షాంపులు అక్కర్లేదు: మూత్రంతో ‘డ్యాండ్రఫ్’ కు చెక్

తలపై చుండ్రు (డ్యాండ్రఫ్)తో బాధపడుతున్నారా? మార్కెట్లో దొరికే ఎన్నో శాంపులు వాడి వాడి విసిగిపోయారా? వైద్యులను కలిసి ఎన్ని మందులు వాడినా ఫలితం లేదా? అయితే ఈ రిమెడీ పాటించి చూడండి.

  • Published By: sreehari ,Published On : January 26, 2019 / 12:51 PM IST
షాంపులు అక్కర్లేదు: మూత్రంతో ‘డ్యాండ్రఫ్’ కు చెక్

తలపై చుండ్రు (డ్యాండ్రఫ్)తో బాధపడుతున్నారా? మార్కెట్లో దొరికే ఎన్నో శాంపులు వాడి వాడి విసిగిపోయారా? వైద్యులను కలిసి ఎన్ని మందులు వాడినా ఫలితం లేదా? అయితే ఈ రిమెడీ పాటించి చూడండి.

తలపై చుండ్రు (డ్యాండ్రఫ్)తో బాధపడుతున్నారా? మార్కెట్లో దొరికే ఎన్నో షాంపులు వాడి వాడి విసిగిపోయారా? వైద్యులను కలిసి ఎన్ని మందులు వాడినా ఫలితం లేదా? లెమన్ జ్యూస్, పెరుగు మసాజ్ లంటూ ఎన్ని రిమెడీలు చేసిన తలపై తిష్టవేసుకున్న డ్యాండ్రఫ్ ను తరిమికొట్టలేకపోయారా? దిగులు చెందకండి. ప్రతి సమస్యకు ఒక పరిష్కారం ఉంటుంది. మీ చుండ్రుకు కూడా ఓ చక్కని పరిష్కారం ఉంది. చుండ్రును మటుమాయం చేసే ఆ దివ్యమైన అద్భుత ఔషధం మీ చెంతనే ఉంది. ఈ రిమెడీ పాటిస్తే చాలు.. చిటికెలో తలపై డ్యాండ్రఫ్ ఇట్టే మాయమైపోతుంది. ఇంతకీ అదేంటో చెప్పలేదు కదూ. యూరిన్ (మనిషి మూత్రం) మీరు విన్నది నిజమే. అబ్బే.. ఛీ.. పాడు.. మూత్రమా? అని తీసేయకండి. మీ యూరిన్ నే మీ తలపై చుండ్రుపై అద్భుతంగా పనిచేస్తుంది. ఒకసారి ఈ రిమెడీ పాటించి చూడండి.. ఫలితం చూస్తే మీరే షాక్ అవుతారు. 

ఇలా చేయండి.. క్షణాల్లో చుండ్రు మాయం
మీరు చేయాల్సిందిల్లా.. వింటర్ లో చుండ్రు సమస్య మరింత దారుణంగా ఉంటుంది. అందుకే ఉదయం లేవగానే మీ మూత్రాన్ని పట్టండి. అంతే.. ఆ మూత్రాన్ని తలపై వెంట్రకుల కుదళ్ల వరకు అప్లై చేయండి. కాసేపటి తరువాత ఏదైనా సబ్బుతో కడిగేయండి. క్షణాల్లో చుండ్రు పారిపోతుంది. మాటలు కాదు.. చేతల్లో రుజువైంది కూడా. న్యూజిలాండ్ కు చెందిన మిరియం ల్యాన్స్ ఉడ్ అనే మాజీ స్పోర్ట్స్ టీచర్ చేసిన రియల్ రిమెడీనే ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ. ఎన్నో ఏళ్లుగా డ్యాండ్రఫ్ తో బాధపడిన మిరియం.. నగర వాతావరణంపై విరక్తి పుట్టి 2010లో తన భర్త పీటర్ తో కలిసి అడువుల్లోకి వెళ్లిపోయింది. 

షాంపులు వద్దు.. మూత్రమే ముద్దు
అక్కడే కొన్నాళ్లుగా జీవనం సాగిస్తోంది. 9ఏళ్ల క్రితం నగరాన్ని వదిలి అడవుల్లోకి వెళ్లిన మిరియం.. తన భర్తతో కలిసి సౌకర్యవంతమైన జీవనాన్ని సాగిస్తోంది. తనను ఎంతగానో బాధిస్తున్న చుండ్రు సమస్యను సులభంగా పొగట్టుకుంది. షాంపులు వాడలేదు. అడవిలో దొరికే ఎలాంటి వన మూళికలు వాడలేదు. ఆమె చేసిందిల్లా ఒకటే.. ఉదయాన్నే లేవగానే పోసిన మూత్రాన్ని ఓ డబ్బాలో పోసింది. ఆ మూత్రాన్ని తలపై జుట్టుకు అప్లై చేసింది. వాసన వచ్చేంత వరకు అలానే ఉంచి.. తరువాత సబ్బుతో కడిగేది. ఇలా కొన్నిరోజుల పాటు చేస్తూ వచ్చింది. అంతే.. మూత్రం దెబ్బకు డ్యాండ్రఫ్ పారిపోయింది. ఇదే విషయాన్ని ఇటీవల మిరియం ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ అద్భుతమైన రెమిడీని రివీల్ చేసింది. 

బొగ్గు, బూడిదతో పళ్లు తోముకుంటా..
ఈ ట్రిక్కును తన భర్త పీటర్ చెప్పినట్టు తెలిపింది. నార్త్ ఎస్కిమోస్ అనే జాతీయులు డ్యాండ్రఫ్ పోయేందుకు ఎక్కువగా ఉదయాన్నే పోసిన మూత్రంతో ఈ చిట్కాను పాటించేవారిని పీటర్ చెప్పినట్టు తెలిపింది. అంతేకాదు.. ఉదయాన్నే లేవగానే బొగ్గు, బూడిదతో పళ్లు తోముకుంటానని చెప్పుకొచ్చింది. ఇంకెందుకు ఆలస్యం.. డ్యాండ్రఫ్ పోయేందుకు వేలు పోసి మందులు కొనే బదులు మీరు కూడా ఇలా ప్రయత్నించి చూడండి..