Book Of Records : 20 నెలల చిన్నారికి ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటు

Book Of Records : 20 నెలల చిన్నారికి ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటు

Baby

Updated On : August 5, 2021 / 4:04 PM IST

Book Of Records : చిన్నవయస్సు పిల్లల అల్లరి చేష్టలు తెగముద్దొచ్చేస్తుంటాయి. ఒక్కోసారి వారు చేసే కొంటెపనులు కొపం తెప్పించినా ఆలోచిస్తే మాత్రం ముచ్చటగొలుపక మానవు. పెద్ద వయస్సు వారు చిన్నారులు చేసే పనులు చూసి బాల్యాంలో తాము చేసిన పనులు గుర్తుకు తెచ్చుకుంటుంటారు. ఈ విషయాలు పక్కన పెడితే హైద్రాబాద్ కు చెందిన 20నెలల వయస్సున్న ఓ చిన్నారి తన సామర్ధ్యాన్ని మించి బరువులు ఎత్తుతూ అందరిని ఆశ్ఛర్యంలో ముంచెత్తుతుంది. తాజాగా 5కేజీల బరువును ఎత్తి ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటు దక్కించుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే హైద్రాబాద్ లో నివాసముండే దాసరి సందీప్, స్నిగ్ధ బసుల కుమార్తె సాయి అలంక్రిత వయస్సు 20 మాసాలు. ఏడాది వయస్సు నుండే ఇంట్లో ఉన్న వస్తువులను పైకి ఎత్తుతూ అందరిని అబ్బురపరిచేది. ఆ వయస్సులోనే రెండు లీటర్ల వాటర్ బాటిల్ ని అవలీలగా ఎత్తుకుని నడిచేది.

దీంతో అలంక్రిత తల్లిదండ్రులు పాప శక్తి సామర్ధ్యాలను గమనిస్తూ వస్తున్నారు. 17నెలల వయస్సులో 4.2కేజీల పుచ్చకాయను పైకి ఎత్తింది. ప్రస్తుతం 20 నెలల వయస్సులో 5కేజీల బరువులను ఎత్తగలుగుతుంది. 5కేజీల గోధుమ పిండి ప్యాకెట్ ను ఈజీ గా ఎత్తగలుగుతుండటంతో చిన్నారి టాలెంట్ ను గుర్తించిన ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ ప్రతినిధులు రికార్డ్సులో చిన్నారి పేరు నమోదు చేశారు.