అప్పుడప్పుడు ఫాస్టింగ్ చేస్తున్నారా? ఆరోగ్యంలో ఈ మార్పులు గమనించారా?

  • Published By: sreehari ,Published On : October 4, 2020 / 11:46 AM IST
అప్పుడప్పుడు ఫాస్టింగ్ చేస్తున్నారా? ఆరోగ్యంలో ఈ మార్పులు గమనించారా?

Intermittent Fasting : ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు పెద్దలు.. ఆహారం విషయంలో జాగ్రత్తలు పాటిస్తేనే ఆరోగ్యకరమైన జీవితాన్ని కలిగి ఉంటామని చెబుతున్నారు నిపుణులు.. ప్రస్తుత మహమ్మారి కాలంలో ప్రతిఒక్కరూ తమ ఆరోగ్యంపైనే ఎక్కువగా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. డైటింగ్.. ఫాస్టింగ్.. వ్యాయామాలు అంటూ పరుగులు పెడుతున్నారు.. డైట్ ఫుడ్ తినేందుకు ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు.



వాస్తవానికి తినే ఆహారం ద్వారానే ఆరోగ్యం ఆధారపడి ఉంటుందని చెబుతున్నారు పోషక నిపుణులు.. అవసరమైనప్పుడు బరువు తగ్గడం.. కావాలనుకున్నప్పుడు బరువు పెరగడం డైటింగ్ మాయే.. ఇప్పుడు సెలబ్రిటీలంతా ఇదే డైట్ ఫాలో అవుతున్నారు.. అదే.. అడపాదడపా ఫాస్టింగ్ (intermittent fasting) ఉపవాసం.. ఈ ఆహార ప్రణాళికకు 2019లో గూగుల్ డైట్ ప్లాన్ టాప్‌ ర్యాంకులో నిలిచింది.

టైం రిస్ట్రిక్టిడ్ ఈటింగ్.. సమయం నిరోధిత ఆహారంగా చెప్పవచ్చు.. ఆహారం తినే విషయంలో ఏమి తినాలనే దాని కంటే ఎప్పుడు తినాలనే దానిపైనే ఆధారపడి ఉంటుంది. ఈ డైటింగ్ తక్కువ దుష్ప్రభావాలున్న డైట్ గా చెప్పారు. జీవక్రియ పనితీరును మెరుగుపరుస్తుందని, కొన్ని రకాల వ్యాధుల నుంచి సురక్షితంగా ఉంచుతుందని చెబుతున్నాయి. అంతేకాదు.. జీవితకాలాన్ని పొడిగించడంలో కూడా ఈ డైట్ అద్భుతంగా పనిచేస్తుందని అంటున్నారు.



కానీ ఇప్పుడు, JAMA Internal Medicine ప్రచురించిన ఒక కొత్త అధ్యయనం ప్రకారం.. ఈ డైట్.. ప్రస్తుత numero uno స్థానాన్ని మార్చేసింది. ఇటీవలే జరిగిన randomised clinical trial సమయంలో 116 మంది వ్యక్తులను 3 నెలల పాటు ట్రాక్ చేశారు. అప్పుడప్పుడు ఫాస్టింగ్ చేయమన్నారు. ఈ అధ్యయనంలో పరీక్షించిన వ్యక్తుల్లో ఊబకాయం, అధిక బరువుగా వర్గీకరించారు. వారిని రెండు గ్రూపులుగా విభజించారు. అందులో ఒకటి అడపాదడపా ఫాస్టింగ్ పాటించగా, మరొకరు రోజుకు మూడుసార్లు భోజనం తినమన్నారు.



time-restricted eating డైట్ ఫాలో అయ్యే వ్యక్తులు రోజుకు మూడుసార్లు భోజనం తినడం కంటే ఎక్కువ బరువు కోల్పోతారని పరిశోధకులు అంచనా వేశారు. కానీ ఫలితాలతో పోల్చినప్పుడు, సమయ పరిమితితో తినడం వల్ల గణనీయమైన బరువు తగ్గడం లేదని గుర్తించారు. రెండు గ్రూపుల మధ్య కొవ్వు ఇన్సులిన్, ఉపవాస ద్రవ్యరాశి, రక్తంలో చక్కెర లేదా (blood lipids) తేడాలు లేవని కూడా గుర్తించారు.



ఫాస్టింగ్ గ్రూపులో పాల్గొనేవారు సుమారు మూడున్నర పౌండ్లను కోల్పోయారు. కానీ వారు కోల్పోయింది కొవ్వు కాదని తేలింది. కండరాలతో సహా సన్నని ద్రవ్యరాశిగా గుర్తించారు. సాధారణంగా, కోల్పోయే బరువులో 20 నుండి 30 శాతం లీన్ మాస్ (lean mass) ఉంటుంది.. ఈ అధ్యయనంలో ఇది 65 శాతంగా రికార్డు అయినట్టు పరిశోధకులు గుర్తించారు.

ఫలితాలు ఎవరూ ఊహించని విధంగా వచ్చాయి. పరిశోధకులతో పాటు వీరిలో ఒకరు ఏడేళ్లు ఇదే డైట్ మీద ఉన్నారు. రోజుకు మూడుసార్లు భోజనం తినడం కంటే బరువు తగ్గేందుకు టైమ్ లిమిట్ చేసిన ఆహారమే వర్కౌట్ అయిందని కనుగొన్నారు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. ఇందులో ఒక దుష్ప్రభావం ఎక్కువగా కనిపించింది.



కండరాలను కోల్పోయారు.. సన్నగా పీలగా తయారయ్యారంతా.. ఎలా ఉన్నా, టైం లిమిట్ తినటం ద్వారా బరువు కోల్పోతారు.. ఫలితంగా (సగటున 12 వారాలు.. వారానికి 2 పౌండ్లు) చొప్పున కోల్పోతారని కాలిఫోర్నియా యూనివర్శిటీలో కార్డియాలజిస్ట్ Ethan Weiss చెప్పారు ఈ డైటింగ్ ప్రక్రియ ద్వారా జీవక్రియ ప్రయోజనాన్ని పొందలేరు.. పైగా కండరాలను (మజిల్స్) కోల్పోవాల్సి వస్తుందని తెలిపారు.