Constipation : మలబద్ధకం సమస్య ఎందుకొస్తుంది? అనేక రోగాలకు మలబ్ధకమే కారణమా?

రోజూ సక్రమంగా కడుపులోంచి మలం వెళ్ళకుండా ఆగిపోయినప్పుడు కీళ్ళ వాపునీ, నొప్పినీ కల్గిస్తాయి. కడుపులో వాతం పెచ్చుమీరడం వలన ఈ స్థితి వస్తుంది. విరేచనం ఫ్రీగా కాకపోవడానికీ, తలనొప్పికీ చాలా దగ్గర సంబంధం ఉంది.

Constipation : మలబద్ధకం సమస్య ఎందుకొస్తుంది? అనేక రోగాలకు మలబ్ధకమే కారణమా?

constipation

Updated On : August 20, 2022 / 3:13 PM IST

Constipation : ఆరోగ్యకరమైన ఆహారాన్ని తినకపోవటం, ఉరుకులు పరుగుల జీవితంలో సరైన జీవనశైలి లేకపోవడం వల్ల మలబద్ధకం సమస్య పెరుగుతుంది. ప్రతిరోజూ వేళ ప్రకారం సరిగ్గా విరేచనం కాకుండా ఉంటే వారు మలబద్ధకం సమస్యతో బాధపడుతున్నారని అర్ధం చేసుకోవాలి. తీసుకున్న ఆహారం తిన్నట్టుగా అరిగిపోతే ఎలాంటి మలబద్ధక సమస్యలు ఉత్పన్నం కావు. కొందరికి విరేచనం వచ్చినట్టే అన్పిస్తుంది. కానీ ఎంతో ప్రయత్నిస్తే తప్ప బైటకు రాదు. టాయిలేట్ కోసం ఎదురుచూస్తూ కాఫీలు తాగటం, చుట్ట, బీడి, సిగరెట్లు తాగటం, పేపరు చదవడం వంటివి చేస్తుంటారు. గంటల తరబడి మోకాళ్ళు నొప్పులు పుట్టేంతవరకూ టాయిలెట్లోనే గడిపాల్సి వస్తుంది.

రోగాలకు దారితీసే మలబద్ధకం ;

మలబద్ధత అనేది ఇరిటబుల్ బవుల్ సిండ్రోమ్ వ్యాధికి దారితీస్తుంది. ఒక్కోసారి విరోచనం అవకపోవటం, ఇంకోసారి పల్చగా నీళ్ళలాగా అవటం జరుగుతుంది. ఇది వాతం వలన వచ్చే వ్యాధి. విరేచనం సరిగా అవక బలవంతంగా ముక్కవలసి రావడం, లోపల ఏదో బంధించినట్లు అతికష్టంమీద విరేచనం అవడం, ఇంకా లోపల చాలా విరేచనం మిగిలిపోయినట్టే అన్పించటం బాగా వత్తిడినిస్తే జిగురుగానీ, రక్తంగానీ పడటం జరుగుతుంటే మొలల వ్యాధి బారిన పడినట్లు అర్ధం చేసుకోవాలి.

పేగు చివరి భాగాన మలాశయం ఉంటుంది. దీనిని రెక్టమ్ అంటారు. విరేచనం కోసం అతిగా ముక్కడం వలన పేగులోపల వత్తిడి పెరిగి, ఏకంగా పేగు చివరి భాగమైన ఈ రెక్టమ్ విరేచన మార్గంలోంచి బైటకు జారి వస్తుంది. అలాగే మలబద్ధతకి గ్యాస్ ట్రబుల్ కి అవినాభావ సంబంధం ఉంది. రెండూ ఒకదాన్ని ఒకటి పెంచుతుంటాయి. గ్యాస్ ట్రబుల్ని తగ్గించేందుకు వాడే మందులు ఒక్కోసారి మలబద్ధతని కల్గిస్తుంటాయి

రోజూ సక్రమంగా కడుపులోంచి మలం వెళ్ళకుండా ఆగిపోయినప్పుడు కీళ్ళ వాపు, నొప్పి సమస్య తలెత్తుతుంది. కడుపులో వాతం పెచ్చుమీరడం వలన ఈపరిస్ధితి వస్తుంది. విరేచనం ఫ్రీగా కాకపోవడానికీ, తలనొప్పికీ చాలా దగ్గర సంబంధం ఉంది. కడుపు ఉబ్బరం, మంట, గ్యాస్ ఇలాంటివి లేకుండా చక్కగా జీర్ణశక్తి నడుస్తూంటే తలనొప్పి సమస్య రాదు. మలబద్ధకం వల్ల పేగులు ఉత్సాహంగా పనిచేయక జీర్ణశక్తి మందగించి నాలికపైన జిగురుపేరుకొని తెల్లగా మారుతుంది. నోటికి ఏదీ రుచి తెలియదు. ఆహారం తీసుకోబుద్ధికాదు. ఒకవేళ బలవంతంగా తిన్నా ఎగశ్వాస రావటం, సుఖంగా లేకపోవటం, కడుపు ఉబ్బరం, గొంతులో మంట వంటి లక్షణాలు కనిపిస్తాయి.