Lose Belly Fat : పొట్ట వద్ద కొవ్వు కరగాలంటే ఎలాంటి ఆహారం తీసుకోవాలి?

వంటల్లో ఇతర నూనెలకు బదులుగా కొబ్బరి నూనె వాడడం మంచిది. ఎందుకంటే అది మన శరీరంలో చేరిన కొలెస్ట్రాల్‌ని కొవ్వుగా రూపాంతరం చెందకుండా శక్తిగా మార్చుతుంది. తద్వారా పొట్ట చుట్టూ కొవ్వు పేరుకుపోకుండా జాగ్రత్తపడచ్చు.

Lose Belly Fat : పొట్ట వద్ద కొవ్వు కరగాలంటే ఎలాంటి ఆహారం తీసుకోవాలి?

belly fat

Lose Belly Fat :పొట్టచుట్టూ కొవ్వులు పేరుకు పోవటం పట్ల చాలా మంది ఆందోళన చెందుతుంటారు. అయితే బొడ్డు కొవ్వును కరిగించడానికి కొన్ని ఉత్తమ ఆహారాలు తోడ్పడతాయి. 
వాటి వల్ల జీవక్రియను పెంచుకోవచ్చు. ఆకలితో పోరాడటానికి ప్రతి భోజనంలో ప్రోటీన్, ఫైబర్ మరియు ఆరోగ్యకరమైన కొవ్వులను అందించాల్సి ఉంది. అదే సమయంలో
అదనపు చక్కెరలు, శుద్ధి చేసిన కార్బోహైడ్రేట్లు పొట్టకొవ్వును, బరువు పెరగటానికి దారితీస్తాయి. పొట్ట దగ్గరి కొవ్వు కరగాలంటే, రిఫైన్డ్‌ కార్బ్స్‌ తినడం మానేయాలి. 
వీటిని తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు వేగంగా పెరగడంతో పాటు, శరీరంలో ఇన్‌ఫ్లమేషన్‌ కూడా పెరుగుతుంది. కొన్ని రకాల ఆహారాలు పొట్ట దగ్గరిని కొవ్వును 
తగ్గించటంలో తోడ్పడతాయి. వాటి గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

పొట్ట చుట్టూ కొవ్వును కరిగించేందుకు తోడ్పడే ఆహారాలు ;

గుడ్లు B విటమిన్ కోలిన్ యొక్క ఏకైక ఉత్తమ ఆహార వనరు, ఇది శరీరంలోని అన్ని కణాల నిర్మాణంలో ఉపయోగించే ముఖ్యమైన పోషకం. రోజుకు రెండు గుడ్లు తీసుకుంటే సరిపోతుంది. కోలిన్ లోపం నేరుగా విసెరల్ కొవ్వు పేరుకుపోవడానికి కారణమయ్యే జన్యువులతో ముడిపడి ఉంటుంది, ముఖ్యంగా కాలేయంలో. అధికంగా మద్యపానం చేసేవారిలో కాలేయం కొవ్వును ఉత్పత్తిచేస్తుంది. ఆల్కహాల్ కోలిన్‌ను ప్రాసెస్ చేసే శరీర సామర్థ్యాన్ని తగ్గిస్తుంది.

ఆకలిగా అనిపించినప్పుడు ఏ స్నాక్సో, బిస్కట్లో తీసుకోవడం కాకుండా పీచు ఎక్కువగా ఉండే నట్స్‌, గింజలు, బార్లీ, పండ్లు ,బెర్రీస్‌, కమలాఫలం, పుచ్చకాయ వంటివి, కాయగూరలు బ్రకలీ, క్యారట్‌, స్వీట్‌కార్న్ మొదలైనవి, దుంపలు వంటివి తీసుకోవడం మంచిది. తద్వారా ప్రాసెస్డ్‌ ఫుడ్‌పై మనసు మళ్లకుండా పొట్ట చుట్టూ కొవ్వు పేరుకుపోకుండా జాగ్రత్తపడచ్చు. అలాగే వీటిలో ఉండే అధిక పీచు జీర్ణ వ్యవస్థకు కూడా మంచిది.

