ఒడిషాలో విద్యుత్ పునరుద్ధరణకు 1000 మంది తెలంగాణ ఉద్యోగులు

ఫోని తుఫాను వల్ల దెబ్బ తిన్న ఒడిషా రాష్ట్రంలో సహాయ, పునరావాస చర్యలు చురుగ్గా సాగుతున్నాయి.

  • Published By: chvmurthy ,Published On : May 8, 2019 / 02:13 AM IST
ఒడిషాలో విద్యుత్ పునరుద్ధరణకు 1000 మంది తెలంగాణ ఉద్యోగులు

ఫోని తుఫాను వల్ల దెబ్బ తిన్న ఒడిషా రాష్ట్రంలో సహాయ, పునరావాస చర్యలు చురుగ్గా సాగుతున్నాయి.

హైదరాబాద్ : ఫోని తుఫాను వల్ల దెబ్బ తిన్న ఒడిషా రాష్ట్రంలో సహాయ, పునరావాస చర్యలు చురుగ్గా సాగుతున్నాయి. తుఫానుకు దెబ్బతిన్న విద్యుత్ సరఫరాను పునరుధ్ధరించేందుకు తెలంగాణ నుంచి వెయ్యిమంది ఉద్యోగులు మంగళవారం ఒడిషాకు బయలు దేరి వెళ్లారు. 

తుఫాను ధాటికి ఒడిషాలో కరెంట్ స్తంభాలు  పడిపోయి, లైన్లు తెగిపోయి చాలా ప్రాంతాలకు విద్యుత్ సరఫరా నిలిచి పోయింది.  విద్యుత్ సరఫరా పునరుధ్ధరణలో తమకు సహాయం అందించాలని ఒడిషా ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వాన్నికోరింది. దీనికి స్పందించిన సీఎం కేసీఆర్, సీఎస్ జోషి. ట్రాన్స్ కో సీఎండీ ప్రభాకర రావుతో మాట్లాడి వెయ్యి మంది ఉద్యోగులను ఒడిషాకు పంపించారు.