనేక యాంటీ బాక్టీరియల్, క్రిమినాశక లక్షణాలనుకలిగివుంటుంది.  అంతేకాకుండా అతిగా తినడం వల్ల కలిగే మలబద్ధకం, విరేచనాలు ఇతర కడుపు సంబంధిత సమస్యల నుంచి బయటపడటానికి మిరియాల టీ సహాయపడుతుంది.

READ ALSO : Manipur Violence: మణిపూర్ హింస వెనుక విదేశీ శక్తులు .. ఆర్మీ మాజీ చీఫ్ జనరల్ కీలక వ్యాఖ్యలు

పెరుగు

కడుపులో పట్టనంతగా నిండుగా తిన్నప్పటికీ, ఆపైన కొంచెం పెరుగు తినడం ద్వారా మేలు కలుగుతుంది. పెరుగు లో ప్రోబయాటిక్స్ ఉంటాయి. ఇవి జీర్ణ ప్రక్రియకు సహాయపడే, మనకు మేలు చేసే బాక్టీరియా. కాబట్టి, ఎప్పుడైనా ఆహారం పెద్ద మొత్తంలో తిన్న తర్వాత పెరుగు తప్పకుండా తీసుకోండి. భోజనం తరువాత పెరుగు తినడం వల్ల కడుపుబ్బరం, కడుపు నొప్పి లాంటి పొట్ట బాధలు రాకుండా ఉంటాయి. అయితే పెరుగు పుల్లగా ఉండకుండా చూసుకోవాలి.

READ ALSO : Military Helicopter Crash : కుప్పకూలిన ఆస్ట్రేలియన్ మిలటరీ హెలికాప్టర్…నలుగురి గల్లంతు

పాలు

అతిగా తినడం కొన్నిసార్లు అసిడిటీకి దారి తీస్తుంది. ఇలాంటి సందర్భంలో చల్లటి పాలు తాగడం వల్ల మేలు కలుగుతుంది. పాలలోని కాల్షియం, కడుపులోని హైడ్రోక్లోరిక్ ఆమ్లాల అదనపు స్రావాన్ని నియంత్రిస్తుంది. కడుపులోని ఆమ్లాలు తగ్గడం వల్ల చల్లని పాలు అసిడిటీకి సరైన విరుగుడు. చల్లని పాలు కడుపులో మంట నుండి తక్షణ ఉపశమనాన్ని అందిస్తాయి.

READ ALSO : Tech Tips in Telugu : వాట్సాప్‌లో షార్ట్ వీడియో మెసేజ్‌లను ఎలా పంపాలి? రికార్డు చేయడం తెలుసా? ఇదిగో సింపుల్ ప్రాసెస్..!

నడవండి 

నడక జీర్ణక్రియను ఉత్తేజపరిచేందుకు, రక్తంలో చక్కెర స్థాయిలను బ్యాలెన్స్ చేయడానికి సహాయపడుతుంది. కాబట్టి అతిగా భోజనం చేసిన తర్వాత మంచం మీద పడుకునే బదులు, కాస్త నడవండి, తేలికగా అనిపిస్తుంది. కేవలం 15 నిమిషాలు చిన్న నడకకు వెళ్లిరండి, మీరు మంచి అనుభూతి చెందుతారు. అయితే తిన్నవెంటనే పరుగు, జాగింగ్ లేదా వ్యాయామానికి దూరంగా ఉండండి.

అప్పుడప్పుడు అతిగా తినడం వల్ల మీ శరీరంపై ఎటువంటి దుష్ప్రభావాలు ఉండవు కానీ, తరచుగా అతిగా తినడం చేస్తే మాత్రం, అది మీరు బరువు పెరగటానికి, కొలెస్ట్రాల్ పెరగటానికి దారితీస్తుంది, జీర్ణక్రియ సమస్యలు వస్తాయి, రక్తంలో చక్కెర స్థాయిలను కూడా ప్రభావితం చేస్తుంది.