బజార్లో మనకు వైట్‌ బ్రెడ్‌తో పాటు, ఎన్‌రిచ్‌డ్‌ బ్రెడ్స్‌ కూడా దొరుకుతున్నాయి. ఇవన్నీ రిఫైనింగ్‌ ప్రాసె్‌సను ముగించుకున్న తర్వాతే మార్కెట్లోకి అడుగు పెడతాయి.ఈ రిఫైనింగ్‌ ప్రక్రియలో భాగంగా వీటి నుంచి ప్రయోజనకరమైన పీచు, పోషకాలను తొలగించి, సింథటిక్‌ రూపంలోని పోషకాలను జోడించడం జరుగుతుంది. కాబట్టి బ్రెడ్‌ను కొనే సమయంలో, ప్యాకెట్ల మీద ఎన్‌రిచ్‌డ్‌ అనే పదం కోసం వెతికి, ఆ కోవకు చెందిన బ్రెడ్స్‌ను కొనడం మానుకోండి. వీటికి బదులుగా హోల్‌ వీట్‌ లేదా హోల్‌ గ్రెయిన్‌ బ్రెడ్స్‌ను ఎంచుకోండి.

వంటల్లో ఇతర నూనెలకు బదులుగా కొబ్బరి నూనె వాడడం మంచిది. ఎందుకంటే అది మన శరీరంలో చేరిన కొలెస్ట్రాల్‌ని కొవ్వుగా రూపాంతరం చెందకుండా శక్తిగా మార్చుతుంది. తద్వారా పొట్ట చుట్టూ కొవ్వు పేరుకుపోకుండా జాగ్రత్తపడచ్చు. వేసవిలో చల్లచల్లటి శీతల పానీయాలు తాగితే ఈ డ్రింక్స్‌లో ఉండే అధిక చక్కెరలు శరీరంలోకి చేరి ఇన్సులిన్‌ స్థాయుల్ని ఒక్కసారిగా పెంచేస్తాయి. అలాగే శరీరంలో కొవ్వు నిల్వలు కూడా పెరుగుతాయి. కాబట్టి ఎప్పుడైనా సరే.. వీటికి దూరంగా ఉండమంటున్నారు నిపుణులు. లేత కోడి మాంసం, చేపలు, నట్స్‌, గుడ్లు, కొవ్వు తక్కువగా ఉండే కాటేజ్‌ చీజ్‌, గ్రీక్‌ యోగర్ట్‌, షియా విత్తనాలు, పప్పుధాన్యాలు, క్వినోవా తీసుకోవాలి. బ్రెడ్స్‌కు బదులుగా ఈ తరహా లీన్‌ ప్రొటీన్‌కు అలవాటు పడితే, పొట్ట దగ్గరి కొవ్వు తగ్గి, సన్నబడతాం.

ఒత్తిళ్లు, ఆందోళనల వల్ల మన శరీరంలో కార్టిసాల్‌ హార్మోన్‌ ఎక్కువగా ఉత్పత్తవుతుంది. ఇది జీవక్రియల పనితీరుపై ప్రతికూల ప్రభావం చూపి శరీరంలో కొవ్వు పేరుకుపోయేలా చేస్తుంది. అందుకే ఇలాంటి మానసిక సమస్యలకు దూరంగా ఉండాలంటే వ్యాయామం, యోగా, ధ్యానం వంటివి రోజువారీ అలవాటు చేసుకోవాలి. పండ్ల రసాలు మంచివని తెగ తాగేస్తుంటాం.. కానీ వాటిని మరీ మితిమీరి తాగడం వల్ల కూడా వాటిలో ఉండే చక్కెరలు పొట్ట చుట్టూ కొవ్వు పేరుకుపోయేలా చేస్తాయి. పొట్ట చుట్టూ కొవ్వు పేరుకుపోవడానికి ముఖ్య కారణం నిద్రలేమి. రోజుకు 8గంటలకు నిద్రకు కేటాయించటం చాలా ముఖ్యం.