Ivermectin : కరోనా చికిత్సకు ఐవర్​ మెక్టిన్​ వాడొద్దు, WHO వార్నింగ్

కరోనా చికిత్సలో ఐవర్ మెక్టిన్ వినియోగంపై ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ వో) హెచ్చరించింది. ఓ కొత్త జబ్బుపై ఉన్న మందులను వినియోగించాల్సి వచ్చినప్పుడు ఔషధ భద్రత, సమర్థత చాలా ముఖ్యమంది. కరోనాకు ఐవర్ మెక్టిన్ ను వాడొద్దని సూచిస్తోంది. క్లినికల్ ట్రయల్స్ చేయకుండా ఐవర్ మెక్టిన్ ను వాడొద్దని డబ్ల్యూహెచ్ వో చీఫ్ సైంటిస్ట్ డాక్టర్ సౌమ్యా స్వామినాథన్ అన్నారు.

Ivermectin : కరోనా చికిత్సకు ఐవర్​ మెక్టిన్​ వాడొద్దు, WHO వార్నింగ్

Who Warns Against Use Of Ivermectin For Covid 19 Treatment

Ivermectin : కరోనా చికిత్సలో ఐవర్ మెక్టిన్ వినియోగంపై ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ వో) హెచ్చరించింది. ఓ కొత్త జబ్బుపై ఉన్న మందులను వినియోగించాల్సి వచ్చినప్పుడు ఔషధ భద్రత, సమర్థత చాలా ముఖ్యమంది. కరోనాకు ఐవర్ మెక్టిన్ ను వాడొద్దని సూచిస్తోంది. క్లినికల్ ట్రయల్స్ చేయకుండా ఐవర్ మెక్టిన్ ను వాడొద్దని డబ్ల్యూహెచ్ వో చీఫ్ సైంటిస్ట్ డాక్టర్ సౌమ్యా స్వామినాథన్ అన్నారు.

ఇటు జర్మనీకి చెందిన మెర్క్ అనే ఫార్మా సంస్థ కూడా ఇదే సూచన చేస్తోంది. తమ శాస్త్రవేత్తలు ఎప్పటికప్పుడు ఐవర్ మెక్టిన్ వాడకంపై పరిశోధనలు చేస్తూనే ఉన్నారని సంస్థ వెల్లడించింది. ఇప్పటిదాకా వచ్చిన ఫలితాల్లో కరోనాపై మందు ప్రభావం ఏమాత్రం లేదని తేలినట్టు తెలిపింది. భద్రత, ఔషధ సామర్థ్యంపైనా సరైన ఆధారాలు లభించలేదంది.

మెర్క్ స్టడీ వివరాలను పోస్ట్ చేస్తూ సౌమ్యా స్వామినాథన్ ఐవర్ మెక్టిన్ వినియోగంపై ఆందోళన వ్యక్తం చేశారు. కాగా, గత రెండు నెలల్లో ఐవర్ మెక్టిన్ పై డబ్ల్యూహెచ్ వో వార్నింగ్ ఇవ్వడం ఇది రెండో సారి కావడం గమనార్హం. కరోనాపై ఆ మందు పనితీరుపైన, దాని వల్ల మరణాలు తగ్గుతాయన్న దానిపై ఎలాంటి ఆధారాలూ లేవని ఇంతకుముందు ఆందోళన వ్యక్తం చేసింది.

రోజురోజుకూ కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో గోవా ప్రభుత్వం కట్టడి చర్యలకు దిగింది. కోవిడ్ చికిత్స ప్రోటోకాల్‌ను విడుదల చేసింది. గోవాలోని 18 ఏళ్ల వయసు దాటిన వారందరూ యాంటీ వైరల్ డ్రగ్ `ఐవర్‌మెక్టీన్`ను తీసుకోవాలని సూచించింది. ఈ విషయాన్ని గోవా ఆరోగ్య శాఖ మంత్రి విశ్వజీత్ రాణె ప్రకటించారు.

`కోవిడ్, ఇతర వైరల్ జ్వరాల నివారణలో భాగంగా 18 ఏళ్లు దాటిన వారందరికీ ఐవర్‌మెక్టీన్ ఇవ్వాలని నిర్ణయించాం. అన్ని ప్రభుత్వ హెల్త్ సెంటర్లలోనూ ఈ మాత్రలు అందుబాటులో ఉంటాయి. 18 ఏళ్లు దాటిన వారందరూ 5 మాత్రల చొప్పున వేసుకోవాలి. కోవిడ్ లక్షణాలు ఉన్నా, లేకపోయినా ఈ మాత్రలను వేసుకోవాలి’ అని రాణె సూచించారు. ఐవర్ మెక్టీన్ ను వాడాలని గోవా ప్రభుత్వం చెబుతుంటే, మరోవైపు డబ్ల్యూహెచ్ వో మాత్రం వద్దని చెబుతోంది. దీంతో ఐవర్ మెక్టిన్ ఔషధం వినియోగంపై గందరగోళం నెలకొంది.