Tech Tips in Telugu : వాట్సాప్‌లో షార్ట్ వీడియో మెసేజ్‌లను ఎలా పంపాలి? రికార్డు చేయడం తెలుసా? ఇదిగో సింపుల్ ప్రాసెస్..!

Tech Tips in Telugu : వాట్సాప్‌లో వీడియో మెసేజ్‌లను పంపుతోంది. ఇప్పుడు యూజర్లను 60-సెకన్ల వీడియో మెసేజ్‌లను క్రియేట్ చేయడంతో పాటు పంపడానికి అనుమతిస్తుంది.

Tech Tips in Telugu : వాట్సాప్‌లో షార్ట్ వీడియో మెసేజ్‌లను ఎలా పంపాలి? రికార్డు చేయడం తెలుసా? ఇదిగో సింపుల్ ప్రాసెస్..!

Tech Tips in Telugu _ How to record and send short video messages on WhatsApp

Tech Tips in Telugu : ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ (Whatsapp) కమ్యూనికేట్ చేయడంలో సాయపడేందుకు మార్క్ జుకర్‌బర్గ్ కొత్త వాట్సాప్ ఫీచర్‌ను ప్రకటించారు. కొత్తగా షార్ట్ వీడియో మెసేజ్ ఫీచర్‌ను ప్రవేశపెట్టారు. వాట్సాప్ చాట్‌లో నేరుగా షార్ట్, పర్సనల్ వీడియోలను రికార్డ్ చేయడమే కాదు.. షేర్ చేయడానికి వీలు కల్పిస్తుందని మెటా సీఈఓ వెల్లడించారు. వాట్సాప్‌లోని వీడియో మెసేజ్ ఫీచర్ యూజర్లందరికి రిలీజ్ చేయనుంది. ఫ్యూచర్ యాప్ అప్‌డేట్‌లతో రాబోయే వారాల్లో ఈ కొత్త ఫీచర్ అందరికీ అందుబాటులో ఉంటుందని కంపెనీ పేర్కొంది.

Read Also : Airtel Jio 5G Services : దేశంలో 8వేలకు పైగా నగరాల్లో ఎయిర్‌టెల్, జియో 5G సర్వీసులు.. 5G యాక్టివేట్ చేసుకోవడం ఎలా? ఏయే ప్లాన్లు ఉన్నాయంటే?

వీడియో మెసేజ్‌లను యూజర్లు 60 సెకన్లలో చాట్‌లకు క్రియేట్ చేసుకోవచ్చు. స్నాప్‌చాట్ (Snapchat) మాదిరిగానే.. వాట్సాప్ ప్లాట్‌ఫారమ్‌లోని సాంప్రదాయ వీడియో ఫీచర్‌తో పోలిస్తే.. వీడియోలు స్పీట్‌గా చాట్ చేసేందుకు మరింత అనుకూలంగా ఉంటాయి. ఎవరైనా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపినా, జోక్‌లో నవ్వినా లేదా శుభవార్త అందించినా వీడియో నుంచి వచ్చే అన్ని భావోద్వేగాలనుషేర్ చేయడానికి ఆహ్లాదకరమైన మార్గమని పోస్ట్‌లో పేర్కొన్నారు.

వాట్సాప్ వీడియో మెసేజ్‌లను ఎలా పంపాలంటే? :
* వాట్సాప్ ఓపెన్ చేసి వీడియో మెసేజ్ పంపాలనుకునే వ్యక్తితో చాట్ చేయొచ్చు.
* టెక్స్ట్ ఫీల్డ్ పక్కన ఉన్న మైక్రోఫోన్ ఐకాన్ నొక్కండి.
* మైక్రోఫోన్ ఐకాన్ వీడియో కెమెరా ఐకాన్‌గా మారుతుంది.
* మీ వీడియో మెసేజ్ రికార్డ్ చేయడం ప్రారంభించడానికి వీడియో కెమెరా ఐకాన్‌పై నొక్కండి.
* మీ వీడియో మెసేజ్ రికార్డ్ చేయడానికి బటన్‌ను నొక్కి పట్టుకోండి.
* మీరు రికార్డింగ్‌ను లాక్ చేసేందుకు మీ చేతులను ఫ్రీగా ఉంచడానికి పైకి స్వైప్ చేయవచ్చు.
* రికార్డింగ్ ఆపడానికి, బటన్‌ను రిలీజ్ చేయండి లేదా కిందికి స్వైప్ చేయండి.
* మీ వీడియో మెసేజ్ రీసివర్‌కు పంపుతుంది.
* చాట్‌లో ఓపెన్ చేసిన వీడియో మెసేజ్‌లు మ్యూట్‌లో ఆటోమాటిక్‌గా ప్లే అవుతాయి.
* Sound ప్రారంభించేందుకు వీడియోపై నొక్కండి.

Tech Tips in Telugu _ How to record and send short video messages on WhatsApp

Tech Tips in Telugu _ How to record and send short video messages on WhatsApp

ముఖ్యంగా, వీడియో మెసేజ్ గరిష్ట నిడివి ఒక నిమిషం వరకు ఉంటుంది. అదనంగా, వాట్సాప్ నోట్స్ వీడియో మెసేజ్ ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్‌తో పంపవచ్చు. తద్వారా యూజర్ల మెసేజ్‌లు సురక్షితంగా ఉంటాయి. వాట్సాప్ ఇటీవల ఐఫోన్ యూజర్ల కోసం కొత్త అప్‌డేట్స్ రిలీజ్ చేసింది. iOS యాప్ వెర్షన్ 23.14.79. ప్లాట్‌ఫారమ్ ట్రాన్స్‌ఫర్ చాట్, ల్యాండ్‌స్కేప్ మోడ్‌లో వీడియో కాల్, GIF, అవతార్ ట్రేలో మార్పులు వంటి అనేక ఫీచర్లను ప్రవేశపెట్టింది. ఈ ఫీచర్లను ప్లాట్‌ఫారమ్‌ ద్వారా మరింత మెరుగుపర్చనుంది. ట్రాన్స్‌ఫర్ చాట్ ఫీచర్ ప్రత్యేకంగా ఉంటుంది.

కొత్త ట్రాన్స్‌ఫర్ ఫీచర్‌తో వాట్సాప్ ఇప్పుడు iOS యూజర్లు చాట్ హిస్టరీని, మెసేజ్‌లు, మీడియా, సెట్టింగ్‌లతో సహా పాత ఐఫోన్ నుంచి కొత్తదానికి లోకల్ ట్రాన్స్‌ఫర్ చేయడానికి అనుమతిస్తుంది. ఈ అప్‌డేట్ యూజర్లు తమ వాట్సాప్ చాట్ హిస్టరీని ట్రాన్స్‌ఫర్ చేయడానికి iCloud లేదా లోకల్ బ్యాకప్‌పై ఆధారపడాల్సిన అవసరాన్ని తొలగిస్తుంది. iOS 15 తర్వాతి వెర్షన్‌లలో వాట్సాప్ యూజర్లందరికి ఈ ఫీచర్ అందుబాటులో ఉంది.

Read Also : Disney Plus Hotstar Limit : నెట్‌ఫ్లిక్స్ బాటలో డిస్నీ ప్లస్ హాట్‌స్టార్.. ఈ కొత్త పాలసీతో యూజర్ల అకౌంట్ షేరింగ్‌పై లిమిట్..!