నీచుడు దొరికాడు : చిన్నారి ‘హత్యా’చారం కేసు ఛేదించిన పోలీసులు

  • Edited By: veegamteam , March 22, 2019 / 10:23 AM IST
నీచుడు దొరికాడు : చిన్నారి ‘హత్యా’చారం కేసు ఛేదించిన పోలీసులు

హైదరాబాద్ : అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఏఆర్ కే హోమ్స్ సమీపంలో 6 ఏళ్ల చిన్నారి హత్యాచార కేసును పోలీసులు ఛేదించారు. మార్చి 21 న ఆల్వాల్ లో హోలీ వేడుకల్లో ఆడిపాడిన చిన్నారి కనిపించకుండా పోవటం భయపడిన తల్లిదండ్రులు పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. స్థానికంగా జరిగిన హోలీ వేడుకల్లో రంగుల్లో మునిగి తేలుతు..హాయిగా ఆటపాటల్లో మునిగిపోయింది బాలిక. ఇదే అదనుగా భావించిన ఓ వ్యక్తి చిన్నారిపై కన్నేశాడు. మాయ మాటలు చెప్పి..దగ్గర్లో ఉన్న నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి పసిమొగ్గను చిదిమేశాడు. 
 

బాలానగర్ డీసీపీ పద్మజ తెలిపిన వివరాల  ప్రకారం..చిన్నారి పక్కింట్లో బీహార్ చెందిన వ్యక్తి ధర్మేంద్ర ఉంటున్నాడు. హోలీ వేడుకల్లో భాగంగా ధర్మేంద్రతో పాటు ఉంటున్న బావమరిది  రోషన్, రాజేశ్ కుమార్,  సురేంద్ర, సుబ్రహ్మణ్యం హోలీలో పాల్గొన్నారు. ఈ క్రమంలో మధ్యహ్నాం 3.30 నుంచి 4.30 మధ్యలో రాజేశ్ కుమార్అనే వ్యక్తి అదశ్యమయినట్లుగా సీసీ కెమెరాల ఫుటేజీల ఆధారంగా పోలీసులు తెలుసుకున్నారు.  ఈ కోణంలో దర్యాప్తు కొనసాగించి రాజేశ్ ను అదుపులోకి తీసుకుని విచారించగా నేరాన్ని అంగీకరించాడు.  

అందరు హోలీ ఆడుకునే సమయంలో చిన్నారిని తీసుకుని రైల్వే ట్రాక్  వల్లనే ఉన్న నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ దారుణాన్ని తట్టుకోని చిన్నారి అరవటంతో తన వద్ద ఉన్న చిన్న ఇనుప ముక్కతో గొంతుపై దాడి చేసి పలు మార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ హింసను తట్టుకోలేని చిన్నారి మృతి చెందిందని డాక్టర్స్ రిపోర్ట్ లో వెల్లడయ్యిందని తెలిపారు పోలీస్ అధికారులు. ఈ ఘటన జరిగిన కేవలం 12 గంటల్లోనే ఈ కేసును చేధించామని తెలిపారు. నిందితుడు బీహార్ కు చెందిన వ్యక్తి కాబట్టి అరెస్ట్ చేసి జ్యుడిషియల్ కస్టడీకి పంపించామని తెలిపారు.  కాగా హోలీ  ఆడుకోవటానికి వెళ్లిన్న చిన్నారి ఎంతకూ ఇంటికి రాకపోవటంతో అల్వాల్ పీఎస్‌లో చిన్నారి మిస్సింగ్ కేసు పెట్టారు. దీంతో దర్యాప్తు చేపట్టిన పోలీసులు 12 గంటల్లో కేసు మిస్టరీ ఛేదించారు.